
టీడీపీ ముఖ్య నేత ఒకరు నా భర్త తరఫు కుటుంబ సభ్యులకు వత్తాసుగా వచ్చి, ఇళ్లు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు.
గుంటూరు: ఇరు పెద్దల సమక్షంలో 2012లో మాకు పెళ్లయింది. 2013లో బాబు, 2015లో పాప జన్మించారు. భర్త అనుమతితో చిన్న ఆపరేషన్ చేయించుకున్నా. ఆడపిల్ల పుట్టిందనే సాకుతో నన్ను నా భర్త నుంచి వేరుచేశారు. పాపకు నామకరణం, మొదటి పుట్టిన రోజుకి సైతం ఎవరూ రాలేదు. అప్పటిదాకా పుట్టింట్లో ఉన్నాం. రెండేళ్ల తర్వాత పెద్దల సమక్షంలో భర్త కాపురానికి తీసుకెళ్లారు. అనంతరమూ గొడవలు జరిగాయి.
పెద్దల సమక్షంలో, లోక్ అదాలత్‌తో రాజీపడ్డాం. మళ్లీ గొడవలు జరగ్గా నా భర్త నన్ను పుట్టింటిలో వదిలి వెళ్లాడు. ఇటీవల డీపీఓ స్పందనలో ఫిర్యాదివ్వగా, పట్టాభిపురం పీఎస్‌కు పంపించారు. బైండోవర్ కేసులు పెట్టారు. పిల్లలతో కలిసి అత్తారింటిలో ఉంటున్నా. ఈక్రమంలో టీడీపీ ముఖ్య నేత ఒకరు నా భర్త తరఫు కుటుంబ సభ్యులకు వత్తాసుగా వచ్చి, ఇళ్లు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు. టీడీపీ నేత కాళ్లపై పడినా కనికరించలేదు. నాకు న్యాయం చేయగలరు.
– ఇద్దరు పిల్లలతో వి.ఆషా, గుజ్జనగుండ్ల