
Miss Universe Harnaaz Sandhu About Dating: సుమారు 21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల భారతీయ యువతి హర్నాజ్ సంధు విశ్వసుందరిగా నిలవడంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే అంతర్జాతీయ వేదికగా ఆమెకు ఎదురైన ‘ఇబ్బందికర’ అనుభవం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. ఆ అనుభవంతో పాటు పలు అంశాగా తాజాగా ఈ ఛండీగఢ్ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
బాగా డబ్బున్న ఓ ముసలి వ్యక్తి.. కష్టపడే తత్వం ఉన్న ఓ యువకుడు.. ఇద్దరిలో డేటింగ్ కోసం ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్న ఎదురైంది హర్నాజ్‌కు. దానికి ఆలోచించకుండానే కష్టపడే వ్యక్తి అని సమాధానం ఇచ్చిందామె.‘‘కష్టం విలువేంటో నాకు తెలుసు. గతంలో చాలా కష్టపడ్డా. భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి ఎదురుకావొచ్చు. నాకు కష్టం విలువేంటో తెలుసు. అందుకే కష్టం తెలిసిన వ్యక్తినే కోరుకుంటా.. అప్పుడే మా లక్ష్యాల్ని పరస్పరం గౌరవించుకున్నవాళ్లం అవుతాం’’ అని సమాధానమిచ్చింది హర్నాజ్.
మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
ఇక బాలీవుడ్ ఎంట్రీ, కాస్టింగ్ కౌచ్ అంశాలపై ప్రశ్న ఎదురుకాగా.. వాటిపై స్పందించడం తనకు తొందరపాటే అవుతుందని, ప్రస్తుతం తాను తన విజయాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నానని తెలిపింది హర్నాజ్. ఒకవేళ హాలీవుడ్‌లో గనుక అవకాశం వస్తే మాత్రం ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ను చాటే బలమైన క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది.
ఇక మిస్ యూనివర్స్-2021 గ్రాండ్ ఫినాలే సందర్భంగా.. అమెరికన్ టీవీ హోస్ట్ స్టీవ్ హార్వే, హర్నాజ్‌తో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జంతువులను అనుకరిస్తూ శబ్దాలు చేయాలంటూ స్టీవ్, హర్నాజ్‌ను కోరగా ఆమె అలానే చేసింది. ఈ వ్యవహారంపై హర్నాజ్ స్పందిస్తూ.. అది అనవసరమైన ప్రశ్న అని తాను అనుకోవట్లేదని, అంతర్జాతీయ పోటీల తీరు కొందరు అనుకుంటున్నట్లు ఉండదని, ఆయన తీరు తనకేం ఇబ్బంది అనిపించలేమని, పైగా ఆ సంభాషణను తాను ఆస్వాదించానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment