Additional dowry
-
అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్య, కుమారుడిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ధన్‌రాజ్ (35) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ధన్‌రాజ్ మార్చి 15న భార్య లావణ్య (28), కుమారుడు క్రియాన్స్(రెండు నెలలు)ను హత్య చేయడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన నిందితుడు బంధువులు వద్ద ఆశ్రయం పొందాడు. వారం రోజుల క్రితం సొంత గ్రామం అనాజ్‌పూర్‌కు వచ్చి తండ్రితో పాటు నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనాథగా మారిన కుమార్తె తండ్రి చేతిలో తల్లి, తమ్ముడు ప్రాణాలు కోల్పోగా, తండ్రి ధన్‌రాజ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుమార్తె ఆధ్య అనాథగా మారింది. ఆరు నెలలుగా బండరావిరాలలోని తన అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటోంది. తండ్రి కూడా తనువు చాలించడంతో ఆధ్య ఇప్పుడు ఒంటరి అయ్యిందని స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. -
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
నల్గొండ: అదనపు కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చల్లపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సన్‌ఫ్లవర్ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీపురం వీఆర్వో బెల్లంకొండ గోపీకృష్ణ భార్య అవిల (28) ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లోని బెడ్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. గోపీకృష్ణకు, బందరు మండలం బీవీతోట పంచాయతీ సీతారామపురం గ్రామానికి చెందిన మట్టా వెంకటేశ్వరరావు కుమార్తె అవిలతో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరు ఇటీవల సన్‌ఫ్లవర్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి నూతన ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం అవిల తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన సమయంలో గోపీకృష్ణ భోజనం చేస్తుండగా తమ కుమార్తె గురించి అడిగారు. బెడ్రూమ్లో ఉన్నట్లు చెప్పాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గమనించి కంగారుగా కిటికీలో నుంచి చూడగా, అప్పటికే అవిల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే గోపీకృష్ణకు విషయం చెప్పటంతో బెడ్రూమ్ తలుపులు పగుల గొట్టి అవిలను కిందకు దించి చూడగా అప్పటికే అవిల మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కొంతకాలంగా గోపీకృష్ణ అవిలను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని మృతురాలి తండ్రి మట్టా వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో పెద్దల సమక్షంలో రాజీ చేయగా, నెల రోజుల నుంచి గోపీకృష్ణ మళ్లీ వేధింపులు ప్రారంభించాడని తెలిపాడు. భర్త్త గోపీకృష్ణ, అతని అన్న, తల్లి, మేనమామ, మేనమామ భార్య వేధించేవారని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ చినబాబు తెలిపారు. -
అదనపు కట్నం కోసమే హత్య
కర్ణాటక: అదనపు కట్నం కోసం తన కుమార్తె శిల్పాను హత్య చేశారని మృతురాలి తండ్రి ఇల్లూరు గోపాలయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. తన కుమార్తెను హత్య చేసి మిద్దె పైనుంచి పడి మరణించినట్లు ఆమె భర్త శరత్ కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారన్నారు. నగరంలోని జవహర్ నగర్‌కు చెందిన శరత్‌తో శిల్పకు గత ఏడాది జూన్ 10న కర్నూలు జిల్లా ఆదోనిలోని చిక్కోరి ఫంక్షన్ హాల్లో ఘనంగా వివాహం జరిపామన్నారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చామన్నారు. రెండు నెలల పాటు భార్యభర్తల మధ్య సంసారం చక్కగా సాగిందన్నారు. అనంతరం శిల్పకు మానసికంగా వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. రెండు మార్లు పెద్దల సమక్షంలో రాజీ చేసి సంసారాన్ని చక్కదిద్దామన్నారు. గతేడాది దీపావళికి రెండు తులాల బంగారు ఇచ్చి పంపామన్నారు. వారం రోజుల క్రితం తనను అత్త శశికళ, మామ సురేష్, ఆడబిడ్డ సుశ్మిత, భర్త ప్రవీణ్ కుమార్ మరింత కట్నం తేవాలని వేధిస్తున్నారని, తాను ఆదోనికి వస్తానని తనను పిలుచుకెళ్లాలని గత సోమవారం శిల్ప తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. అయితే మంగళవారం రాత్రి రెండు కాళ్లు, చేతులు, కడుపు వద్ద గాయాలు చేశారని, ఎడమ వేలిని విరిచేశారన్నారు. భర్త మేడ పైనుంచి ఆమెను కిందకు తోసి హత్య చేసి పరారయ్యాడని తెలిపారు. తన కుమార్తెను హత్య చేసి మేడ పైనుంచి కింద పడి మరణించిందని కుటుంబ సభ్యులు అబద్ధమాడారని ఆరోపించారు. కాగా జిల్లా ఎస్పీ నిఖిల్ శుక్రవారం శరత్ నివాసాన్ని శిల్ప తల్లిదండ్రుల సమక్షంలో పరిశీలించారు. -
పెళ్లయిన ఏడాదిన్నరకే వివాహిత ఆత్మహత్య
కర్ణాటక: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా తిరుమలెగౌడనపాళ్య గ్రామంలో చోటుచేసుకుంది. భవ్య (27) మృతురాలు. తిరుమలెగౌడనపాళ్య గ్రామానికి చెందిన కిరణ్‌తో ఏడాదిన్నర క్రితం రూ.30 లక్షల కట్నం ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించారు భవ్య తల్లితండ్రులు. సంతానం కలగలేదని, అదనపు కట్నం తీసుకురావాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువర్గాలనూ పిలిచి రాజీ చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో భవ్య లక్కప్పనహళ్లి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది. జీవితం ఇలా అయిపోయిందని విరక్తి చెంది శనివారం సాయంత్రం వాదకుంట గ్రామం వద్ద రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. భవ్య తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: పెళ్లై తొమ్మిది నెలలు.. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
ఒడిశా: అదనపు కట్నం కోసం భర్త తన భార్యను వేధిస్తున్న సంఘటన పార్వతీపురం పట్టణంలో వెలుగుచూసింది. ఈ మేరకు పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణానికి చెందిన గుడ్ల శ్రావణికి రవితేజతో వివాహమై తొమ్మిదినెలలవు తోంది. వివాహ సమయంలో 14తులాల బంగారం రెండు లక్షల నగదు, పెండ్లి కుమారుడికి బ్రాస్లెట్ శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చారు. వివాహమైన తరువాత భార్యభర్తలు హైదరాబాద్‌లోని అన్నాజిగూడ లో అద్దెకు ఉండేవారు. భర్త రవితేజ అదనపు కట్నం తేవాలని, నిత్యం భార్యను హింసించేవాడు. ఈ విషయం పెద్దల సమక్షంలో రెండుసార్లు చర్చలు జరిపి రాజీ చేశారు. అయినా భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మళ్లీ భార్యను కొట్టి హింసించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె హైదరాబాద్‌నుంచి పార్వతీపురం కన్నవారింటికి వచ్చి తీవ్ర అనారోగ్యం కారణంగా పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. -
అయ్యో అనూషా.. ఎంత పని చేశావమ్మా?
అన్నమయ్య : అత్తింటి ఆరళ్లకు ఓ అబల బలైంది. మండలంలోని పొన్నూటిపాళ్యం పంచాయతీ భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్న అనూష అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాలూకా సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన అమ్ములు, చిన్నస్వామి కుమార్తె అనూష(22)కు కర్ణాటకలోని రాయల్పాడు మండలం శునకల్ ప్రాంతానికి చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ వివాహం తర్వాత భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో అనూషా తల్లిదండ్రులు అశోక్‌కు రూ.2 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు ఇచ్చి వివాహం చేశారు. అలాగే కారు తీసుకోవాలంటే రూ.2 లక్షలు ఇచ్చారు. ఇది చాలక మళ్లీ అదనంగా డబ్బు కావాలని భర్త అశోక్, అత్తామామలు రెడ్డెమ్మ, కృష్ణప్పలు వేధింపులకు గురిచేస్తుండటంతో సోమవారం రాత్రి అనూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన భర్త వెంటనే ఆమెను కిందకు దించి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేటప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనూష మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి దుఃఖసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె అదనపు కట్నం తేలేదని అత్తింటివారే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు వర్గాల వారిని విచారణ చేశారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త అశోక్, అత్తామామలపై వరకట్న కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో భర్త వేధింపులకు గురవుతున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది. శ్రీకాకుళానికి చెందిన కావ్య, తన భర్త అవినాష్, రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. ఇటీవల భర్త అవినాష్ అదనపు కట్నం కోసం తనతోపాటు కుమార్తెను, తల్లిదండ్రులను సైతం వేధిస్తున్నాడని కావ్య ఇటీవల వీడియో ద్వారా తెలియజేసింది. తాము భారత్ రాకుండా అడ్డుకునేందుకు అవినాష్ అక్కడి కోర్టును ఆశ్రయించి తన రెండేళ్ల కుమార్తె ప్రయాణంపై నిషేధం విధించేలా చేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డ్టాకర్ సీదిరి అప్పలరాజు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. తాము వెంటనే వివరాలు సేకరించి కావ్య తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లే విధంగా ఎంబసీ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కావ్య కుమార్తెను కూడా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత కావ్య సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాము క్షేమంగా భారత్‌కు చేరుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ చేసిన సాయం మరువలేనిదని, తన పాపను కూడా తీసుకొచ్చే విధంగా చూడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు
-
ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు
సాక్షి, విజయవాడ : ఏసీబీ అధికారిణి పిడిక్కాల ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రభావతి గత నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్న భర్త... ఆ తర్వాత నుంచి రూ.20 లక్షల కట్నం తేవాలంటూ వేధింపులకు దిగాడు. అవి కాస్త శ్రుతి మించడంతో ఆమె పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జంబలకడిపంబ: భర్తకు భార్య వేధింపులు!
సాక్షి, బెంగళూరు: భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంత మంది ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు మనం భార్యలను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసే భర్తలను చాలా మందిని చూసుంటాం. అయితే ఇటీవల దీనికి భిన్నంగా ఓ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులో తన భార్య అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్య వేధింపులకు గురిచేస్తోందని మహదేవపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నెక్లెస్ కోసం రూ. 30 లక్షలు, ఆమె చెల్లెలి పెళ్లి కోసం రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ వేధిస్తోందని పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాబాధితుడి కేసులో కొత్త మలుపు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : తనకు ముందే పెళ్లయి విడాకులు తీసుకున్న విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా, అదనపు కట్నం తీసుకురమ్మంటూ తన భార్య వేధిస్తోందని రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త తన భార్యపై దాఖలు చేసిన గృహ హింస కేసు కొత్తమలుపు తిరిగింది. తాము రాజీపడి జీవిస్తున్నా కూడా లాయర్ డబ్బుల కోసం తమను వేధిస్తున్నాడని, తమ అంగీకారం లేకుండా మీడియాకు తమ వివరాలను వెల్లడించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ భార్యాభర్తలిద్దరూ మంగళవారం నున్న రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో అక్కడ హైడ్రామా నడిచింది. వివరాల్లోకెళ్తే.. నున్న ప్రాంతానికి చెందిన సాయిచైతన్య (28) అనే మహిళ, విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన గోగు రామ్‌కుమార్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే సాయి చైతన్యకు ముందుగానే వేరే వ్యక్తితో వివాహమై, పిల్లలు కూడా ఉన్నారని ఆ విషయాలను ఆమె తనకు చెప్పకుండా దాచి వివాహం చేసుకోవడంతో పాటు తనను అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తోందంటూ భర్త రామ్‌కుమార్ తన భార్యపై గృహహింస కేసు పెట్టాడు. భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేసును నమోదు చేశారు. దీంతో ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని, లాయర్ ప్రోద్భలంతోనే తన భార్యపై కేసు పెట్టాల్సి వచ్చిందంటూ బాధితుడు రామ్‌కుమార్ ప్లేట్ ఫిరాయించాడు. తన భార్యతో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని తనకు న్యాయం చేయాల్సిందిగా లాయర్ పుప్పాల శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లగా లక్ష రూపాయలు ఫీజు అడిగారని, ఇందులో రూ.40 వేలు చెల్లించామని తెలిపారు. అయితే ఆ తరువాత భార్యభర్తలిద్దరం రాజీపడి 20 రోజుల నుంచి కలిసి జీవిస్తున్నారు. ఈ విషయం లాయర్‌కు చెబితే నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదని, మిగిలిన రూ.60 వేలు ఫీజు కట్టాలని అడుగుతూ వాటిని ఇవ్వలేదనే అక్కసుతో తమ ప్రమేయం లేకుండా తమ పేర్లను మీడియాకు చెప్పాడని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబ పరువు పోయిందని లాయర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కాగా పోలీసులు పరువునష్టం కేసు కోర్టులో వేసుకోవాలంటూ చెప్పి పంపారు. -
అదనపు కట్నం కోసం ఆగిన పెళ్లి
వేల్పూర్ : అదనపు కట్నం కావాలని వరుడు పెళ్లికి నిరాకరించిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడలో జరిగింది. బుధవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోవడం తో వధువు ఇంట్లో తీవ్ర విచారం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన జుంబరాతి కిషన్, లక్ష్మీ దంపతుల కుమార్తె మానసకు, బా ల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెంది న అల్గోట్ రాజేందర్, మమత దంపతులు ఏకైక కుమారుడు రాజ్‌కుమార్‌తో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి ఈనెల 16న నిశ్చితార్థం కూడా జరిపారు. పెళ్లికి వరకట్నంగా రూ. 6.50 లక్షలు, ఇతర సామగ్రి, ఫర్నిచర్ ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ. 3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. పెళ్లిరోజున మిగతా మూడున్నర లక్షల కట్నం ఇవ్వాల్సి ఉంది. శుభలేఖలు తయారు చేయించుకొని, రెండు కుటుంబాలు వాటిని మార్చుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలో మంగళవారం వరుడు రాజ్‌కుమార్ వధువు ఇంటి వారికి ఫోన్‌చేసి, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, రూ. 20 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. ఇదేమని వరుడు తరపు వారిని అడిగితే మాకు రూ. 30 లక్షల కట్నం ఇచ్చేవారు ఉన్నారని, మీరు రూ.20 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. తాను ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటానని, అంతకట్నం ఎలా ఇస్తానని వధువు తండ్రి కిషన్ వాపోయాడు. అంత కట్నం కోరేవారు తన కూతురుతో ఎందుకు వివాహానికి ఒప్పుకున్నారని ప్రశ్నించాడు. -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
నెల్లూరు (దర్గామిట్ట) : పెళ్లికి ముందే అదనపు కట్నం కోసం వరుడి తల్లిదండ్రులు వేధించడంపై ఓ వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. వివరాలు... నవాబ్‌పేట నజీర్ తోటలో కాపురం ఉంటున్న గోసుల వెంకటసుబ్బయ్య దత్త పుత్రుడు వెంకటసుధీర్కు, కడప జిల్లా బద్వేలుకు చెందిన పాపిశెట్టి వెంకటరమణ కుమార్తె గౌతమికి గత నెల 13న వివాహ నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్ 1న అబ్బాయి ఇంటి వద్ద వివాహం చేయాలని నిర్ణయించారు. అదేరోజు రూ.11లక్షలు కట్నం ఇచ్చేందుకు అంగీకరించి, కొంత నగదు అడ్వాన్సుగా ఇచ్చినట్లు పాపిశెట్టి వెంకటరమణ తెలిపారు. పెళ్లి ఏర్పాట్లలో ఉండగా గత వారం అబ్బాయి బావ రుద్రా గురయ్య వచ్చి మరో రూ.11 లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదనపు కట్నం ఇవ్వకుంటే పెళ్లి జరగదని బెదిరించారని వాపోయారు. మోసం చేసిన అబ్బాయి తండ్రి విశ్రాంత పోలీస్ అధికారిపై రెండో నగర పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కుటుంబ, పరువు ప్రతిష్టలు దెబ్బతీసిన అబ్బాయి తల్లిదండ్రులపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
శాడిస్ట్ భర్త !
► అదనపు కట్నం తెస్తేనే మొదటి రాత్రి ► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు బెంగళూరు(బనశంకరి) : అదనపు కట్నం తీసుకువస్తేనే ఫస్ట్‌నైట్ అంటూ కండిషన్ పెట్టిన ఓ శాడిస్టు భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బసవేశ్వర నగరలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బసవేశ్వరనగర్ లోని మహాగణపతి లేఔట్‌కు చెందిన మహేశ్‌తో 2016 మే ఒకటిన గౌరి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన తొలిరాత్రి నుంచే అదనపు కట్నం తీసుకురావాలని భార్యను సంసారానికి దూరం పెట్టాడు. ఎంత సర్దుకుపోదామని అనుకున్నా అతడు పెట్టే బాధలు భరించలేక ఈ ఏడాది జనవరిలో పుట్టింటికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అత్త శకుంతల, మామ శివ నారాయణ వేధింపులు కూడా ఇందుకు తోడయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఈనెల 19న బసవేశ్వర నగర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొగుడు కాదు యముడు
వరకట్నం కోసం భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త ఫ్యాన్‌కు ఉరేసుకుందని పూడ్చిపెట్టే ప్రయత్నం మృతురాలి తండ్రి వెళ్లడంతో పరార్ నాన్నే కర్రతో కొట్టాడని చెబుతున్న మూడేళ్ల కుమార్తె పోలీసుల అదుపులో అత్త దొరవారిసత్రం (సూళ్లూరుపేట): అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసి జీవితాంతం నీ వెంట ఉంటానని ప్రమాణం చేసిన భర్తే వరకట్నం కోసం యముడిగా మారాడు. మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకుందని గోప్యంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. మండలంలోని మొదుగులపాళెంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు...తడ మండలం పెదమాంబట్టు గ్రామానికి చెందిన సమ్మన మునిరాజ, శ్యామల దంపతుల కుమార్తె హరిత(25)కు మొదుగుళపాళేనికి చెందిన కాటూరు వెంకటయ్య, బుజమ్మ పెద్దకుమారుడు బాబుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మూడేళ్ల కుమార్తె హర్షిత ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చందనముడిలోని సమీప బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిరోజు వేడుకలకు హరితను అత్త బుజ్జమ్మ వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. సాయంత్రం భర్త బాబు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లిందని గొడవ పెట్టుకోవడంతో హరిత బంధువులు ఆమెను తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న బాబు భార్యపై కర్రతో దాడి చేయడంతో మృతి చెందింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుందని మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండానే కుటుంబ సభ్యుల సహాయంతో పూడ్చిపెట్టేందుకు ట్రాక్టర్లో తరలించేందుకు సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలోనే రాత్రి వేళ హరిత తండ్రి మునిరాజ వెళ్లడంతో శవాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నాయుడుపేట సీఐ రత్తయ్య, దొరవారిసత్రం ఎస్సై కోటిరెడ్డి శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. మృతురాలి కుడి చెప్ప, గొంతుపై బలమైన గాయాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అత్త బుజ్జమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తండ్రి మునిరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదనపు కట్నం కోసమే బలితీసుకున్నాడు హరిత, బాబులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో బాబుకు 10 సవర్లు, హరితకు 40 సవర్ల బంగారంతో పాటు కట్నం కింద రూ.5లక్షలు అందజేసినట్లు మృతురాలి తండ్రి మునిరాజా తెలిపాడు. పెళ్లైన ఆరు నెలల నుంచి బాబు అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ పలుమార్లు పుట్టింటికి పంపేవాడు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో కొంత నగదు ఇచ్చి మధ్యస్తం చేసి పంపేవాళ్లమని, అయినా తన బిడ్డను బలితీసుకున్నాడని మృతురాలి తండ్రి బోరున విలపించాడు. చివరికి అభంశుభం తెలియని హరిత మూడేళ్ల కుమార్తె హర్షిత కూడా నాన్న అమ్మను కర్రతో కొట్టాడని వచ్చి రాని మాటల్లో చెబుతుండడం చూసి బంధువులు ఎంత ఘోరమని కన్నీటి పర్యంతమయ్యారు. డీఎస్పీ విచారణ గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు మొదుగుళపాళేనికి చేరుకుని హరిత మృతదేహాన్ని పరిశీలించి మృతిపై విచారించారు. అనంతరం నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్‌తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు. సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేశాడు
-
అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేశాడు
• బిడ్డకు పాలు పట్టనివ్వకుండా వేధింపులు • కట్నం కోసం భర్త, అత్త దాష్టీకం • ఎన్ఆర్ఐ ఆవేదన హిమాయత్‌నగర్: అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిర్ధాక్షిణ్యంగా తన భర్త తనను వదిలి వెళ్లాడని ఓ ఎన్ఆర్ఐ మహిళ వాపోయింది.గురువారం బాలల హక్కుల సంఘం నేతలతో కలిసి వివరాలు వెల్లడించింది. వనస్థలిపురంకు చెందిన శిరీషను, రామంతపూర్‌కు చెందిన యలాల కీర్తిసాయిరెడ్డికి ఇచ్చి 2015జూన్‌లో పెళ్లి చేశారు. పెళ్లైన పదిరోజులకు భర్తతో కలిసి అమెరికాలోని వర్జినియాకు వెళ్లింది. కొద్ది రోజులకే భర్త కీర్తిసాయిరెడ్డి, అత్త వనిత నుంచి ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. పెళ్లి సమయంలో 36తులాల బంగారం, ఎకరం భూమి, వెండి, రూ.లక్ష నగదును ఇచ్చామని, అయినా తన అత్త వనిత అదనపు కట్నం కావాలని వేధించడమేగాక, భర్తను అందుకు పురిగొల్పేదన్నారు. తన భర్త కీర్తిసాయి రెడ్డి ఇంట్లో సీసీకెమెరాలు అమర్చి తాను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో ప్రతిదీ గమనించి సాయంత్రం ఇంటికి రాగానే గొడవ పెట్టుకునేవాడన్నారు. పుట్టిన బిడ్డకు పాలు ఇస్తే తనకు దగ్గరవుతాడని, తన కుమారుడికి పాలుపట్టనిచ్చేవారు కాదన్నారు. అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన తాము శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే సరికి అర్థరాత్రి 2.30గంటలు అయ్యిందన్నారు. ఆ సమయంలో తనను, బిడ్డతో సహా ఒంటరిగా వదిలేసి తాను ఒక్కడే వదిలేసి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది.చేతిలో రూపాయి లేక, ఫోన్ చేసేందుకు సెల్‌ఫోన్ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను గుర్తించిన ఓ ఏఎస్సై క్యాబ్‌లో కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి ఇంటికి పంపారని తెలిపింది. అచ్యుతరావు మాట్లాడుతూ పసికందు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కీర్తిసాయిరెడ్డి, వనితలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. -
'20 లక్షలు తీసుకొని.. విడాకులివ్వమన్నారు'
గుంటూరు: అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులు ఎదురవడంతో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లాలోని చుండూరు మండలం వేటపాలెంకు చెందిన పీజీ వైద్య విద్యార్థిని దేవిలక్ష్మిని డాక్టర్ సాయికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన పది రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. 14 నెలలుగా వేధిస్తూనే ఉండగా అతని తల్లిదండ్రులు కూడా కొడుక్కు వత్తాసు పలుకుతూ విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. కాగా, ప్రభుత్వ విప్ దూళిపాళ్ల నరేంద్ర కూతురును సాయి కృష్ణకు ఇచ్చి వివాహం చేయాలని చూస్తున్నారని దేవిలక్ష్మి తల్లి వాణి ఆరోపించారు. అందుకే తమకు రూ.20 లక్షలు ఇచ్చి విడాకులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడటంతో దేవి లక్ష్మి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని దేవిలక్ష్మి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. సాయికృష్ణ తండ్రి సాంబశివరావు నాగార్జున యూనివర్సిటీలో రెక్టార్‌గా పనిచేస్తుండగా తల్లి కృష్ణశ్రీ పొగాకు బోర్డు ఉద్యోగి. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు కట్టుకున్నోడే హత్య చేశాడని మృతురాలి బంధువుల ఆరోపణ అనాథగా మిగిలిన ఏడాదిన్నర చిన్నారి ఆగ్రహంతో అత్తింటిని తగులబెట్టిన స్థానిక మహిళలు సీతారాంపురం(దేవరుప్పుల) : తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తింటి వరకట్న దాహానికి బలైన సంఘటన శనివారం రాత్రి సీతారాంపురంలో జరిగింది. మృతురాలి తండ్రి మల్లయ్య కథనం ప్రకారం.. మండలంలోని సీతారాంపురానికి చెందిన ఆవుల ఉప్పలయ్య, మైసమ్మ దంపతుల మూడో కుమారుడు తిరుమలేష్ అస్సోంలో బీఎస్ఎఫ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వన్నెకాల మల్లయ్య, అంజమ్మ కూతురు హైమ(23)ను అతడు రెండున్నరేళ్ల క్రితం ప్రేమించాడు. ఒకే సామాజిక వర్గం(కుర్మ) కావడంతో పెద్దల సమక్షంలో 2014 మేలో లాంఛనంగా తొమ్మిది లక్షల కట్నం ఇచ్చి వివాహం చేశారు. వారి దాంపత్యంలో కుమార్తె మోక్షిత జన్మించింది. తిరుమలేష్ సెలవులు దొరికినప్పుడు ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో భర్త, అత్త, మామలు ఆదనపు వరకట్నం కోసం డిమాండ్ చేయగా ఆమె పుట్టింటివారు రాఖీ పండుగ సమయంలో రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఆమె పుట్టిం ట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం సద్దు ల బతుకమ్మ ఆడేందుకు హైమ చెరువు వద్దకు వెళ్లగా భర్త తిరుమలేష్ అక్కడికి వచ్చి వెంట తీసుకెళ్లాడు. సుమారు గంటన్నరపాటు వారి మధ్య సంభాషణ జరుగుతుండగా అనుమా నం కలిగిన గ్రామస్తులు వాకబు చేయగా ఏమీ లేదని వెళ్ల్లగొట్టాడు. ఈ సమయంలోనే మాయమాటలు చెప్పి ఆమెకు థమ్సప్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. అనంతరం ఆమె ను పుట్టింట్లో దింపి వెళ్లాడు. తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూసేసరికి హైమ నోట్లో నుంచి నురుగులు రావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. హైమ మృతిపై మృతురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటికి నిప్పుపెట్టిన స్థానికులు హైమపై అత్తింటివారి వేధింపులను గతంలో స్వయంగా చూసిన స్థానికులు ఆమె మృతితో కోపోద్రిక్తులయ్యారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అత్తగారికి చెందిన రెండు ఇళ్లను తగులబెట్టారు. దీంతో పెద్దఎత్తున మంటలు లేచి పరిసరాలకు ప్రమాదం వాటిల్లే స్థితిలో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మం టలార్పేందుకు యత్నించగా మహిళలు పూర్తి గా తగులపడాల్సేందేనని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైమ మృతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేస్తామని, విధ్వంసం సరికాదని ఎస్సై గడ్డం నరేందర్‌రెడ్డి సముదాయించడం తో ఆందోళనకారులు శాంతించారు. అయితే ఆదివారం రాత్రి మృతదేహాన్ని అత్తింటి ఎదుట ఉంచి తమ ఆందోళనను కొన సాగించారు. హైమ కూతురికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలకుర్తి, కొడకండ్ల ఎస్సైలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ కలిసి తదుపరి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా చర్యలు తీసుకున్నారు. -
అదనపు కట్నం పిశాచికి నిండు గర్భిణి బలి
– ఉరేసి చంపిన భర్త, అత్త, ఆడపడచు పుసులూరు (నంద్యాల): మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఓ మహిళ అదనపు కట్నం పిశాచికి బలైంది. ఈ ఘటన నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజా హుసేన్‌కు ఐదేళ్ల క్రితం సంజామలకు చెందిన హసీనాబీతో వివాహమైంది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం హసీనాబీ 8 నెలల గర్భిణి. కొన్నాళ్లుగా భర్త అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. అలాగే అత్త రసూల్‌బీ, ఆడపడచు సోఫియా కూడా తోడయ్యారు. ఈ విషయంపై శుక్రవారం రాత్రి వీరంతా ఆమెతో ఘర్షణ పడ్డారు. శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న హసీనాబీ మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత ఆమె పుట్టింటికి సమాచారాన్ని అందించారు. డీఎస్పీ హరినాథరెడ్డి, రూరల్ ఎస్ఐ శివాంజల్ సంఘటన స్థలాన్ని సందర్శించి, విచారణ చేశారు. తహసీల్దార్ శివరామిరెడ్డి శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు భర్త, అత్త, ఆడపడచు పరారీలో ఉన్నారు. -
అదనపు కట్నం కోసం కోడలి హత్య
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం విచారణ చేపట్టిన డీఎస్పీ వీరేశ్వర్‌రావు పోలీసుల అదుపులో అత్త, మామ ఇల్లెందు అర్బన్ : అదనపు కట్నం కోసం కోడలిని హింసించి.. గొంతునులిమి హత్య చేసిన సంఘటన ఇల్లందులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన మాదంశెట్టి రామయ్య, తిరుపతమ్మ కుమారుడు శ్రీనివాస్‌కు.. ఖమ్మంలోని చెరువుబజార్‌కు చెందిన అపర్ణ(21)తో గత ఏడాది వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత అపర్ణంను అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త, మామ, భర్త వేధించసాగారు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి.. అపర్ణను ఇబ్బందులకు గురిచేయమంటూ వారం రోజుల క్రితం అత్త, మామ ఆమెను ఇల్లెందుకు తీసుకొచ్చారు. వచ్చిన రెండో రోజు నుంచి యాథావిధిగా వరకట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను అత్త, మామ, భర్త మూకుమ్మడిగా గాయపరిచి.. హతమార్చారు. స్థానికులకు అనుమానం రాకుండా అపర్ణ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ చిత్రీకరించేందుకు యత్నించారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యుడు మృతిచెందిందని ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని అత్తగారింటికి తీసుకొచ్చారు. తర్వాత మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ వీరేశ్వర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతురాలి మామను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త శ్రీనివాస్ పరారీలో ఉండటంతో అనుమానం వచ్చిన డీఎస్పీ సమగ్ర విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా.. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో.. తీవ్రంగా గాయపరిచి.. గొంతు నులమడంతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అత్త, మామపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, అపర్ణ మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది -
తెలిసినోడని ఇస్తే కట్నదాహానికి బలిచ్చాడు
రాజేంద్రనగర్: అదనపు కట్నం తెమ్మని భర్త వేధిస్తుండటంతో ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్ కుమార్తె స్వప్న (23)ను రెడ్డికోట మండలానికి చెందిన శ్రీనివాస్(27)కు ఇచ్చి రెండున్నరేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కట్నం కింద రూ. 2 లక్షల నగదు, 20 తులాల బంగారం, గృహోపకరణాలు ఇచ్చారు. శ్రీనివాస్ భార్య స్వప్నను తీసుకొని కొన్ని నెలల క్రితం హైదర్షాకోట్ ప్రాంతంలో కాపురం పెట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని నమ్మబలికిన శ్రీనివాస్.. జులాయిగా తిరుగుతూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాడు. అదనపు కట్నం తెమ్మని కొద్ది రోజులుగా భార్యను వేధిస్తున్నాడు. వీటిని తాళలేక స్వప్న గురువారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పుష్కర యాత్రలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి నేరుగా శుక్రవారం ఉదయం నార్సింగి ఠాణాకు చేరుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను తెలిసిన వాడని శ్రీనివాస్‌కు ఇచ్చిపెళ్లి చేస్తే.. అదనపు కట్నం కోసం వేధించి ఉసురుతీశాడని బోరుమన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
కట్టుకున్నోళ్లే కడతేర్చారు
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగించి.. మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు. కిరోసిన్ పోసి నిప్పంటించి.. చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. ∙ -
కట్టుకున్నోళ్లే కడతేర్చారు..
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పురుగుల మందు తాగించి.. మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్ తెలిపారు. కిరోసిన్ పోసి నిప్పంటించి.. చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. ∙ -
భర్త వేధింపులతోనే శరణ్య ఆత్మహత్య
ముషీరాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారి వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని శిక్షించాలని కరీనంగర్‌లోని కాపువాడకు చెందిన మృతురాలి తల్లిదండ్రులు మోహన్, విజయ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ చిన్న కుమార్తె శరణ్య(25)ను రామగుండం ఎన్టీపీసీకి చెందిన ఎం.మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో వివాహం జరిపించామన్నారు. రూ.10లక్షలు నగదు, 30తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.30లక్షలు విలువ చేసే రెండుగుంటల స్థలాన్ని కట్నం కింద ఇచ్చామన్నారు. తమ కుమార్తె ఓసాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా పెళ్లయిన తరువాత ఉద్యోగం మానిపించి మధుకర్ తనతోపాటు బెంగళూరు తీసుకెళ్లారన్నారు. అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలకు గురిచేయడంతో ఈ నెల 3న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె ఏడు నెలల గర్భవతిని చెప్పారు. శరణ్య మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందన్నారు. మధుకర్ తనకున్న పలుకుబడితో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, కరీంనగర్ ఎస్పీ స్పందించి తమ కుమార్తె ఆత్మహత్యకు కారుకులైన మధుకర్, అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయూలని కోరారు. -
అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి
♦ తలకు గాయం.. తీవ్ర రక్తస్రావం ♦ ఉరి వేసుకుందని ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త మెదక్‌రూరల్: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైన సంఘటన మండలం అవుసులపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...అవుసులపల్లి గ్రామానికి చెందిన యాదాగౌడ్-కమలమ్మల మొదటి సంతానం స్వాతి(25)ని ఇదే గ్రామంలోని మిన్పూర్ బాలాగౌడ్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి 8 ఏళ్లలోపు ఇద్దరు సంతానం ఉన్నారు. పెళ్లి సమయంలో బాలాగౌడ్‌కు కట్నకానుకలు ఘనంగా సమర్పించారు. అయితే మూడు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ బాలాగౌడ్ స్వాతిని హింసిస్తున్నాడు. ఈ క్రమంలో స్వాతి తల్లిదండ్రులు ఇటీవల బాలాగౌడ్‌కు రూ. 20 వేలు ముట్టజెప్పారు. అయినప్పటికీ అత్యాశకు పోయిన బాలాగౌడ్ మరింత కట్నం తీసుకురావాలంటూ శనివారం రాత్రి సైతం వేధించడంతో స్వాతి అదే గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి విషయం తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి 10 గంటల సమయంలో ‘మీ కూతురు ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకుంది. తీయడం లేద’ంటూ ఆమె భర్త స్వాతి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడగా స్వాతి ఉరి వేసుకొని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా స్వాతి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైనట్లు గుర్తించారు. దీంతో బాలాగౌడ్ తమ బిడ్డను గోడకు కొట్టి చంపేసి, ఉరి వేశాడని స్వాతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం తగులబెట్టేందుకు యత్నం
► తప్పించుకున్న వివాహిత ► వడ్డినకొప్ప గ్రామంలో ఘటన శివమొగ్గ : కుమార్తెతో సమానంగా చూడాల్సిన కోడలిని అత్త, మామ, అడపడచు రాచి రంపాన పెట్టారు. అదనపు కట్నం కోసం కోడలిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించారు. అయితే బాధితురాలు వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శివమొగ్గ పొలిసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శిరసి ప్రాంతానికి చెందిన ప్రియకు మూడు సంవత్సరాల క్రితం శివమొగ్గ నగరం సమీపంలోని వడ్డినకొప్ప గ్రామానికి చెందిన మంజునాథ్‌తో వివాహమైంది. ఈ సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాల కట్న వేధింపులు మొదలయ్యాయి. అదనంగా రూ. 25 లక్షలు తీసుకురావాలని మంజునాథ్ తల్లి నీలమ్మ, తండ్రి తిమ్మణ్ణ, వారి కుమార్తె కలిసి ప్రియను రాచి రంపాన పెట్టడంతోపాటు ఓ దశలో చేయి కూడా చేసుకునేవారు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరోమారు వేధింపులకు పాల్పడ్డారు. తాము చెప్పిన మొత్తం తీసుకురాకపోతే చంపివేస్తామని బెదిరించారు. దీనికితోడు తెల్ల కాగితంపై సంతకం చేయించాలని కత్తులతో సైతం బెదిరించారు. అయినప్పటికీ సంతకం పెట్టలేదు. దీంతో అత్తమామలు ప్రియను బంధించి వంటిపై కిరోసిన్ పోశారు. నిప్పు పెట్టేందుకు యత్నించగా ప్రియ తప్పించుకొని ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శివమొగ్గ ఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న అత్త, మామ, అడపడచు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
కట్నం కోసం కూతుర్ని చంపిన తండ్రి
కట్నం కోసం కన్న కూతర్ని కడతేర్చి బావిలో పడేశాడో తండ్రి. అదనపు కట్నం తీసుకురమ్మని భార్యను పలుమార్లు హింసించినా ఆమె డబ్బు తేకపోవడంతో.. కోపోద్రిక్తుడైన వ్యక్తి తమ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతునులిమి హత్య చేసి బావిలో పడేశాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భీమిని మండలం కుషనపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసంది. చిన్నారి కనిపించడం లేదని ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టుపక్కల వెతుకుండగా.. బావిలో పాప మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
కట్నం వేధింపులపై చర్యకు వినతి
- ‘గ్రీవెన్స్’లో ఎస్పీకి మహిళ ఫిర్యాదు సంగారెడ్డి క్రైం: అదనపు కట్నం కోసం వేధిస్తున్న తన భర్త, అత్తమామలు, బంధువులపై చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి మడలం అల్వాల్ గ్రామానికి చెందిన తూము అనిత ఎస్పీ సుమతికి విన్నవించారు. గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుమతి ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకున్నారు. న్యాయం చేస్తానని ఎస్పీ ఆమెకు హామీనిచ్చారు. కాగా, తమ సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన కళావతి, స్వరూప ఫిర్యాదు చేశారు. తన భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారంటూ గొల్ల సురేష్ (జహీరాబాద్), దారిని కొందరు తమ సొంత భూమిలో కలుపుకొన్నారంటూ మజీద్‌పల్లి గ్రామస్తులు ఎస్పీ దృష్టికి తెచ్చారు. -
రూ. కోటి తెస్తేనే కాపురమంటున్నాడు
* మేడ్చల్ ఎస్ఐ సతీష్‌పై భార్య శిరీష ఆరోపణ * అతని నుంచి రక్షించాలని అభ్యర్థన రాజమండ్రి క్రైం: తన భర్త, మేడ్చల్ ఎస్ఐ సతీష్ రూ. కోటి అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధిస్తున్నాడని రాజమండ్రికి చెందిన శిరీష వాపోయింది. అతడి బారి నుంచి తనకు, తన తండ్రికి రక్షణ కల్పించాలని వేడుకుంది. బుధవారం ఆమె ‘సాక్షి’ మీడియూతో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్ ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్‌కు శిరీషనిచ్చి పెళ్లి చేసినప్పుడు రూ.17 లక్షల కట్నం, నాలుగు అంతస్తుల బిల్డింగ్, ఇతర లాంఛనాలు ఇచ్చారు. అయితే రూ. కోటి అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి రావాలని చెప్పి తొమ్మిదవ రోజునే శిరీషను బయటకు గెంటివేశాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేసి ఎస్ఐగా తన వద్దకు వచ్చే కేసుల నుంచి అక్రమంగా ఎలా సంపాదిస్తున్నదీ వివరించేవాడు. అంత భారీగా సంపాదిస్తున్న తనకు రూ. కోటి కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకువెళతానని చెప్పేవాడు. భర్తతో పాటు అత్త మామలు, ఆడపడుచులు శిరీషను వేధించేవారు. దీంతో శిరీష తన భర్తపై గతేడాది అక్టోబర్ 17న రాజమండ్రి మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. కాగా భర్త తనపైనా, తన తండ్రిపైనా తిరిగి అక్రమ కేసులు పెట్టాడని, ఆ ‘క్రిమినల్ ఎస్ఐ’ నుంచి తమకు రక్షణ కల్పించాలని శిరీష వేడుకుంది. -
భర్త నుంచి రక్షణ కల్పించండి
కలెక్టర్‌కు కలిసిన రాసాల పావని హన్మకొండ అర్బన్ : అదనపు కట్నం, వివాహేతర సంబంధాల పేరుతో వేధిస్తూ చంపుతానని భయపెడుతున్న భర్త విలేకరి రాసారాల వెంకట్ నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని రాసాల పావని శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. భర్త తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా వినడం లేదని తెలిపింది. డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే తన రెండో పెళ్లికి సహకరించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని వివరించింది. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. కేసులు నమోదు బాధితురాలి సమస్యలపై కలెక్టర్ వాకాటి కరుణ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విలేకరి వెంకట్‌పై అదనపు కట్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తదుపరి చర్యల కోసం వరంగల్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. -
భార్యను వేధిస్తున్న భర్త అరెస్ట్
పెంటపాడు: అదనపు కట్నం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని పెంటపాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కె.గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన రాచర్ల రత్నరాజు తన భార్య విజయకుమారిని మరింత కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. విజయకుమారి ఫిర్యాదు మేరకు గుర్రయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్సై రత్నరాజు తెలిపారు. -
నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లిలో బుధవారం జరిగింది. గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్‌కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010లో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతరు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్‌కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మమత గోవింద్‌పల్లి బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడిక్కడే మృతి చెందింది. -
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
-
అదనపు కట్నం కోసం 4 రోజులుగా ఇంట్లోనే శవం!
గుంటూరు: తుళ్లూరు మండలం శాఖమూరులో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కోడలు ఆత్మహత్య చేసుకున్న అదనపు కట్నం కోరిన అత్తమామలు - నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం - భర్తపై భార్య బంధువుల దాడి... దాంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్తవారి వేధింపులకు తట్టుకోలేక శ్రీలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.కోడలు చనిపోయినా అత్తమామలకు కనికరంలేదు. ఇంకా అదనపు కట్నం కావాలని శ్రీలక్ష్మి మృతదేహాన్ని నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంచారు. ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పంచాయతీ కుదిరింది. అత్యక్రియల సమయంలో శ్రీలక్ష్మి భర్తపై ఆమె బంధువులు దాడి చేశారు. దాంతో భర్త బంధువులు శ్రీలక్ష్మి మృతదేహాన్ని రోడ్డు మీదే వదలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షస్తున్నారు. -
బెంగళూరులో వరకట్నపు చావు
భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో విషాదం స్వప్నది ఆత్మహత్య కాదు.. హత్యే అంటున్న తల్లిదండ్రులు మామునూరు : అదనపు కట్నం కోసం కట్టుకున్నోడే భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. బెంగళూరులో గత శనివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడడంతో వరంగల్‌లోని మామునూరు బెటాలియన్‌లో మంగళవారం విషాదం నెలకొంది. మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న సలేంద్ర సుధాకర్ కూతురు స్వప్న(23)ను నల్లబెల్లి మండలం పంతులుపల్లికి చెందిన ఆసం సుదర్శన్ కొడుకు రాంప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం సందర్భంగా రూ.8లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. రాంప్రసాద్ బెంగళూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వారి కాపురం కొద్ది రోజులుగా సజావుగానే సాగింది. ఈ క్రమంలో అత్తమామలు ఒత్తిడి తేవడంతో అదనపు కట్నం తేవాలని స్వప్నను రాంప్రసాద్ చిత్రహింసలు పెడుతున్నాడు. విషయూన్ని ఆమె తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో వారు రాంప్రసాద్ తల్లిదండ్రుల వద్దకు వెృళ్లి మీ కుమారుడిని మందలించాలని కోరారు. ఆయినా రాంప్రసాద్ తీరు మారలేదు. ఈ క్రమంలోనే అతడు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలోనే మరో అమ్మాయితో రాంప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భార్య స్వప్నను ఎలాగైన వదిలించుకోవాలని మరో అమ్మాయితో కలిసి రాంప్రసాద్ పథకం పన్ని విఫలమయ్యూడు. చేసేది లేక రాంప్రసాద్ శనివారం మధ్యాహ్నం భార్యను కొట్టి చంపి అదే రాత్రి ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అంతేకాక స్వప్న తల్లిదండ్రులకు ఆదివారం మధ్యాహ్నం మీ కుమార్తె ఉరి వేసుకుని మృతిచెందిందని రాంప్రసాద్ స్వయంగా ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో బెంగళూర్‌కు చేరుకొని మృతిరాలి తండ్రి సలేంద్ర సుధాకర్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారని మృతురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుది ఆత్మహత్య కాదు.. హత్యే అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బెంగళూర్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో ఫోస్ట్‌మార్టం పూర్తి చేసిన స్పప్న మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం మామునూరు క్వార్టర్స్‌కు తరలించారు. కాగా, మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
