నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ | Actress Sneha About Prasanna Kumar Love Breakup | Sakshi
Sakshi News home page

Sneha: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి!

Published Wed, Apr 17 2024 2:20 PM | Last Updated on Wed, Apr 17 2024 3:13 PM

Actress Sneha About Prasanna Kumar Love Breakup - Sakshi

అందం, అమాయకత్వంతో అలరించిన హీరోయిన్లలో స్నేహ ముందువరుసలో ఉంటారు. ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, ఏవండోయ్‌ శ్రీవారు, పాండురంగడు.. ఇలా అనేక చిత్రాల్లో కథానాయికగా నటించింది. 2009లో అచ్చముందు అచ్చముందు అనే తమిళ సినిమాలో నటుడు ప్రసన్నతో జోడీగా నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు సంతానం.

అతి ఉండకూడదు
పెళ్లి తర్వాత స్నేహ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో చివరగా వినయ విధేయ రామలో కనిపించింది. ఇటీవలే చీరల బిజినెస్‌లోకి దిగింది స్నేహ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పొజెసివ్‌నెస్‌ ఉండాలి.. కానీ అతిగా ఉండకూదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్‌ చేయలేం. ఉదాహరణకు.. బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి.

అదే నమ్మకాన్ని పెంచుతుంది
ఒకరు మనల్ని అడిగేముందే.. నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను.. ఈ సమయంలోపు వచ్చేస్తాను అని సమాచారం ఇవ్వాలి. అక్కడికి వెళ్లాక కూడా మీకు టైముంటే ఒకసారి మీ భాగస్వామికి ఫోన్‌ చేసి నేను చేరుకున్నాను, నువ్వు భోజనం చేశావా? అని ఆరా తీయాలి. ఇలాంటి చిన్నచిన్నవే ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. పెళ్లయిన కొత్తలో నేను కూడా పొజెసివ్‌గా ఉండేదాన్ని. అలా అని తనపై నమ్మకం లేదని అర్థం కాదు.

బ్రేకప్‌ మంచే చేసింది!
గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్‌ అయింది. దానివల్ల నాకెలాంటి సమస్యా లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్‌ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికేవాడే కాదు! అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చిపడటంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా నడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళనాడు ఫిలిం అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది.

చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్‌ తనయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement