
సాక్షి, బెంగళూరు: భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంత మంది ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు మనం భార్యలను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసే భర్తలను చాలా మందిని చూసుంటాం. అయితే ఇటీవల దీనికి భిన్నంగా ఓ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో తన భార్య అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్య వేధింపులకు గురిచేస్తోందని మహదేవపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నెక్లెస్ కోసం రూ. 30 లక్షలు, ఆమె చెల్లెలి పెళ్లి కోసం రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ వేధిస్తోందని పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment