ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్ : విడాకుల కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. నల్లగా ఉన్నావంటూ వేధిస్తున్న కారణంగా భర్త నుంచి విడిపోవాలనుకున్నట్లు చెప్పిన భార్యకు చండీగఢ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్యను నల్లమబ్బు అనటమే కాకుండా, ఆమె చేసిన వంట కూడా తినకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలోకి వెళితే.. హర్యానాలోని మహేందర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె నల్లగా ఉన్న కారణంగా భర్త తరుచూ నల్లమబ్బు అంటూ వేధించేవాడు. ఆమెను దూరంగా పెట్టడమే కాకుండా వంట కూడా చేయనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఆమె వంట చేసినా భర్త తినేవాడు కాదు. దీంతో విసుగు చెందిన ఆమె కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. వివాహితురాలి తండ్రి తమ అల్లుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
అతనికి రెండో పెళ్లి చేస్తామని వారు బెదిరించటంతో ఇక కలిసుండి లాభం లేదనుకున్న ఆమె విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. భర్త ఆమె శరీర రంగును కించపరుస్తున్న తీరును కోర్టుకు వివరించింది. మానసికంగా, శారీరకంగా భర్త వేధించిన విధానం, క్రూరత్వం ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు ఆమెకు విడాకులు మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment