రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్‌, స్పందించిన ర్యాపర్‌ | Viral Video: Musician Shares How To Make a Badshah Song in 2 minutes | Sakshi
Sakshi News home page

రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్‌, స్పందించిన ర్యాపర్‌

Published Fri, Jan 14 2022 2:59 PM | Last Updated on Fri, Jan 14 2022 3:00 PM

Viral Video: Musician Shares How To Make a Badshah Song in 2 minutes - Sakshi

హ్యూమర్‌ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ మాటకొస్తే మ్యూజిక్‌ అంటే కూడా! ఈ రెండిటినీ మిక్స్‌ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిగానీ, ఆ కళ కాస్త గట్టిగా తెలిసుండాలి. సరిగ్గా ఈ కోవకు చెందిన మ్యూజిషియన్‌ అన్ష్‌మన్‌ శర్మ. ‘హౌ టూ మేక్‌ ఏ బాద్‌షా సాంగ్‌ ఇన్‌ 2 మినిట్స్‌’ పేరుతో ఆయన ఒక వీడియో రూపొందించాడు. సాంగ్‌ మేకింగ్‌ గురించి ఎనిమిది స్టెప్స్‌తో జనవరి 10న పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు 9 లక్షల పైనా వ్యూవ్స్‌ వచ్చాయి. ఇలాంటి వీడియోనే గతంలో రిత్విక్, ప్రతీక్‌ పాటల గురించి చేసి శబ్భాష్‌ అనిపించుకున్నాడు శర్మ.  అయితే ఈ వైరల్ వీడియో చివరికి రాపర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ‘అతను దాదాపు కొల్లగొట్టాడని ప్రమాణం చేస్తున్నాను" అంటూ బాద్‌షా నవ్వుతున్న ఎమోజీ షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement