కర్వాచౌత్: తదియ చంద్రుడి చిన్న చూపు
తీరని విషాదం, అనాథలైన బిడ్డలు
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.
జైపూర్‌లోని హర్మారా ప్రాంతంలో నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ భన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా...
Comments
Please login to add a commentAdd a comment