సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జూనియర్ ఖో- ఖో టోర్నమెంట్‌లో కేజీపీ రెసిడెన్షియల్ స్కూల్ చాంపియన్‌గా నిలిచింది. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలికల ఫైనల్లో కేజీపీ రెసిడెన్షియల్ స్కూల్ (కుల్కచర్ల) 8-4తో జెడ్పీహెచ్‌ఎస్, తూముకుంటపై గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ (బాచుపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (దశంపల్లి) జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
బాలుర విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ (తూముకుంట) టైటిల్‌ను గెల్చుకోగా... తుక్కుగూడ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో తూముకుంట స్కూల్ 10-9తో తుక్కుగూడ జట్టును ఓడించింది. టీటీడబ్ల్యుఆర్‌ఎస్ (కుల్కచర్ల), కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ (బాచుపల్లి) జట్లు మూడు, నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో చైతన్యపురి కార్పొరేటర్ విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి జయప్రకాశ్ పాల్గొన్నారు.