Karwa Chauth
-
ఇంటి మహాలక్ష్మి.. భార్య కాళ్లు మొక్కితే తప్పేంటి? : హీరో
భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు కర్వాచౌత్ పండగ జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జల్లెడలో భర్త ముఖాన్ని చూస్తారు. ఉత్తరాదిన సెలబ్రిటీలందరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే.. భార్య, నటి షీతల్ ఠాకూర్ కాళ్లకు నమస్కరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తనను విపరీతంగా ట్రోల్ చేశారట!భార్య కాళ్లు మొక్కితే..దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ఫోన్లో ఉన్న ఫోటోల్లో నాలుగు బాగా హైలైట్ అయ్యాయి. కొందరికి అవి నచ్చాయి. మరికొందరికి నచ్చకపోవడంతో నానా బూతులు తిట్టారు. ఎందుకలా తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది తప్పేమీ కాదని నా అభిప్రాయం.అది తప్పేం కాదుఆమె నా ఇంటి మహాలక్ష్మి. లక్ష్మీదేవి పాదాలు తాకడం తప్పు కాదు. పదేళ్ల క్రితం నా జీవితంలో అడుగుపెట్టి లైఫ్‌ను అందంగా మార్చిందని గర్వంగా చెప్తాను. తను వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతోంది. మీరెన్ని అనుకున్నా నేను నా భార్య కాళ్లు మొక్కడం మానను అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్కాగా విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. ఇకపోతే విక్రాంత్ మాస్సే.. ద సబర్మతి రిపోర్ట్ అనే సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: అది లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు: హీరో రాకేశ్ కామెంట్స్ -
ప్రముఖ బ్యానర్లో చిన్న జాబ్.. తిరిగి అదే సంస్థతో హీరోయిన్గా ఛాన్స్ (ఫోటోలు)
-
కర్వా చౌత్ ట్రాజెడీ : ఆవేశంతో భార్య, ఆమె చీరతో భర్త
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.జైపూర్‌లోని హర్మారా ప్రాంతంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్హెచ్ఓ ఉదయ్ భన్ తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా... -
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
కర్వా చౌత్: భార్య కాళ్లు మొక్కిన హీరో
ఉత్తరాదిన పాటించే ఆచారం.. కర్వా చౌత్. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య రోజంతా ఉపవాసం ఉంటుంది. రాత్రి చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూశాక భోజనం చేస్తారు. సోనాక్షి సిన్హ, రకుల్ ప్రీత్ సింగ్, అదితి రావు హైదరి, కృతి కర్బందా, కియారా అద్వానీ, పరిణతీ చోప్రా, సోనమ్ కపూర్, శిల్పా శెట్టి.. ఇలా పలువురు తారలు కర్వాచౌత్ జరుపుకున్నారు.భార్య కాళ్లు మొక్కిన హీరో12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మాస్సే దంపతుల కర్వాచౌత్ వేడుక మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందరిలాగే విక్రాంత్ భార్య, నటి షీతల్ గౌతమ్ కూడా భర్త ముఖాన్ని జల్లెడలో చూసింది. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. ఆ వెంటనే విక్రాంత్ మాస్సే సైతం షీతల్ కాళ్లకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలే కాదు గౌరవం అని కూడా ఇట్టే తెలిసిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.సినిమా..ఇకపోతే విక్రాంత్- షీతల్ 2015 నుంచి డేటింగ్ మొదలుపెట్టారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పని చేశారు. ఏళ్లపాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట 2022లో పెళ్లి పీటలెక్కింది. ఈ ఏడాది ప్రారంభంలో వీరికి పండంటి కుమారుడు జన్మించాడు. అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. హసీన్ దిల్రుబా, చపాక్, గ్యాస్‌లైట్, 12th ఫెయిల్ సినిమాలతో విక్రాంత్ మాస్సే గుర్తింపు సంపాదించుకున్నాడు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ -
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్‌కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్‌లో జరిగింది. తొలి కర్వా చౌత్‌ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్‌కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్‌తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్‌కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్‌లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్‌తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్‌ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
Karwa Chauth: కర్వాచౌత్ వేడుకల్లో సెలబ్రిటీ జంటలు (ఫోటోలు)
-
ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా వివాదస్పద వ్యాఖ్యలతో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా పూనమ్ తన తీరుతో మరోసారి వార్తల్లోకెక్కింది. నార్త్ ప్రజలు భర్తల క్షేమం కోరుతూ చేసే ప్రత్యేక పూజ కర్వాచౌత్ (Karwa Chauth). పెళ్లయిన మహిళలు స్పెషల్‌గా జరుపుకునే ఈ పండగను శుక్రవారం పూనమ్ సెలబ్రెట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అందరికి కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే ఇప్పుటికే మీకు పెళ్లయిపోయిందా? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశ్నలపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ‘ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచన విధానంతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే.. పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారు. అంతేకాదు మహా శివుడుని కూడా కోలుస్తారు’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్ I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking - educate yourself - #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022 -
వెన్నెల వెలుగుల్లో కర్వా చౌత్ (ఫొటోలు)
-
హీరోయిన్ పూనమ్ కౌర్‌కు పెళ్లయిందా? ఆ ఫోటో వైరల్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. కర్వాచౌత్ (Karwa Chauth)శుభాకాంక్షలు చెబుతూ చేతిలో జల్లెడను పట్టుకొని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూనమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడు దీనిపైనే తెగ చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్‌ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో చంద్రుడిని చూసిన వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటిది పెళ్లికాని పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంపై నెటిజన్లు సందేహాలు లేవనెత్తుతున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ పూనమ్ పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
నేను ప్రెగ్నెంట్ కాదు: బిగ్‌బాస్ ఫేం
నవంబర్ 4న కర్వా చౌత్ వేడుకల సందర్భంగా బయటకు వచ్చిన బిగ్‌బాస్ ఫేం ప్రిన్స్ నరులా, యువికా చౌదరి ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. యువికా కారు నుంచి దిగి వస్తుండగా భర్త ప్రిన్స్ ఆమెను చేయి పట్టుకొని ప్రేమగా తీసుకొచ్చాడు.ఈ వీడియోలో యువికా పింక్ కలర్ దుప్పట కలిగిన అనార్కలి దుస్తులను ధరించారు. ఈ డ్రెస్ ఆమెకు కాస్తా వదులుగా ఉండటం, కారు నుంచి దిగగానే దుప్పటతో కవర్ చేయడంతో యువికా ప్రస్తుతం గర్భవతి అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో తాజాగా నటి స్పందించారు. తను గర్భవతినని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇటీవల ఆమె కరోనా బారినపడి కోలుకున్నట్లు పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఆసుపత్రికి వెళ్లగా తనకు కోవిడ్ సోకినట్లు తేలిందన్నారు. అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పుడు వార్తలను సృష్టించవద్దని కోరారు. చదవండి: టాక్ షో హోస్ట్‌గా సమంత! తన డ్రెస్సింగ్‌పై మాట్లాడుతూ.. ‘నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ నాకు డిజైన్ కలిగిన దుపట్టా ఇష్టం. అందుకే దాన్ని ధరించాను. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటాం. అది జరగాల్సిన సమయంలో తప్పక జరుగుతంది’ అని పేర్కొన్నారు. కాగా యువికా చౌదరి, ప్రిన్స్ నరులా 2015లో వచ్చిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 9 లో తొలిసారిగా కలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక నిశ్చితార్థం చేసుకొని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ రెండేళ్లలో తన జీవితం ఆనందంగా, సంతోషంగా గడిచిపోయిందని యువికా ఓ పోస్టు రూపంలో పేర్కొన్నారు. కాగా యువికా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి View this post on Instagram #princenarula #yuvikachaudhary for #karvachauth ❤ #paptalk A post shared by Viral Bhayani (@viralbhayani) on Nov 4, 2020 at 4:00am PST -
క్షేమం కోరి...
బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!
లక్నో: శోభా, రీనా, పింకీ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఏం చేసినా ఈ ముగ్గురు కలిసే చేస్తారు. కలిసి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కలిసికట్టుగా ఒకేసారి పెళ్లిపీటలెక్కారు. కానీ విడ్డూరంగా ముగ్గురూ ఒక్కడినే మనువాడారు. ఇది జరిగి 12 సంవత్సరాలు అవుతోంది. అయితే ఉత్తరాదిన ఆచరించే కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకోట్‌కు చెందిన కృష్ణకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు కావడం. ప్రస్తుతం ఈ ముగ్గురికీ చెరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లంతా కలిసి కంసీ రామ్ కాలనీలో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలవుతున్నా ఆ కుటుంబంలో గొడవలు అనేవే లేవట. (చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య) ఈ కుటుంబం గురించి వాళ్ల బంధువు మాట్లాడుతూ.. " అతడి ముగ్గురు భార్యలు చదువుకున్నవాళ్లు. వాళ్లు ఎప్పుడూ విడిగా ఉందామనుకోలేదు. కలిసి ఉండటంలోనే సంతోషం ఉందని నమ్ముతున్నారు. కానీ కృష్ణ ఒకే వేదికపై ఈ ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్నది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అతడు కూడా దీని గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు" అని చెప్పుకొచ్చారు. ఇక కర్వా చౌత్ సందర్భంగా భర్త సుఖ సంతోషాలు కోరుతూ ముగ్గురు భార్యలు ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడికి పూజలు చేశారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూశారు. ఆ సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: హ్యాపీ కర్వాచౌత్ గౌతం: కాజల్) -
రానా- మిహికల కర్వాచౌత్ ..
రానా దగ్గుబాటి- మిహిక బజాబ్‌ల జట్ట పెళ్లైన తొలి ఏడాది వస్తున్న అన్ని పండగలను చాలా సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు తర్వాత తాజాగా కర్వా చౌత్‌ను కూడా ఈ జంట చాలా ఆనందంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను మిహిక తల్లి బంటి బజాబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎరుపు రంగు చీర ధరించి, సంప్రదాయమైన నగలను మిహిక ధరించింది. నుదుట కుంకుమ, బంగారు రంగు చెవి దిద్దులు, ముక్కు పుడక పెట్టుకొని తెలుగమ్మాయిలా కనిపించింది. ఇక రానా లుక్ విషయానికి వస్తే ఎప్పటిలాగే సింపుల్‌గా కనిపించాడు. బ్లాక్ కలర్ టీ షర్ట్ జీన్స్ వేసుకున్నాడు. ఈ ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా బంటి బజాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. హ్యాపీ కర్వా చౌత్, గాడ్ బ్లెస్ యూ అంటూ ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. -
కొత్త ఇల్లు... తొలి పండగ
ఇలా పెళ్లయిందో లేదో అలా కొత్తింట్లోకి అడుగుపెట్టారు కాజల్, గౌతమ్. అక్టోబర్ 30న పెళ్లయింది. బుధవారం గృహప్రవేశం అయ్యారు. అలాగే తొలి పండగ కూడా చేసుకున్నారు. ఉత్తరాదిన ఆచరించే కర్వా చౌత్ పండగను బుధవారం జరుపుకున్నారు. భర్త క్షేమం కోసం స్త్రీలు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకూ ఉపవాసం ఉండి, పూజలు చేస్తారు. భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక ఉపవాసాన్ని విరమిస్తారు. ఎరుపు రంగు డిజైనర్ శారీ, ఎరుపు రంగు మాస్క్‌తో కర్వా చౌత్ స్పెషల్ అంటూ కాజల్ ఒక ఫొటోను షేర్ చేశారు. అలాగే కొత్తింట్లోకి అడుగుపెట్టిన సందర్భంగా దిగిన ఫొటోను షేర్ చేసి, ‘నా ప్రియమైన భార్యతో’ అన్నారు గౌతమ్ కిచ్లు. -
హ్యాపీ కర్వాచౌత్ గౌతం: కాజల్
కోవిడ్ మహమ్మారి కారణంగా హంగు, ఆర్భాటాలు లేకుండానే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. అక్టోబర్ 30న ముంబైలోని ప్లష్ హోటల్లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ కూడా తమ పెళ్లి వేడుకను అద్భుతంగా, కన్నులపండుగగా చేసుకున్నా కూడా దానికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ముహూర్తం ఖరారైన నాటి నుంచి వధూవరుల ఇళ్లు వేడుకలకు కొలువైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఈ కొత్తజంట కర్వా చౌత్ పండుగ చేసుకోవడంలో నిమగ్నమైంది. భర్త బాగుండాలని భార్య చేసే పూజ ఇది. కార్తిక మాసంలోని పౌర్ణమి తర్వాత నాలుగు రోజులకు వచ్చే ఈ పండుగను ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. (చదవండి: కాజల్ నో చెప్పింది ఇందుకే..) కాగా కాజల్ జరుపుకుంటున్న మొదటి కర్వా చౌత్ ఇదే కావడంతో ఆమె ఆనందం రెట్టింపైంది. బావ చేతికి మెహెందీ పెడుతున్న నిషా అగర్వాల్, తన పక్కనే కూర్చుని, నవ్వులు చిందిస్తున్న కాజల్ అగర్వాల్ ఫోటో సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది. కాజల్ ఎరుపు రంగు చీరలో, అదే రంగు మాస్క్‌తో తళుక్కుమంటున్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో గోరింటాకు పెట్టుకున్న అయిదు చేతులను చూపిస్తూ ‘‘ఎవరు ఎవరో కనిపెట్టండి’’ అంటూ ఫాలోవర్స్‌ను ఆటపట్టించారు. పెళ్లి తర్వాత ముంబాయిలోని కొత్త ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకున్న కాజల్, గౌతమ్ జంట ఇటీవల ఆ ఇంటికి గృహప్రవేశ వేడుక కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘కొత్త ప్రారంభాలకు శ్రీకారం. నా భార్యతో మా కొత్త ఇంట్లో..’’ అంటూ పోస్ట్ చేశారు. -
కర్వా చౌత్; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ కామెంట్
సంసృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. ఆచారాలు, కట్టుబాట్లకు ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి సంప్రదాయల్లో భర్త మంచి కోసం భార్య చేసే ఉపవాసం కూడా ఒకటి.. దీనినే కర్వా చౌత్ అంటారు. దక్షిణాదినా దీనికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తనతో ఏడడుగులు వేసి, జీవితాంతం కలిసుండే వ్యక్తి కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ భార్యలు ఈ రోజు ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేస్తారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూస్తారు. అయితే ఈ కర్వా చౌత్ సందర్భంగా మహిళలు తమ చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. తమ జీవితం కూడా భర్తతో అదే విధంగా రంగులమయం కావాలని ఆకాంక్షిస్తారు. చదవండి: 'అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా' ఈ ఏడాది కర్వా చౌత్ నవంబర్ 4న వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. నటి శిల్పా శెట్టి తన భర్త కోసం ప్రతి ఏడాది ఉపవాసం ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు తన హాస్య చతురతో అందరిన నవ్వించే రాజ్ కుంద్రా ఓ మీమ్ షేర్ చేశారు. ఇందులో తన కోసం ఉపవాసం చేస్తున్న భార్య, నటి శిల్పా శెట్టి ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ రోజు తన భార్య జల్లెడ సాయంతో తన ముఖాన్నే చూస్తుందని ప్రతి భర్త ఊహించుకుంటాడు. కానీ వాస్తవానికి ఆమెకు అద్దంలో ఆ తరువాత ఏం తినాలో అవి కనిపిస్తాయి’. అంటూ సరదా కామెంట్ చేశారు. అదే విధంగా నటి కియారా అద్వానీ కూడా ఈ పండగ రోజు మెహెందీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే కియారాకు ఇంకా వివాహం కాలేనందున ఆమె తన తల్లికి మెహెందీ పెట్టడం ద్వారా కర్వా చౌత్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. Happy Karva Chauth ❤️ pic.twitter.com/2OncbZjVXc — Raj Kundra (@TheRajKundra) November 4, 2020 -
ఉత్తరాదిన ఘనంగా కర్వాచౌత్ ఫెస్టివల్
-
నేను కపూర్ అమ్మాయిని...కడుపు మాడ్చుకోలేను
భర్తల క్షేమం కోసం భార్యలు కడుపు మాడ్చుకోవడం అనాచారం’’ అంటున్నారు బాలీవుడ్ భామ కరీనా కపూర్. భర్తల బాగుకోసం భార్యలు ఉత్తరాదిన జరిపే పండుగ ‘కడవా చౌథ్’. ఆ రోజు భార్యలందరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. జల్లెడలో చందమామను చూసి తమ ఉపవాస దీక్షను ముగిస్తారు. ఇటీవల ఆ పండగ సందర్భంలోనే కరీనా ముంబైలోని ఓ ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘భర్తను దైవంగా భావించడం తప్పుకాదు. అందుకని తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మాత్రం తప్పు. నా భర్త క్షేమం నాకు ముఖ్యమే. ఆయన్ను బాగా చూసుకోవాలంటే ముందు నా ఆరోగ్యం బాగుండాలి కదా. నేను కపూర్‌ని. మా వంశం మొత్తం భోజనప్రియులే. ఫుడ్ తినకుండా మేం ఉండలేం. హాయిగా తింటాను. అలాగే... కష్టపడి నా సినిమాలకు పనిచేస్తాను.అన్నం పెట్టే వృత్తి కూడా దైవమే కదా. సైఫ్ కూడా ఇలాంటి విషయాలను పెద్దగా ఇష్టపడడు’’ అని చెప్పుకొచ్చారు. -
ఉపవాసంపై నిలదీసిన భర్త: భార్య ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: 'కర్వా చౌత్' సందర్భంగా ఉపవాసం ఎందుకు ఉండలేదని భర్త ప్రశ్నించినందుకు భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పశ్చిమ ఢిల్లీలోని కల్యాణి పురి ప్రాంతంలో మంగళవారం సంభవించింది. ఆత్మహత్యకు యత్నించిన మహేష్ కుమారిలకు 1991 వ సంవత్సరంలో విజయ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో వీరికి నలుగురు సంతానం కూడా కలిగారు. ఇదిలా ఉండగా భర్తల బాగోగుల కోరుతూ మహిళలు 'కర్వా చౌత్' చేయడం అనవాయితీ. ఉపవాసం ఉండాలనే విషయాన్ని భార్య కుమారి మనించకపోవడంతో భర్త నిలదీశాడు. దీనిపై మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. భర్త తనను నిలదీయడంతో కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ప్రస్తుతం ఆమెకు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, భర్త ఉపవాసం ఉండాలని బలవంతం చేసిన కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తర భారతంలో ఘనంగా 'కర్వా చౌత్'