Kho Kho tourney
-
ఖో–ఖో లీగ్.. తెలుగు యోధాస్ కెప్టెన్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: ఖో–ఖో లీగ్ ఫ్రాంచైజీ టోర్నీ ‘అల్టిమేట్ ఖో–ఖో’కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ ఇది వరకే హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రాంచైజీని చేజిక్కించుకోగా...ఆ జట్టు ‘తెలుగు యోధాస్’ పేరుతో బరిలోకి దిగుతోంది. అటాకింగ్ ప్లేయర్ ప్రజ్వల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ ప్రతీక్ వాయికర్ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆరు ఫ్రాంచైజీలు ముంబై, ఒడిశా, చెన్నై, రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్‌ల మధ్య ఈ సీజన్ పోటీలు ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు ఇతర ఫ్రాంచైజీలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ఐపీఎల్ తరహాలో ‘ప్లేఆఫ్స్’ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. సోనీ నెట్వర్క్ చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ఖో–ఖో పోటీలు ప్రసారం అవుతాయి. తెలుగు యోధాస్ జట్టు 14న తమ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడుతుంది. జట్టు వివరాలు అటాకర్: ఆదర్శ్ దత్తాత్రే, ఆదిత్య దాస్, కేసీ ధనుశ్, గవర వెంకటేశ్, పి.హేమచంద్రన్, కె.ప్రజ్వల్, రోక్సన్ సినమ్, సచిన్ భార్గో, సదానంద తోక్చోమ్, వి.సుబ్రమణి; డిఫెండర్: భరత్ అవధూత్, బొజ్జం రంజిత్, దీపక్ విఠల్, ధ్రువ్, వైభవ్ ప్రసాద్, సుదర్శన్; ఆల్‌రౌండర్: అనుకూల్ సర్కార్, అరుణ్ అశోక్, ఎస్.అరుణ్, సంబి బాల, కిరణ్ ప్రతీక్, రోహన్ తనాజీ -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజులు జరిగే మూడో రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల ఖోఖో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటమలు సహజమని, క్రీడల్లో పాల్గొనడమే ప్రధానమన్నారు. సీఆర్డీఏ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బీదమస్తా¯ŒS రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ప్రోత్సాహకంగా రూ.25, రూ.15, రూ.10, రూ.5వేలు ప్రోత్సాహక బహుమతిగా అందచేస్తామన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య, రాష్ట్ర ఖోఖో అసోసియేష¯ŒS ప్రధాన కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేçష¯ŒS కోశాధికారి పసుపులేటి రామమూర్తి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు చంచ లనాయుడు,రాజనాయుడు షంషుద్దీన్ పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర క్రీడాపతాకాన్ని మేయర్ అబ్దుల్ అజీజ్,జిల్లా క్రీడాపతాకాన్ని మేకల రాజేంద్ర ఆవిష్కరించా రు. రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని అతిధులు స్వీకరించారు. కపోతాలు ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 350మంది క్రీడాకారులు హాజ రయ్యా రు. పోటీలను. ఫ్లడ్‌లైట్ల వెలుగులో శనివారం రాత్రి ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపికచేయడం జరుగతుం దని ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులతో రాష్ట్ర జట్లు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.