
అర్ధనగ్నంగా చేసి రోడ్డుపై దాడి
మైసూరులో భర్త, మామ కిరాతకం
మైసూరు: భార్య పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టిందనే కోపంతో భర్త, అతని బంధువులు కలిసి వివాహితను రోడ్డుపై అర్ధనగ్నంగా చేసి దాడికి పాల్పడ్డారు. మైసూరు నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. మహేష్‌కు బాధిత యువతి (24)తో పెళ్లయింది. మరింత కట్నం తేవాలని తరచూ వేధించడంతో ఆమె భర్త, మామ మల్లయ్య, బావ శివు పైన కేసు వేసింది. ఇది ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది.
ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం భార్యను కలిసిన మహేష్ .. కలిసి ఉందామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. రెండు రోజులకే మళ్లీ సతాయించడం మొదలుపెట్టాడు. తమపై పోలీసు స్టేషన్‌లో, కోర్టులో పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని భర్త, మామ తదితరులు ఆమెతో గొడవకు దిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. చీరను లాగేసి దాడి చేశారు. ఇరుగుపొరుగు అడ్డుకోబోతే వారిని బెదిరించారు. బాధితురాలు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment