మాస్ మహారాజ.. రవితేజకు ఇప్పుడంటే సరైన హిట్లు రావట్లేదు కానీ ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లతో చించేశాడు. చంటి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఖడ్గం, వెంకీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. ముఖ్యంగా వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అయితే ఎవర్‌గ్రీన్.. సినిమా అంతా ఒక ఎత్తయితే ఆ రైల్లో నడిచే కామెడీ సన్నివేశం మరో ఎత్తు. ఇప్పటికీ మీమ్స్‌లో దీన్ని వాడుతుంటారు.
వెంకీ సినిమాతోనే మొదలు
ఈ సినిమా రిలీజై రేపటికి (మార్చి 26 నాటికి) 20 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 'నేను ప్రతి సినిమాకు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటూ ఉంటాను. అది వెంకీ సినిమాతోనే మొదలైంది. అయితే ఈ చిత్రానికి మొదట అసిన్‌ను హీరోయిన్‌గా అనుకున్నాను. కానీ కుదరకపోవడంతో స్నేహను సెలక్ట్ చేశాం. రైలు కామెడీ సీన్‌లో ఎమ్మెస్ నారాయణ కూడా ఉండాలి.. కానీ మిస్సయ్యారు.
అదే బెస్ట్ కాంప్లిమెంట్
చాలామంది ఈ రైలు సీన్ వర్కవుట్ అవుతుందా? అని కూడా అన్నారు. రిలీజయ్యాక మాత్రం మేము ఊహించినదానికంటే రెట్టింపు రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నచ్చిందని చిరంజీవి ఫోన్ చేసి చెప్పడటమే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్' అని గుర్తు చేసుకున్నాడు. వెంకీ సినిమాకు శ్రీనువైట్లతో పాటు కోన వెంకట్, గోపిమోహన్ రచయితలుగా పని చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అట్లూరి పూర్ణచంద్ర రావు నిర్మించారు.
చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం!
Comments
Please login to add a commentAdd a comment