భర్త చనిపోయాడని నమ్మించి... | wife acting for property | Sakshi
Sakshi News home page

భర్త చనిపోయాడని నమ్మించి...

Dec 19 2017 8:31 AM | Updated on Jul 27 2018 2:21 PM

సాక్షి, తుమకూరు : భర్త బతికి ఉండగానే చనిపోయాడని నమ్మించి నకిలీ ప్రమాణ పత్రం తయారు చేసి భర్తకు చెందిన రూ. కోట్ల విలువైన ఆస్తిని కాజేసిన సంఘటన తుమకురు జిల్లాలోని గుబ్బి తాలూకాలోని సీ.ఎస్‌.పుర గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రామచంద్రయ్య, జయమ్మ భార్య భర్తలు. వీరికి 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదిలా ఉంటే జయమ్మకు వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో రామచంద్రయ్య రెండేళ్ల క్రితం భార్యను వదిలి తన సోదరి ఉంటున్న హులియూరు దుర్గలో నివాసం ఉంటున్నాడు. ఇదే సమయంలో తన భర్త చనిపోయాడని నమ్మించడానికి  జయమ్మ తిథి కర్మలు కూడా చేయించింది. అనంతరం భర్త చనిపోయినట్లు ప్రమాణపత్రం తీసుకుని ఆస్తిని తన పేరున బదిలీ చేయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రయ్య కోర్టును ఆశ్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement