నార్నూర్, న్యూస్‌లైన్ : భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మెడిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌సింగ్ కథనం ప్రకారం.. మెడిగూడ గ్రామానికి చెందిన కాంబ్లె భరత్, రాధాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. మిగితా ఇద్దరు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. ఈ విషయంలో శనివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రాధాబాయి(45) ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
జజ్జరవెల్లిలో వివాహిత..
భీమిని : మండలంలోని జజ్జరవెల్లి గ్రామంలో మోర్ల రజిత(19) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రజియొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రజితకు కోటపల్లి మండలం శంకరపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అనారోగ్యంతో 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె ఆదివారం పురుగుల మందు తాగింది. అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది
భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య
Published Mon, Aug 19 2013 4:48 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement