భర్త క్షేమం కోసం... | Karwa Chauth 2024: Kiara Advani and Shilpa Shetty and Sonakshi Sinha And More Bollywood Celebrity Festive Looks | Sakshi
Sakshi News home page

భర్త క్షేమం కోసం...

Published Mon, Oct 21 2024 12:28 AM | Last Updated on Mon, Oct 21 2024 12:28 AM

Karwa Chauth 2024: Kiara Advani and Shilpa Shetty and Sonakshi Sinha And More Bollywood Celebrity Festive Looks

డిజైనర్‌ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్‌ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్‌ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్‌కి బాలీవుడ్‌లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...

‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్‌ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్‌ ఇక్బాల్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్‌లో జరిగింది. తొలి కర్వా చౌత్‌ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్‌ జరుపుకున్న వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.

కాగా ఇటీవల వర్కౌట్‌ చేస్తుండగా రకుల్‌కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్‌ రెస్ట్‌లో ఉన్నారు. అయితే కర్వా చౌత్‌ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్‌తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్‌ రెస్ట్‌వాలా ఫస్ట్‌ కర్వా చౌత్‌’ అంటూ ఆ ఫొటోను షేర్‌ చేశారు రకుల్‌. అలాగే అదితీ రావ్‌ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్‌. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్‌ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్‌కిత్‌ సామ్రాట్‌తో ఆమె పెళ్లి  ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్‌. నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.

రెండో కర్వా చౌత్‌కి భర్త పేరులోని ‘ఎస్‌ఎమ్‌’ అక్షరాలను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్‌. గత ఏడాది సెప్టెంబర్‌లో రాఘవ్‌ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్‌ సింబల్స్‌తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్‌ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్‌ కపూర్‌ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్‌ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్‌ల వివాహం జరిగింది.

అయితే ఫాస్టింగ్‌ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్‌. కాగా నటుడు అనిల్‌ కపూర్‌ భార్య సునీతా కపూర్‌ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్‌ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్‌ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్‌ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement