husaband
-
కర్వా చౌత్ ట్రాజెడీ : ఆవేశంతో భార్య, ఆమె చీరతో భర్త
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.జైపూర్‌లోని హర్మారా ప్రాంతంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్హెచ్ఓ ఉదయ్ భన్ తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా... -
కళ్లెదుటే.. కొత్తజంట జీవితం విషాదాంతం
ఢిల్లీ: సరదాగా రోజుని ప్రారంభించిన ఆ కొత్తజంట.. విషాదకరరీతిలో తమ జీవితాలకు ముగింపు పలికింది. 24 గంటల వ్యవధిలో భర్త కన్నుమూయగా.. భర్త మృతదేహాన్ని చూసి భరించలేని ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దేశరాజధాని పరిధిలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ అహ్లూవాలీ-అంజలికి నవంబర్ 30వ తేదీన వివాహం జరిగింది. ఘజియాబాద్‌లో ఉంటున్న ఈ జంట.. సోమవారం ఢిల్లీ జూ సందర్శనకు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన కాసేపటికే ఛాతీలో నొప్పి ఉందంటూ అభిషేక్ అంజలితో చెప్పాడు. ఆందోళనతో అంజలి అతని స్నేహితులకు వెంటనే సమాచారం ఇచ్చింది. వాళ్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే అభిషేక్ కన్నుమూశాడని.. అతని మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం తర్వాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9గం. సమయంలో ఆ జంట ఉంటున్న ఫ్లాట్‌కు తరలించారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోగా.. అంజలి మాత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. బంధువులు అప్రమత్తమై ఆమెను అడ్డుకునేలోపే.. ఏడో అంతస్తుకు చేరి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన అంజలిని వైశాలి ఏరియాలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో.. అభిషేక్ అంజలి దంపతుల మృతి చెందడంతో ఇరుకుటుంబాల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త.. దానితో భార్య ఉహించని నిర్ణయం..!
హన్వాడ/మహమ్మదాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొనగట్టుపల్లికి చెందిన ఇప్పలి అంజిలయ్య (45) అయిదు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడని భార్య ఇప్పలి లక్ష్మమ్మ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆచూకీ కోసం అన్ని ఠాణాలకు సమాచారం పంపించారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న మహమ్మదాబాద్ శివారులోని ధర్మాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి ఇప్పలి అంజిలయ్యగా గుర్తించారు. వెంటనే పోలీసులు భార్య ఇప్పలి లక్ష్మమ్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో తానే హత్య చేసినట్లు వెల్లడించింది. హత్యచేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అంజిలయ్యకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పరిచయం కాస్త ప్రేమగా.. అంజిలయ్య భార్య లక్ష్మమ్మ పాలమూరుకు అడ్డా కూలీగా వెళ్లేది. ఈమెకు బోర్లు మరమ్మతు చేసే నవాబ్‌పేట మండలం మరికల్‌కు చెందిన జోగు శ్రీను పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్లుగా సాగుతున్న వీరి వ్యవహారానికి భర్త అడ్డంకిగా మారడంతో హతమార్చేందుకు లక్ష్మమ్మ ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజిలయ్యను అనుసరించిన జోగు శ్రీను, అతడితో హెల్పర్‌గా పనిచేసే బాలయ్య మహమ్మదాబాద్ శివారులోని ధర్మాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి పోలీసులకు భర్త కనిపించడం లేదని లక్షమ్మ ఫిర్యాదు చేసింది. -
టీడీపీ నేత కాళ్లపై పడినా కనికరించలేదు...
గుంటూరు: ఇరు పెద్దల సమక్షంలో 2012లో మాకు పెళ్లయింది. 2013లో బాబు, 2015లో పాప జన్మించారు. భర్త అనుమతితో చిన్న ఆపరేషన్ చేయించుకున్నా. ఆడపిల్ల పుట్టిందనే సాకుతో నన్ను నా భర్త నుంచి వేరుచేశారు. పాపకు నామకరణం, మొదటి పుట్టిన రోజుకి సైతం ఎవరూ రాలేదు. అప్పటిదాకా పుట్టింట్లో ఉన్నాం. రెండేళ్ల తర్వాత పెద్దల సమక్షంలో భర్త కాపురానికి తీసుకెళ్లారు. అనంతరమూ గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో, లోక్ అదాలత్‌తో రాజీపడ్డాం. మళ్లీ గొడవలు జరగ్గా నా భర్త నన్ను పుట్టింటిలో వదిలి వెళ్లాడు. ఇటీవల డీపీఓ స్పందనలో ఫిర్యాదివ్వగా, పట్టాభిపురం పీఎస్‌కు పంపించారు. బైండోవర్ కేసులు పెట్టారు. పిల్లలతో కలిసి అత్తారింటిలో ఉంటున్నా. ఈక్రమంలో టీడీపీ ముఖ్య నేత ఒకరు నా భర్త తరఫు కుటుంబ సభ్యులకు వత్తాసుగా వచ్చి, ఇళ్లు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు. టీడీపీ నేత కాళ్లపై పడినా కనికరించలేదు. నాకు న్యాయం చేయగలరు. – ఇద్దరు పిల్లలతో వి.ఆషా, గుజ్జనగుండ్ల -
ఆ జంటలు ఎందుకు విడిపోతున్నాయి?.. సమయం దొరకడం లేదా?
లలిత ఒక ఇండియన్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆనంద్ ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లలిత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు పనిచేయాల్సి ఉండగా, ఆనంద్ పని సాయంత్రం ఆరుగంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కనీసం మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. దీనివల్ల వారి కుటుంబ జీవితం సజావుగా సాగడంలేదు. సత్యది చలాకీ మనస్తత్వం. ఎవరితోనైనా ఇట్టే అల్లుకుపోతుంది. మాట కలిపిందంటే ఆపదు. ఆమె భర్త కుమార్ భిన్న ధ్రువం. తన పని, పుస్తకాలు, సినిమాలతో గడిపేస్తుంటాడు. వంద మాటలకు ఒక్కమాటతో సమాధానం చెప్తాడు. దీంతో తన మాటలు వినడంలేదని సత్య.. వింటూనే ఉన్నా కదా, ఇంకేం చేయాలని కుమార్.. రోజూ గొడవ పడుతూనే ఉన్నారు. రష్మి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో పనిచేసే అవకాశం రావడంతో వెళ్లేందుకు సిద్ధమైంది. అది ఆమె భర్త రాజేష్‌కి ఇష్టంలేదు. ఇద్దరం ఇక్కడే పనిచేసుకుంటూ ఉందామన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనని, తన కెరీర్‌కి అడ్డు రావద్దని తేల్చి చెప్పింది రష్మి. ఈ విషయమై మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానై విడాకుల వరకూ వెళ్లింది. మారుతున్నకాలంతో పాటు ఉద్యోగాలూ మారుతున్నాయి. భిన్నమైన టైమింగ్స్, విభిన్నమైన వాతావరణాల్లో పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు రావడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు అవి విడాకులకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వేర్వేరు టైమ్ జోన్స్‌లో పనిచేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. పనివేళల్లో తేడాల వల్ల వచ్చే సమస్యలు ♦వేర్వేరు పని షెడ్యూళ్ల కారణంగా జంటలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి కలసి గడిపేందుకు సరిపడా సమయం లేకపోవడం. దీనివల్ల దంపతుల్లో ఒకరి పై ఒకరికి నిర్లక్ష్యభావం ఏర్పడుతుంది. ఇది ఆ బంధంలో ఒత్తిడిని పెంచుతుంది. విరుద్ధమైన పని షెడ్యూళ్లలో పనిచేసే జంటలు తామిద్దరూ మాట్లాడుకోవడానికి ఇద్దరికీ అనుకూలమైన సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం. ఇది సవాలుగా మారి ఆ దాంపత్యంలో అపార్థాలు, ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఫలితంగా సంఘర్షణ, మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఒక భాగస్వామికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పని ఒత్తిడి ఉన్న భాగస్వామే ఇంటి పనులను ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది కోపానికి, వాగ్వావాదానికి కారణమవుతుంది. ∙ఒక భాగస్వామికి ఎక్కువ పని గంటలు.. అంతే ఎక్కువ పని ఒత్తిడీ ఉన్నప్పుడు ఆ అలసట, బర్న్ అవుట్.. భావోద్వేగ సమస్యలకు దారితీయవచ్చు. దీనివల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది. వేర్వేరు పని షెడ్యూళ్లు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వొచ్చు. అలాంటి సమస్యలున్న భాగస్వామికి మద్దతునివ్వడం మరొక భాగస్వామికి కష్టం కావచ్చు. ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు ♦విభిన్నమైన పని షెడ్యూళ్లను నిర్వహించడంలో మొదటి, అతిముఖ్యమైన దశ.. మీ భాగస్వామితో నిజాయితీగా మీ ఆందోళనలు, అవసరాలు, అంచనాలను పంచుకోవడం. మీ భాగస్వామి అభిప్రాయాన్ని జాగ్రత్తగా వినడం. ♦మీ పని షెడ్యూళ్లు, బాధ్యతల చుట్టూ స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకోండి. వీలైనంత వరకూ అవి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ∙మీకెంత బిజీ షెడ్యూళ్లు ఉన్నప్పటికీ మీ పార్టనర్‌తో బంధానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇద్దరికీ సమయం కుదిరినప్పుడు మీ యాక్టివిటీస్ షెడ్యూల్ చేసుకోండి. అలా కుదరనప్పుడు మెసేజెస్, కాల్స్, ఇ మెయిల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ♦మీ భాగస్వామి పని డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి అవసరాలకు అనుగుణంగా మీ సొంత షెడ్యూల్స్‌ను మార్చుకోవడానికీ సిద్ధంగా ఉండండి. అవసరమైతే ఇంట్లో అదనపు బాధ్యతలు తీసుకోండి. పిల్లలు ఉంటే, వీలైనంతవరకు వారిని మీ కార్యకలాపాల్లో కలుపుకోండి. ఇది మీరు కుటుంబంగా కలసి ఉండటంలో, జ్ఞాపకాలను క్రియేట్ చేయడంలో తోడ్పడుతుంది. మీ భాగస్వామితో కలసి చేయగల పనుల కోసం చూడండి. అది భాగస్వామి అభిరుచి, ఫిట్నెస్ రొటీన్ లేదా ఇష్టమైన టీవీ షో కూడా కావచ్చు. ♦అన్నింటికంటే ముఖ్యంగా మీకు తగినంత నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, తదితర కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ∙ఇవన్నీ చేసినా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోండి. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
హీరోయిన్ స్నేహ భర్తతో విడిపోనుందా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహకు 2011లో నటుడు ప్రసన్నకుమార్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ వినయ విధేయ రామ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స్నే తన ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె వైవాహిక జీవితం గురించి రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందని, మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కి చెక్ పెట్టింది స్నేహ. భర్తతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను షేర్ చేసుకుంటూ ట్విన్నింగ్ అంటూ పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్టుతో డివోర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. -
పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు
చిన్నతనంలో అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు.. అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. అన్నీ తానై పెంచిన మేనమామను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించసాగింది. కానీ, ఆ సంసారాన్ని.. అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి.. కంటికి రెప్పలా కాపాడి కట్టుకున్నవాడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. సాక్షి, పాలకుర్తి(రామగుండం): చిన్నతనంలోనే అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. తనను పెంచిన మేనమామలలో ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆనందంగా సాగుతున్న వారి సంసార జీవితాన్ని అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి కట్టుకున్నవాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. బసంత్‌నగర్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామానికి చెందిన పల్లె బాపు అనే వ్యక్తికి క్రాంతి, విమల్ సంతానం. 25 ఏళ్ల క్రితం బాపుతోపాటు అతని భార్య మృతిచెందారు. దీంతో క్రాంతి, విమల్‌లను వారి అమ్మమ్మ అయిన రాణాపూర్ గ్రామానికి చెందిన కొల్లూరి జక్కమ్మ చేరదీసింది. తన ఇద్దరు కుమారులైన అశోక్, అజయ్‌ల సహకారంతో పెంచి పెద్దచేసింది. తాగుడుకు బానిసై.. డిగ్రీ వరకు చదివించిన అనంతరం తన చిన్న కుమారుడైన అజయ్‌తో 2015లో క్రాంతికి వివాహం జరిపించింది. అజయ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. మద్యానికి బానిసై తరచూ గొడవ.. ఇప్పటిదాకా సజావుగా సాగిన క్రాంతి–అజయ్‌ల సంసారంలో ఇటీవల కలహాలు చోటుచేసుకున్నాయి. భార్యపై అనుమానంతో మద్యానికి బానిసైన అజయ్ తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రికుడైన అజయ్ రాడ్డుతో క్రాంతి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై, అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో బసంత్‌నగర్ ఎస్సైలు మహేందర్‌యాదవ్, శివానిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలువాల మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇదీ చదవండి: కాలేజ్ వద్ద డ్రాప్ చేస్తానని నమ్మించి.. కొంచెం దూరం వెళ్లాక.. -
ఒకరికి తెలియకుండా ఒకరిని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు
సాక్షి, నారాయణపేట(మహబూబ్‌నగర్): ఒకరికి తెలియకుండా మరొకరితో ఇలా నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఓ యువకుడి బండారం బయటపడింది. మొదటి భార్య సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేయడంతో ఆ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన వెంకట నర్సింహారెడ్డి వ్యవసాయం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. 15ఏళ్ల క్రితం పెళ్లి చేయడానికి పెద్దలు ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన మహేశ్వరిని చూశారు. అయితే అప్పట్లో అమ్మాయి తరఫు పెద్దలకు ఇష్టలేక వద్దనుకున్నారు. అయినప్పటికీ అమ్మాయి చుట్టూ తిరిగి ప్రేమలో పడేసి 2009లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టాక.. 2014లో భార్యభర్తలు గొడవపడి విడిపోయారు. అయినప్పటికీ భార్యపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేయడంతో ఆమె త్రుటిలో తప్పించుకుంది. దీనిపై కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. ► జైలు నుంచి వచ్చిన తర్వాత కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం కావడంతో ఆమెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. ఇతని తీరు నచ్చకపోవడంతో ఆమె విడాకులు తీసుకుని మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ► ఊట్కూర్ మండలం నమస్తాపూర్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి కుమారుడితో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి గుడిలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరికి మరో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కాగా, తరుచూ సొంత గ్రామానికి వచ్చి పోతున్న వెంకట నర్సింహారెడ్డి తన పక్క గ్రామమైన అప్పక్‌పల్లిలో మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని, ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ► నెలరోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం మొత్కుపల్లి దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి గురించి తెలిసిన మొదటి భార్య మహేశ్వరి వివరాలు సేకరించగా.. తాను కాకుండా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుంది. అందరితో ఫోన్లో మాట్లాడి వాడి నిజస్వరూపం బయటపెట్టింది. రెండు రోజుల క్రితం సఖీ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. ► ఈ మేరకు శనివారం ముగ్గురు భార్యలు నారాయణపేట పోలీసుస్టేషన్‌కు రాగా మరొకరు వేరే పెళ్లి చేసుకున్న కారణంగా రాలేదు. మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యపెళ్లి కొడుకు వెంకట నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురే కాకుండా మరో ఇద్దరిని వివాహం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
చస్తానేమో గానీ తప్పు చేయను..
కులాలు వేరైనా ప్రేమ చిగురించింది.. చదువు, అంతస్తు అడ్డుగా నిలిచినా ఆమె ఎదిరించింది.. ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరికి జన్మనిచ్చారు.. ఐదేళ్ల కాపురం..అద్దమంటి పిల్లలు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అనుమానం పెనుభూతమైంది! దంపతుల మధ్య దూరం పెంచింది.. అతని నిర్లక్ష్యాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.. నింద మోయలేక మదనపడింది.. కన్నవాళ్లకు చెప్పుకోలేక.. కట్టుకున్నోడితో కలసి ఉండే ‘భాగ్య’ం లేక.. అందనంత తీరాలకు వెళ్లిపోయింది!పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలనూ వెంట తీసుకుపోయింది! పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో శనివారం కురుబ భాగ్యశ్రీ(27) తన ఇద్దరు పిల్లలు జతమన్ శౌర్య(4), క్రిషిత (2)లను గొంతు నులిమి చంపి.. తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యో.. ఎంత పని చేశావు తల్లీ అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన కురుబ భాగ్యశ్రీ అగ్రికల్చర్ బీఎస్సీ చదివింది. కుటుంబం అనంతపురంలో స్థిరపడగా.. బతుకుదెరువు కోసం భాగ్యశ్రీ తల్లిదండ్రులు ధాబా నడిపేవారు. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన మారెన్న కుమారుడు చరణ్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతను తరచూ ఆ ధాబాకు వెళ్తూ భాగ్యశ్రీని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని నమ్మి వెంట నడిచింది. ఐదేళ్ల క్రితం ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బత్తలపల్లిలో వేరు కాపురం పెట్టారు. భార్యాభర్త అన్యోన్యంగా ఉండేవారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా జతమన్ శౌర్య(లడ్డు), క్రిషిత (లక్కీ) జని్మంచారు. రెండేళ్లుగా చరణ్ ‘కియా’ కంపెనీ బస్సు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త నిర్లక్ష్యం చేయడంతో భాగ్యశ్రీ తట్టుకోలేక పోయింది. పుట్టింటి వారు ఎప్పుడో ముఖం చాటేయగా, తన బాధ ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. భర్త అనుమానంతో తనపై నిందలు మోపడాన్ని సహించలేకపోయింది. పోరాడి ఓడిన భాగ్యశ్రీ.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం ఇలా అయిపోయిందని భాగ్యశ్రీ రోజుల తరబడి కుమిలిపోయింది. మనశ్శాంతి లేక మరణాన్ని కోరుకోవాలనుకునేది. కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను చూసి ఆగిపోతూ వచ్చింది. జీవితంలో నిలబడేందుకు నెలల తరబడి మౌన పోరాటం చేసింది. చివరకు ఓడిపోయి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి చరణ్ ఉద్యోగానికి వెళ్లి శనివారం ఉదయం 11 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. భోజనం చేసి సమీపంలో ఉన్న అన్న ఇంటికి వెళ్లి అక్కడే నిద్రించాడు. కల్లోల మనసుతో ఉన్న భాగ్యశ్రీ..అంగన్వాడీలో ఉన్న చిన్నారులను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లింది. ఉదయం నుంచీ ఏమీ తినకపోవడంతో కళ్లు తిరగడంతో రోడ్డుపై పడిపోయింది. వెంటనే గుర్తించిన అంగన్వాడీ సిబ్బంది ఆమెను సెంటర్‌కు తీసుకెళ్లి నీళ్లు తాపించి కాసేపు అక్కడే సేదదీర్చారు. కానీ తన జీవితానికి ‘మరణ శాసనం’ రాసుకున్న భాగ్యశ్రీ కాసేపటికే పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చింది. 11.30 గంటల ప్రాంతంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చింది. అయితే భాగ్యశ్రీ పరిస్థితి చూసిన అంగన్వాడీ ఆయా... ఆమెకు, పిల్లలకు భోజనం పెట్టాలని భావించి 12.30 గంటలకు వారింటికి వెళ్లింది. తల్లీపిల్లలు గాఢ నిద్రలో ఉండడంతో ఆమె తిరిగి సెంటరుకు వెళ్లిపోయింది. అయితే అరగంట గడవకముందే ఇద్దరు బిడ్డలతో భాగ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి వారింటికి పరుగు తీసింది. ఇద్దరు చిన్నారులు నిర్జీవంగా పడి ఉండగా...భాగ్యశ్రీ దూలానికి చీరతో వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. పిల్లలను చంపి..ఉరికి వేలాడి.. తాను వెళ్లిపోతే పిల్లల పరిస్థితి ఏమిటని భావించిన భాగ్యశ్రీ నిద్రలోనే పిల్లలను గొంతు నులిమి చంపి, తాను ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. విషయం తెలిసి పరుగున ఇంటికి వచ్చిన చరణ్...భార్యా పిల్లల మృతదేహాలు చూసి బోరున విలపించాడు. ‘లడ్డూ, లక్కీ... లేచి రాండ్రా, ఎంత పని చేశావు భాగ్యా’ అంటూ బిగ్గరగా అరవ సాగాడు. సీఐ జయానాయక్, ఏఎస్ఐ ప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భాగ్యశ్రీ రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చస్తానేమో గానీ తప్పు చేయను.. ‘‘ఎందుకిలా మారిపోయావో తెలియట్లేదు. నా మీద అనుమానం మొదలైంది. ఇది నీకు వచ్చిన అనుమానం కాదు..ఎవరో చెప్పి ఇలా మాట్లాడిస్తున్నారు. నీకు ఎంత సేపూ మొబైల్, ఫ్రెండ్స్, క్రికెట్, మందు మాత్రమేనా? నీకోసం ఎదురు చూసే భార్య, పిల్లలు ఉంటారు. వాళ్లకీ మనసు ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు. ఆనందం లేదు, సంతోషం లేదు... ఏమీ లేదు.. ఒంటరిగా బతుకుతున్నా. నీకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నావని నా మనసులో మాట చెప్పాలని చాలా సార్లు లెటర్లు రాశాను. కానీ నువ్వు ఫీల్ అవుతావని ఇవ్వలేకపోయాను. ఇప్పటికీ చెప్పకపోతే నేను తప్పు చేసినదాన్ని అవుతాను. నేను మషిని కానా, నాకు ఫీలింగ్స్ ఉండవా? ఎంత చెప్పినా వేస్ట్. నీ మైండ్ అంతలా పొల్యూట్ చేశారు. మా నాన్నని చూడాలని ఉంది. ఒక్కసారి చూపించు. నీకు ఇష్టం లేకపోతే నాకు డైవర్స్ ఇచ్చి.. నీకు ఇష్టం వచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం కానీ తప్పు మాత్రం చేయను. ఈ లైఫ్ నీతోనే అంతే. తప్పుగా మాట్లాడినా, నీ మనస్సు బాధ పెట్టినా నన్ను క్షమించు.’’ ఇట్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా బతుకుతున్న నేను(భాగ్య) -
వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సాక్షి, నల్లగొండ: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పట్టణ టూటౌన్ పోలీసులు. ఈ కేసు వివరాలను బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న(41) వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేస్తూ, భార్య సుజాత కూలి మెస్త్రిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య సుజాత కూలి పనులకు వెళ్లిన క్రమంలో నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు చెందిన కప్ప లింగస్వామితో అక్రమ సంబంధం ఏర్పడింది. చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఈ బంధం కాస్త బలపడడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా సుజాత జనవరి 29న రాత్రి ప్రియుడు లింగస్వామికి ఫోన్ చేసి తన భర్త మద్యం తాగి నిద్రపోయాడని హత్యకు ఇదే సరైన సమయమని ప్రియుడికి తెలిపింది. దీంతో లింగస్వామి అతడి స్నేహితుడైన నార్కెట్‌పల్లి మండలంలోని గుమ్మళ్లబావికి చెందిన చెన్నకేశవరెడ్డి, చెర్వుగట్టుకు చెందిన శ్రీకాంత్‌తో బైక్‌పై పట్టణానికి వచ్చారు. శ్రీకాంత్ లింగస్వామిని దించి వెళ్లిపోయాడు. చెన్నకేశవరెడ్డి, లింగస్వామి ఓ మెడికల్ షాపులో చేతిగ్లౌజ్‌లు కొనుగోలు చేసి రాత్రి పానగల్ కట్టపై వేచి ఉన్నారు. దీంతో సుజాత అర్థరాత్రి తర్వాత ప్రియుడు లింగస్వామికి వాట్సాప్ కాల్ చేసి రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్లిన ప్రియుడు లింగస్వామి వెంకన్న మొఖంపై దిండ్డుతో, గొంతుపై అదిమి పట్టగా భార్య కాళ్లను పట్టుకుని హత్య చేశారు. చదవండి: Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి.. వెంట వచ్చిన చెన్నకేశవరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నాడు. సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి భిక్షమయ్య ఫిర్యాదుతో పోలీస్‌లు సుజాతను తనదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. మృతుడు వెంకన్నకు గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సుజాతతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హత్యకు సహకరించిన వారిని, ప్రియుడు, భార్య సుజాతను గతంలో హత్య చేయాలని ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
‘జంటను కలిపిన జడ్జి’.. ఔను, వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
తిరుపతి లీగల్ : విభేదాలతో వేరుగా జీవిస్తున్న దంపతులు న్యాయస్థానం సాక్షిగా ఒక్కటయ్యారు. సుదీర్ఘంగా న్యాయమూర్తులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో వారి జీవితంలో వసంతం తొంగిచూసింది. ఆపై, వారిని జడ్జిలతోపాటు ప్రకృతి కూడా ఆశీర్వదించింది. జోరున కురుస్తున్న వర్షం నడుమే వారిద్దరూ కలిసి వెళ్లారు. ఈ సన్నివేశం గురువారం స్థానిక కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతికి చెందిన టి.మునికుమారి బీఎన్.కండ్రిగకు చెందిన సలూమ్‌ను ప్రేమించి ఐదేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇదలా ఉంచితే, తిరుపతి మండల న్యాయసేవా అధికార సంస్థ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయసేవా వారోత్సవాలను నిర్వహిస్తోంది. బుధవారం ‘జంటను కలిపిన జడ్జి’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రధానంగా వచ్చింది. ఇది చూసిన మునికుమారికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు వచ్చింది. స్థానిక 4వ అదనపు జూనియర్ జడ్జి శ్రీనివాస్‌కు తన భర్తపై ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి స్పందించారు. సలూమ్‌ను కోర్టుకు రప్పించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. జడ్జితో పాటు పారాలీగల్ వలంటీర్లు ఎన్.రేవతి, ఎం.విజయలక్ష్మి సుమారు 4 గంటలకు పైగా దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికే కోర్టు సమయం కూడా ముగిసింది. ఆ తర్వాత వారిని 4వ అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ దంపతులతో ఆ జడ్జి కూడా చర్చించారు. కలసిమెలసి ఉండాలని హితబోధ చేశారు. ఇకపై భార్యాపిల్లలను బాగా చూసుకుంటానంటూ సలూమ్ న్యాయమూర్తుల సమక్షంలో హామీ పత్రం రాసి ఇచ్చాడు. చమర్చిన మునికుమారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, కృతజ్ఞతా భావం. అప్పటికే సమయం సాయంత్రం 6.30 దాటింది. జడ్జిల ఆశీస్సులతో దంపతులిద్దరూ కోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తోంది. సలూమ్ తన బైక్ స్టార్ట్ చేశాడు. మునికుమారి అతడి వెనుక కూర్చుని భుజంపై చెయ్యి వేసి ఓ నవ్వు నవ్వింది. అంతే..నిమిషాల వ్యవధిలో బైక్‌లో సలూమ్ సింగాలగుంటలోని అత్తగారింట వాలిపోయాడు. సీన్ కట్ చేస్తే– తల్లితోపాటు ఇంటికి వచ్చిన తండ్రిని చూసి పిల్లలిద్దరి కళ్లలో సంభ్రమాశ్చర్యం! నాన్నొచ్చాడూ..అంటూ చెప్పలేనంత సంతోషంతో కేరింతలు కొట్టారు. -
కట్టుకున్నోడే కాలయముడు!
సాక్షి,భువనగిరి: కలకాలం తోడూ నీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదమరచి నిద్రిస్తున్న భార్యను గొంతునులిమి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన కొండమడుగు వెంకటాచారికి, లక్ష్మి(35)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. వెంకటాచారి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా, లక్ష్మి మరో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. మరొకరితో సఖ్యతగా మెలుగుతున్నాడని.. వెంకటాచారి మరో మహిళతో సఖ్యతగా మెలుగుతున్నాడని లక్ష్మి అనుమానించింది. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఇదే విషయంపై దంపతులు తీవ్ర స్థాయిలో గొడవ పడడంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చింది. అయినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ పడ్డారు. గొంతు నులిమి.. తరచు భార్య గొడవ పడుతుండడంతో వెంకటాచారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఘర్షణ అనంతరం భార్య ఆదమరచి నిద్రిస్తుండగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడే పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. కాగా, పోలీసులు సోమవారం ఉదయం ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. లక్ష్మీ హత్యకు గురైన విషయం తెలుసుకుని బంధువులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. పుట్టింట్లో ఉన్నా ప్రాణాలతో ఉండేవు లక్ష్మీ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ చెప్పారు. -
మంచిర్యాల : భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
-
మృత్యువులోనూ వీడని బంధం, అరగంట వ్యవధిలో..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వివాహం జరిగినప్పటి నుంచి ఒకరికొకరు తోడూ నీడగా నిలిచిన ఆ దంపతులు మృత్యుఒడికి జంటగానే వెళ్లారు. రాజమహేంద్రవరం ఐఎల్టీడీ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ అంగాడ సరళాదేవి(64), ఆమె భర్త ఇంజినీర్, కాంట్రాక్టరు అంగాడ వీర వెంకట సత్యనారాయణ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజులుగా సత్యనారాయణ అనారోగ్యంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనపై బెంగతో శనివారం మధ్యాహ్నం సరళాదేవి అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు సీరియస్‌గా ఉండడంతో వెంటనే సరళాదేవి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. అర్ధరాత్రి సమయంలో సరళాదేవి గుండెపోటుతో మృతి చెందగా, అరగంట వ్యవధిలో ఆమె భర్త సత్యనారాయణ కూడా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సరళాదేవి దంపతులు పార్థివదేహాలను ఐఎల్టీడీ సెంటర్లోని ఆమె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంగాడ సరళాదేవి ఏసీవై రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా సేవలందించడంతో పాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలు మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. సరళాదేవి దంపతులు పార్థివదేహాలను వైఎస్సార్ సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, బీఎస్పీ పార్లమెంటరీ ఇన్చార్జి పట్నాల విజయకుమార్, వైఎస్సార్ సీపీనాయకులు, ఆమె అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సరళాదేవి కుమార్తె సత్య, కుమారుడు వంశీలను పరామర్శించారు. చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం.. -
భార్య ఫై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త
-
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
భర్తతోనే ఉంటా.. ఆయనే నా జీవితం
నరసన్నపేట : న్యాయం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది. భర్తతోనే ఉంటానని.. ఆయనే నా జీవితమంటూ మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన నరసన్నపేటలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించింది. దీనికి సంబంధించి బాధితురాలు సునీత తెలిపిన వివరాల్లోకి వెళితే.. విజయనగరం పట్టణంలోని బోయి వీధికి చెందిన సునీతకు నరసన్నపేటకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుడు బోయిన రఘురాంతో 2006లో వివాహమైంది. వీరి సంసార జీవితం కొన్నేళ్ల పాటు బాగానే సాగింది. అయితే పిల్లలు పుట్టడం లేదనే కారణంతో 2019లో మాయమాటలు చెప్పి భర్త రఘురాం విజయనగరంలోని ఆమె కన్నవారింటికి పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తీసుకురాలేదని బాధితురాలు వాపోయింది. పలుమార్లు నరసన్నపేట లక్ష్మన్నపేటలోని అత్తవారింటికి రాగా.. తాళాలు వేసి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే శనివారం కూడా ఇక్కడికి రాగా అత్తింటివారు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని తెలిపింది. దీంతో న్యాయం చేయాలంటూ అక్కడే బైటాయించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వివాహమైన తరువాత తమ కాపురం బాగానే సాగిందని.. అయితే పిల్లలు కలగకపోవడంతో అత్తింటివారు వేధించి కన్నవారి ఊరైన విజయనగరం పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని.. వారు బతకడమే కష్టంగా ఉందని.. అలాంటి వారికి భారంగా తయ్యారయ్యానని కన్నీటి పర్యంతమైంది. భర్తతోనే ఉంటానని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అత్తవారింటికి తీసుకెళ్లకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించినట్లు సునీత వివరించింది. సునీత మౌనపోరాటానికి దిగిన విషయం నరసన్నపేట పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు దీక్షా ప్రాంతానికి వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. కేసు కోర్టులో నడుస్తున్నందున ఇలా దీక్షలకు దిగడం మంచిదికాదని నచ్చచెప్పారు. త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో సునీత దీక్షను విరమించింది. -
భర్త కావాలి
ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తోడు కోసం. అర్థం చేసుకునే ఆత్మీయుడి కోసం. సౌకర్యంగా ఉంచే సహచరుడి కోసం. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది మంచి భర్త కోసం. అయితే ఆమె ఊహించుకున్న భర్త, నిజజీవితంలో ఉన్న భర్త వేరువేరు అయితే? ఆమె కోరుకునే భర్త ఎవరు? అమెరికా సంబంధం బాగుంటుంది. అవును. బాగుంటుంది. పెళ్లయ్యాక అమ్మాయి అక్కడ హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. అవును. చేసి రావొచ్చు. కాని కష్టం వస్తే? వెంటనే వెళ్లి ఓదార్చి రావడం కుదురుతుందా? కుదరదు. ఆమె కాపురంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం వీలవుతుందా? వీలవదు. మనం ఇక్కడ. అమ్మాయి అక్కడ. ఏం చేయాలి? అవును. ఏం చేయాలి? ‘ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది’ అనుకుంది సంయుక్త తల్లి. ‘అసలు ఈ నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపించింది’ అని కంగారు పడిపోయాడు సంయుక్త తండ్రి. పెళ్లయ్యి సరిగ్గా నెల. నెల రోజులకే ఈ పెళ్లి వద్దని, ఇండియాకు వచ్చేయాలనుకుంటున్నానని సంయుక్త ఆ తల్లిదండ్రుల నెత్తి మీద పిడుగు వేసింది. ‘ఎందుకు?’ అని అడిగారు ఇద్దరూ ‘నాకు అతను నచ్చడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘భర్తకు భార్య, భార్యకు భర్త ఒకపూటలో అరపూటలో నచ్చేయరు. మెల్లగా కాపురం గడిచేకొద్దీ ఒకరికొకరు అర్థమవుతారు. ప్రేమ పెరుగుతుంది. జీవితం బాగుంటుంది’ అని చెప్పారు ఇద్దరు. ‘రోజులు గడిచేకొద్దీ నాకు అతని మీద విరక్తి పెరుగుతోంది తప్ప ప్రేమ కలగడం లేదు’ అని చెప్పింది సంయుక్త. ‘అయితే ఏమంటావ్?’ అని అడిగారు వాళ్లు. ‘ఏమంటాను.. విడాకులు తీసుకుంటాను అంటాను’ అంది సంయుక్త. సంయుక్త తల్లిదండ్రులు హైదరాబాద్‌లో మంచిస్థితిలో ఉన్నారు. తండ్రికి వ్యాపారాలు ఉన్నాయి. సంయుక్త ఒక్కతే కూతురు. బాగా చదివించారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని వారనుకున్నా సంయుక్త పట్టుబట్టి ఉద్యోగం చేస్తానంటే బెంగళూరులో చేయనిచ్చారు. ఆ వెంటనే మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఒకే కులం. ఒకే ప్రాంతం. ఒకే ఆర్థిక నేపథ్యం. ‘బాగున్నాడు చేసుకో. ఇప్పుడు కాకపోతే మళ్లీ ముహూర్తాలు దొరికేలా లేవు’ అన్నారు తల్లిదండ్రులు. అతను అమెరికా నుంచి వచ్చాడు. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య వారం రోజులే ఎడం దొరికింది. తొందర తొందరగానే అన్నీ ముగించాల్సి వచ్చింది. అమెరికా పెళ్లికొడుకుల పెళ్లి ‘సెలవుచీటి’ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పెళ్లికొడుకు అంతే హడావిడి చేసి సంయుక్తను తీసుకొని ఫ్లయిట్ ఎక్కాడు. ‘అమ్మయ్య’ అనుకున్నారు తల్లిదండ్రులు. ‘అంతా బాగానే చేశాం కదా ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తోంది’ అని బాధ పడుతున్నారు ఇప్పుడు. అంతా విన్న సైకియాట్రిస్ట్ మొదట సంయుక్త భర్తతో మాట్లాడతానని అతనికి స్కైప్ ద్వారా కాల్ చేసి మాట్లాడాడు. ‘సంయుక్త మంచిదే డాక్టర్. కాని ఎందుకో ఇన్కన్వినియన్స్ ఫీల్ అవుతోంది. నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడటం లేదు. నేను కూడా తనతో హార్ష్‌గా బిహేవ్ చేసింది లేదు. పెద్ద కొట్లాటలు కూడా లేవు. ఆమె మనసులో ఏముందో అర్థం కావడం లేదు. అలాగని సస్పీషియస్‌గా కూడా లేదు. నాకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడంలేదు. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రోజు వరకూ రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రత్యేకంగా మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడని అంశాలేమీ కనిపించలేదు. అయితే చనువు, దగ్గరితనం ఏర్పడ్డాకే తను ఫస్ట్‌నైట్ అంది. అందువల్ల ఇండియాలో మా ఫస్ట్‌నైట్ జరగలేదు. పెద్దవాళ్లకు జరిగిందని చెప్పాం. ఇక్కడికి వచ్చాక కూడా జరగలేదు. నెల రోజులుగా నేను దూరంగానే ఉంటున్నాను’ అన్నాడతను. అతని స్టేట్మెంట్ హానెస్ట్‌గా అనిపించింది సైకియాట్రిస్ట్‌కి. ఇప్పుడు సంయుక్తతో మాట్లాడాలని అనుకున్నాడు. రెండు మూడు స్కైప్ కాల్స్ మాట్లాడాక ఓపెన్ అయ్యింది సంయుక్త. ‘డాక్టర్... ఏం చెప్పను. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను బొమ్మలాగున్నావ్ బొమ్మలాగున్నావ్ అని అనేవారు. నాన్న అమ్మ కూడా బొమ్మలాగే పెంచారు. చక్కగా ఉన్న అమ్మాయి బయటకు వెళితే ఎవరో తన్నుకుపోతారన్నట్టుగా ఉండేది వాళ్ల పెంపకం. ఏమీ మాట్లాడటానికి లేదు. స్వేచ్ఛగా నచ్చింది చేయడానికి లేదు. చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు. నా బాడీలో ఒక సెన్సర్ పెట్టకపోవడం ఒక్కటే తక్కువ. నాకు ‘నో’ చెప్పడానికి కూడా మొహమాటం చెప్పేంత గారాబంలో ఉంచేశారు. ఇలా కాదని పట్టుబడి బెంగళూరుకి ఉద్యోగానికి వెళ్లాను. అదేదో సినిమాలో పెళ్లికిముందు యూరప్ ట్రిప్‌కు హీరోయిన్ను పంపినట్టు ఎలాగూ మూడు నెలలో పెళ్లి చేసేస్తాం కదా అని మనసులో పెట్టుకొని నన్ను పంపించారు. కాని ఆ మూడునెలల్లో నాకు లోకం తెలిసింది. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. హాయిగా తిరిగాను. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమా దోమా అనే మాటలు లేకుండా కూడా ఫ్రెండ్స్‌గా ఉండొచ్చని మాలాంటి వయసులో సరదాగా ఉండొచ్చని అనిపించేది. నాకు పరిచయమైన మా కలీగ్స్, అబ్బాయిలు చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండేవారు. చాలా ఓపెన్‌గా ఉండేవారు. సినిమా హీరోల అట్రాక్షన్ ఒకటి. నా కాబోయే భర్త హీరోలా ఉండి సరదాగా లిబరల్గా ఉండాలనుకున్నాను. ఆ కల ఇంకా కళ్లలోనే ఉండగానే హడావిడిగా పెళ్లి చేసేశారు. ఇతను చూడటానికి బాగున్నా, మంచివాడే అయినా అచ్చు మా నాన్నలాగే ఉండటం మొదలెట్టాడు. ఇది అమెరికా.. ఇక్కడ నువ్వు అలా చేయుద్దు ఇలా చేయుద్దు... ఎక్కడికీ వెళ్లొద్దు... వీళ్లతో మాట్లాడు.. వాళ్లతో వద్దు.. ఇలాంటి బట్టలు కట్టుకో... అసలు ఇరవైనాలుగ్గంటలు ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండే మొగుడు చాటు భార్యగా ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు. ఒక నాన్నతో వేగి వస్తే ఇంకో నాన్నగా ఇతను మారాడు. నాకు నచ్చడం లేదు. మా నాన్నకు ఆరోగ్యం పాడవుతుందని, అమ్మ ఏదో అయిపోతుందని మీరు చెప్పి నన్ను కాపురం చేయమంటే చేస్తాను. కాని సంతోషంగా ఉండను’ అని కుండ బద్దలు కొట్టింది సంయుక్త. ఇదంతా సంయుక్త భర్తకు చెప్పాడు సైకియాట్రిస్ట్. ‘నీకు నచ్చింది ఆమె నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆశించు’ అని చెప్పాడు అతనికి. సంయుక్తతో మాట్లాడాడు. ‘నీకు నచ్చనిది ఫిఫ్టీ పర్సెంటే చెయ్’ అని చెప్పాడు. ‘మీరు వంద పర్సెంట్ మారక్కర్లేదు. ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అవ్వండి’ అని ఇద్దరికీ చెప్పాడు. సంయుక్త కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతోంది. ఆమె భర్త కొంచెం కొంచెం ఆమె రెక్కలను ఎగరనిస్తున్నాడు. పెళ్లి అనేది అందమైన గూడులా ఉండాలి తప్ప పంజరంలా కాదు. అది బంగారందైనా. ఏది చేయనివ్వాలి, ఎంత చేయనివ్వాలి, ఏది మానుకోవాలి, ఎంత మానుకోవాలి ఇద్దరూ తెలుసుకుంటే చాలా ఇబ్బందులు పోయినట్టే. ప్రస్తుతం సంయుక్త, సంయుక్త భర్త ఈ ఫేజ్‌లో ఉన్నారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
విషాదం: పెళ్లైన నిమిషాల్లోనే ఓ జంట..
టెక్సాస్ : కలకాలం కలిసి జీవిద్దామనుకున్నారు కానీ విధి వారితో చెలగాటమాడింది. ఆఖరికి మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. వివాహం అయిన కొద్ది నిమిషాలకే నూతన వధూవరులు మరణించిన విషాదకర సంఘటన శుక్రవారం టెక్సాస్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టెక్సాస్‌కు చెందిన హార్లే మార్గన్, రియానా బోడ్రెక్స్ల జంటకు ఈ శుక్రవారం డుబోస్-సిమోంటన్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దురదృష్టం ఆ కొత్త జంటను వెంటాడింది. జస్టిస్ ఆఫ్ ది పీస్ భవనం నుండి బయలుదేరే సమయంలో వరుడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఈ క్రమంలో భారీ ట్రక్ వారు ప్రయాణిస్తున్న కారులోకి దూసుకెళ్లింది. దీంతో పెళ్లై నిమిషాలు గడవక ముందే హార్లే మార్గన్, రియానా బోడ్రెక్స్లు మృత్యువాత పడ్డారు. పెళ్లి జరిగి నిమిషాలు గడవక ముందే కొడుకు,కోడలు ప్రమాదంలో మరణించటతో హార్లే మార్గన్ తల్లి కన్నీరుమున్నీరైంది. -
‘భార్యాబాధితుల’ వెరైటీ నిరసన
ముంబై : దసరా పండుగ నాడు దేశ వ్యాప్తంగా రావణాసుర వధ జరగడం ఆనవాయితి. కానీ మహారాష్ట్రలో మాత్రం వెరైటీగా రావణాసురిడి సోదరి శూర్పనఖ బొమ్మను దహనం చేశారు. ఇది ఎక్కడి వింత ఆచారం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఆచారం కాదు.. భార్యల వల్ల పడుతున్న అగచాట్లను తెలియజేయడం కోసం ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను కాల్చారు. ఈ వెరైటీ సంఘటన ఔరంగాబాద్‌లోని కరోలి గ్రామంలో చోటు చేసుకుంది. ‘పత్ని పీడిత్ పురుష్ సంఘటన’(భార్య బాధితుల సంఘం) సభకు చెందిన సభ్యులు తమను వేధిస్తున్న భార్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ పనికి పూనుకున్నారు. ఈ విషయం గురించి సదరు సంఘానికి చెందిన ఓ వ్యక్తి ‘మా భార్యలు మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. మన దేశంలో చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాయి. వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. భార్యల వేధింపులకు గుర్తుగా మేము ఈ రోజు ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను దహనం చేశాము’ అని తెలిపారు. -
భార్య భర్తల గొడవలో తలదూర్చిన నయీం అనుచరులు?
-
పింఛన్ డబ్బుల కోసం భార్యను కడతేర్చిన భర్త
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వ్యసనాలకు బానిసైన వారు రక్త సంబంధాలను సైతం లెక్క చేయడం లేదు. తమ అవసరం తీరితే చాలు.. ఇక ఏదీ అవసరం లేదనే స్థాయికి వెళుతున్నారు. ఈక్రమంలో మంచి చెడుల విచక్షణ కూడా కోల్పోతున్నారు. తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండానే దారుణాలకు ఒడిగడుతున్నారు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పింఛన్ సొమ్ము ఇవ్వలేదనే కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. గోనెగండ్ల: పింఛన్ సొమ్ము కోసం ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొడ్డలితో చంపిన ఉదంతం మండలంలోని ఒంటెడుదిన్నె గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. గ్రామానికి చిన్న నర్సన్న, లక్ష్మిదేవి(60) దంపతులకు వీరేషమ్మ, ఉరుకుందమ్మ, ఈరమ్మ కుమార్తెలు. వీరందరికీ పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం వారు పెద్దకుమార్తె వీరేషమ్మ వద్ద కోడుమూరు మండలం వర్కూరులో ఉంటున్నారు. సోమవారం పింఛన్ సొమ్ము తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. కాగా మద్యానికి బానిసైన నర్సన్న పింఛన్ డబ్బు ఇవ్వాలంటూ రాత్రి భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై గొడ్డలితో నరికి చంపి ఇంటి తలుపులు వేసి అక్కడి నుంచి ఉడాయించాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే వారికి తనే ఫోన్ చేసి తన భార్య ఉరివేసుకొని చనిపోయిందంటూ సమాచారం అందించాడు. దీంతో వారు వెళ్లి చూడగా లక్ష్మిదేవి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి మృతురాలి కుమార్తెలకు సమాచారం అందించారు. తల్లి మరణంతో కుమార్తెలు విలపించిన తీరు చూపరులను కంటతటి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. -
భార్యను ‘నల్లమబ్బు’ అన్నాడని కోర్టు..
చండీగఢ్ : విడాకుల కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. నల్లగా ఉన్నావంటూ వేధిస్తున్న కారణంగా భర్త నుంచి విడిపోవాలనుకున్నట్లు చెప్పిన భార్యకు చండీగఢ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్యను నల్లమబ్బు అనటమే కాకుండా, ఆమె చేసిన వంట కూడా తినకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలోకి వెళితే.. హర్యానాలోని మహేందర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె నల్లగా ఉన్న కారణంగా భర్త తరుచూ నల్లమబ్బు అంటూ వేధించేవాడు. ఆమెను దూరంగా పెట్టడమే కాకుండా వంట కూడా చేయనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఆమె వంట చేసినా భర్త తినేవాడు కాదు. దీంతో విసుగు చెందిన ఆమె కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. వివాహితురాలి తండ్రి తమ అల్లుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అతనికి రెండో పెళ్లి చేస్తామని వారు బెదిరించటంతో ఇక కలిసుండి లాభం లేదనుకున్న ఆమె విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. భర్త ఆమె శరీర రంగును కించపరుస్తున్న తీరును కోర్టుకు వివరించింది. మానసికంగా, శారీరకంగా భర్త వేధించిన విధానం, క్రూరత్వం ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు ఆమెకు విడాకులు మంజూరు చేశారు. -
అనుమానమే ఆయువు తీసింది!
-
కుమారుడి బర్త్‌డే నాడే ఘటన..భార్యను కత్తితో..
అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. ఇది భరించలేని ఆమె అతనిపై కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. అయినా అనుమానం తీరని అతను ఆమెను కత్తితో నరికి చంపాడు. ఫలితంగా ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు,బనగానపల్లె: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం పట్టణంలోని తెలుగుపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సుమారు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన నాగన్న, మునెమ్మ దంపతుల కుమార్తె ఎం.మహేశ్వరి(35)ని పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలనాగమ్మ కుమారుడు లింగమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగా జరిగింది. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న లింగమూర్తి ఆమెను వేధించేవాడు. ఈక్రమంలో అతడిపై మహేశ్వరి తల్లిదండ్రులు 2014లో అలంపూర్ పోలీసు స్టేషన్లో అదనపు కట్నం వేధింపుల కేసు పెట్టారు. అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఇదే కాలనీలో అద్దె ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే అమె గురించి ఇరుగుపొరుగు వారు రకరకాలు చెబుతుండడంతో మనస్థాపం చెందిన భర్త ఉదయం ఇంటికి వద్దకు వెళ్లి ఆమె మెడపై నరికి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బయటకు తెచ్చి అక్కడే కూర్చున్నాడు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాకేష్ ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జ్ సీఐ కంబగిరిరాముడు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కుమారుడు శివకుమార్ పుట్టినరోజు నాడే తల్లి హత్యకు గురికావడంతో కాలనీలో విషాదం నెలకొంది.