బాలీల్యాండ్ | Bali Land City Concert Music show | Sakshi
Sakshi News home page

బాలీల్యాండ్

Nov 15 2014 12:07 AM | Updated on Sep 2 2017 4:28 PM

బాలీల్యాండ్

బాలీల్యాండ్

ఎంటీవీ ‘బాలీల్యాండ్ సిటీ కన్సర్ట్’ మ్యూజిక్‌తో షేక్ చేసింది. బాలీవుడ్ గాయకులు మికాసింగ్, బాద్‌షా, కనికాకపూర్..

ఎంటీవీ ‘బాలీల్యాండ్ సిటీ కన్సర్ట్’ మ్యూజిక్‌తో షేక్ చేసింది. బాలీవుడ్ గాయకులు మికాసింగ్, బాద్‌షా, కనికాకపూర్, ఆకృతిల గానం.. డీజేలు చేతస్, ఎన్‌వైకేలు రాకింగ్ మ్యూజిక్ బీట్స్.. ఆహూతులను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు. మాదాపూర్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈ మెగా ఈవెంట్ సిటీజనులకు వీనుల విందు చేసింది.

ఆరేళ్ల నుంచే...
‘ఆరేళ్ల నుంచే క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీసు మొదలెట్టా. చదువు పూర్తయిన తర్వాత లండన్‌కు వెళ్లా. ప్లే బ్యాక్ సింగర్ కావడానికి ముందు యూరప్‌లో మోడలింగ్ చేశా. 2012లో జగ్ని జీ పాట పాడా. రాగిని ఎంఎంఎస్2లో పాడిన బేబీ డాల్ పాట నాకు బంపర్ అవకాశాలు తీసుకొచ్చింది. షారుఖ్‌ఖాన్ నటించిన హ్యపీ న్యూ ఇయర్ సినిమాలో పాడే లక్కీ చాన్స్ కొట్టేశా. హైదరాబాదీలు మ్యూజిక్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు’ అని పంజాబీ ఫోక్ సింగర్ కనికాకపూర్ ‘సిటీప్లస్’తో చెప్పారు. పాత, కొత్త తరం సంగీతాన్ని మిక్స్‌చేసే బాణీల్లో ఉండే మజానే వేరని మికాసింగ్ అన్నారు. ఇక్కడి వంటలు బాగా ఇష్టమన్నారు.  

 వీఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement