నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా వివాదస్పద వ్యాఖ్యలతో ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా పూనమ్ తన తీరుతో మరోసారి వార్తల్లోకెక్కింది. నార్త్ ప్రజలు భర్తల క్షేమం కోరుతూ చేసే ప్రత్యేక పూజ కర్వాచౌత్ (Karwa Chauth). పెళ్లయిన మహిళలు స్పెషల్‌గా జరుపుకునే ఈ పండగను శుక్రవారం పూనమ్ సెలబ్రెట్ చేసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్‌లో షేర్ చేస్తూ అందరికి కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపింది.
చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్
దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘పెళ్లి కానీ మీరు కర్వాచౌత్ ఎలా జరపుకుంటారు?’, ‘అంటే ఇప్పుటికే మీకు పెళ్లయిపోయిందా? లేదా పెళ్లి చేసుకోబోతున్నారా?’ అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల ప్రశ్నలపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ‘ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచన విధానంతో సంధించబడ్డాయో నాకు తెలియదు. కానీ కర్వాచౌత్ పండుగను పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరపుకోవచ్చు. తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారు. పెళ్లయిన వాళ్లు చంద్రుని ఆరాధిస్తే.. పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారు. అంతేకాదు మహా శివుడుని కూడా కోలుస్తారు’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది.
చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్
I don’t know if the articles revolving around today are politically motivated or motivated by missionaries way of thinking - educate yourself - #omnamahshivya ( vasudeva Kutumbakam is what u need to learn . pic.twitter.com/BlQ1mq0qHJ
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 14, 2022
Comments
Please login to add a commentAdd a comment