హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్‌.. క్రేజీ సాంగ్ వచ్చేసింది | Tollywood Movie Average Student Nani Lyrical Song Released | Sakshi
Sakshi News home page

Average Student Nani: హీరోగా టాలీవుడ్ డైరెక్టర్‌ ఎంట్రీ.. క్రేజీ సాంగ్ రిలీజ్

Published Fri, Jul 19 2024 5:16 PM | Last Updated on Fri, Jul 19 2024 5:40 PM

Tollywood Movie Average Student Nani Lyrical Song Released

పవన్ కుమార్ కొత్తూరి, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు ప్రధాన పాత్రల్లో  నటిస్తోన్న తాజా చిత్రం  ‘యావరేజ్ స్టూడెంట్ నాని’.  ఈ సినిమాతో పవన్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు  అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్‌ను ఇచ్చారు. ‘సారా సారా’  అంటూ సాగే ఓ మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటకు శివకృష్ణచారి ఎర్రోజు లిరిక్స్ అందించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి కీలక పాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement