
అవకాశాల కోసం ఎవరినీ అడగను
అవకాశాల కోసం ఎవరినీ అడగనని, అందుకు ఎవరి వద్దా చేతులు కట్టుకుని నిలబడనని అంటోంది నటి ఇలియానా.
అవకాశాల కోసం ఎవరినీ అడగనని, అందుకు ఎవరి వద్దా చేతులు కట్టుకుని నిలబడనని అంటోంది నటి ఇలియానా. ఇటీవల ఈ బ్యూటీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కెక్కాలన్నది పరిపాటిగా పెట్టుకున్నట్లుంది. ఇంతకు ముందు టాలీవుడ్‌లో యమ క్రేజీ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా అనూహ్యంగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది.దీంతో ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్‌లోనూ అవకాశాలు అడుగంటాయి. ఇక బాలీవుడ్‌లోనూ పరిస్థితి అంతంత మాత్రమే. ఆ మధ్య అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించిన రుస్తుం చిత్రం వసూళ్ల వర్షం కురిపించినా ఇలియానాను బాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు.
ప్రస్తుతం అజయ్ దేవ్‌గన్‌తో కలిసి బాద్‌షా అనే ఒక్క చిత్రంలోనే నటిస్తోంది.కాగా మగాడి సంపాదన, ఆడదాని వయసు చెప్పకూడదనే సామెత ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చెప్పనే అక్కర్లేదు. అలాంటిది ఇటీవల తన అసలు వయసు 30 అంటూ వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరచింది.ఆ విషయంలోనూ భారీ ప్రచారాన్నే పొందిన ఇలియానా తాజాగా ఒక వేదికపై మాట్లాడుతూ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం ఇష్టం అని, అయితే అక్కడ అవకాశాలు రావడం కష్టం అని పేర్కొంది.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అవే ఉన్నత స్థాయిలో నిలబెడతాయని, లేకపోతే బాలీవుడ్ మొత్తం మనల్ని దూరంగా పెట్టేస్తుందని అంది. అయఇతే అవకాశాలు లేకపోయినా పర్వాలేదు గానీ తాను మాత్రం వాటి కోసం ఎవరిని అడగనని, ఎవరి వద్ద చేతులు కట్టుకుని నిలబడి బతిమలాడనని అంటూ మరో సారి వార్తల్లోకెక్కింది.ఈ విధంగా ఉచిత ప్రచారం పొందాలన్నది ఈ అమ్మడి ట్రిక్కుల్లో ఒక భాగం అనుకుంటా! అనే భావన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.