![Actress Sneha Responds On Divorce Rumours With Prasanna Kumar - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/12/sneha7.jpg.webp?itok=OnyxWG9B)
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహకు 2011లో నటుడు ప్రసన్నకుమార్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ వినయ విధేయ రామ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స్నే తన ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె వైవాహిక జీవితం గురించి రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
కొంతకాలంగా ఆమె భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందని, మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కి చెక్ పెట్టింది స్నేహ. భర్తతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను షేర్ చేసుకుంటూ ట్విన్నింగ్ అంటూ పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్టుతో డివోర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment