రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం | State level Kho Kho tourney | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

Published Sun, Oct 2 2016 2:40 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

 
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజులు జరిగే మూడో రాష్ట్ర స్థాయి సీనియర్‌ పురుషుల ఖోఖో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటమలు సహజమని, క్రీడల్లో పాల్గొనడమే ప్రధానమన్నారు. సీఆర్‌డీఏ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బీదమస్తా¯ŒS రావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ప్రోత్సాహకంగా రూ.25, రూ.15, రూ.10, రూ.5వేలు ప్రోత్సాహక బహుమతిగా అందచేస్తామన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య, రాష్ట్ర ఖోఖో అసోసియేష¯ŒS ప్రధాన కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేçష¯ŒS కోశాధికారి పసుపులేటి రామమూర్తి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు చంచ లనాయుడు,రాజనాయుడు షంషుద్దీన్‌ పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర క్రీడాపతాకాన్ని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్,జిల్లా క్రీడాపతాకాన్ని మేకల రాజేంద్ర ఆవిష్కరించా రు. రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని అతిధులు స్వీకరించారు. కపోతాలు ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 350మంది క్రీడాకారులు హాజ రయ్యా రు. పోటీలను. ఫ్లడ్‌లైట్ల వెలుగులో శనివారం రాత్రి ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపికచేయడం జరుగతుం దని ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్‌ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులతో రాష్ట్ర జట్లు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. 

Advertisement
Advertisement