![Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/4/4444.jpg.webp?itok=m2zCfEag)
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్‌షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్‌లతో హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్‌ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్‌షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్‌షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు.
'ఈ జడ్జ్‌లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్‌ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్‌ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్‌షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్.
Comments
Please login to add a commentAdd a comment