భార్యను చంపిన భర్త
అదనపు కట్నం కోసం దారుణం నేరేడ్మెట్: అదనపు కట్నం కోసం గొంతు నలిమి భార్యను హత్య చేశాడో కిరాతకుడు. నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు, స్థానికుల కథనం ప్రకారం....గౌతంనగర్‌లో నివాసముండే శ్రీకళ (26), శ్రీకాంత్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2007లో పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో శ్రీకళ తల్లిదండ్రులు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. నాలుగు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత కారు కొనుగోలు చేసి ట్రావెల్స్‌లో నడుపుతానని, రూ.2 లక్షలు అదనపు కట్నం కింద తేవాలని శ్రీకాంత్, తన తల్లి విజయ, సోదరుడు మధుతో కలిసి శ్రీకళను వేధించడం ప్రారంభించాడు. దీంతో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. దానిని వారు అమ్ముకుని జల్సాలు చేసి తిరిగి డబ్బులు కావాలని శ్రీకళను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంతగా వేధించినా ఆమె డబ్బులు తీసుకొని రాకపోవడంతో శ్రీకాంత్ తన తల్లి, సోదరుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున శ్రీకళ గొంతు నులిమిహతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి నీలం యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం కోసం వేధిస్తున్నారు
రైల్వేకోడూరు అర్బన్: అదనపు కట్నం కోసం అత్త, మామ, ఆడబిడ్డ తనను వేధిస్తున్నారని, తనకు తెలియకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఉర్లగడ్డపోడు అరుంధతివాడకు చెందిన కొమ్మలపూడి సుమలత అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడితో 2012 సంవత్సరంలో ఈమెకు వివాహమైంది. వివాహ సమయంలో ఈమె భర్త రేణిగుంట సమీపంలోని అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తాడని చెప్పారు. కానీ ఆ తర్వాత అతను ఉద్యోగం చేయడం లేదని తెలిసింది. వివాహ సమయంలో సుమలత తల్లిదండ్రులు ఐదు తులాల బంగారు, రూ. 50 వేలు నగదు ఇచ్చారు. అయితే వివాహానికి రూ. 3 లక్షలు ఖర్చయిందని అద నపు కట్నం తేవాలని అత్త చంద్రమ్మ, మామ చంద్రయ్య, ఆడబిడ్డ లలిత వేధిస్తున్నారని పేర్కొంది. రెండుసార్లు తాను ఆత్మహత్యకు యత్నించగా తన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారని తెలిపింది. తర్వాత గ్రామపెద్దలు పంచాయతీ చేయడంతో తన భర్తతో సాఫీగా సంసారం చేస్తూ వచ్చానని, కానీ 2014 మార్చి 12వ తేదీన సుజాత అనే అమ్మాయిని తనకు తెలియకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. వీరందరిపై కేసు నమోదుచేయాలని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రామచంద్ర తెలిపారు. -
‘రాజీ’కి వచ్చిన అత్తమామలపై దాడి
రామగుండం: పెళ్లయిన మూడు నెలలకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడంతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2011లలో మండలంలోని లింగాపూర్‌లో చోటు చేసుకుంది. భార్య మృతికి కారకుడైన భర్తపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ట్రయల్‌కు రావడంతో సదరు ఉపాధ్యాయుడు అత్తమామలతో రాజీ కుదుర్చుకునేందుకు రావడంతో చెల్లిని చంపి రాజీకి వచ్చారా? అంటూ మృతురాలి సోదరుడు అత్తామామలపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం లింగాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై విద్యాసాగర్ కథనం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గాలిపెల్లి ఎల్లయ్య కూతురు శ్యామలను 2011లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలోని చిన్నబోజాల గ్రామానికి చెందిన మేనల్లుడు మోకెనపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శ్రీనివాస్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక శ్యామలను అదనపు కట్నం పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె జూలై 2012న తల్లి గారిల్లైన లింగాపూర్‌కు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూతురు మృతికి కారణమైన అల్లుడిపై గాలిపెల్లి ఎల్లయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మోకెనపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచులు భూమక్క, నర్సక్కలపై 498(ఎ), 304(బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కేసు జిల్లా సెషన్‌కోర్టులో నడుస్తోంది. ఈ మధ్యలో ట్రయల్ రావడంతో మోకెనపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు మోకెనపల్లి రాజలింగం, దేవమ్మలతో పాటు లింగాపూర్‌కు చెందిన సమీప బంధువులు మోకెనపల్లి నారాయణ, మోకెనపల్లి బాలకృష్ణ, గోగెర్ల శేఖర్ తదితర పెద్దమనుషుల సహాయంతో ఆదివారం మృతురాలి తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకొని కేసును కొట్టివేయించుకునేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు గాలిపెల్లి శ్రీనివాస్ ఒక్కసారి ఆవేశానికి లోనయ్యాడు. చెల్లెలు మృతికి కారకుడై ఉండీ కేసును కొట్టేయించుకునేందుకు రాజీకి వచ్చారా? అంటూ మోకెన పల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో గోదావరిఖనికి తరలించారు. డాక్టర్లు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. అనంతరం దేవమ్మ, రాజలింగంను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
గుంటూరు రూరల్: అత్తింటి ఆరళ్లకు ఓ వివాహిత మహిళ బలైంది. భర్తతో కలిసి వేరు కాపురం ఉంటున్న కోడలి దగ్గరికి మరో ఇద్దరితో కలసి వచ్చిన ఆమె మామ తిరిగి వెళ్లే సరికి ఆమె విగ తజీవిగా మారింది. ఇంట్లో ఫ్యానుకు వేలాడుతున్న తల్లిని చూసి ఏడు నెలల చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తోంది. అది విన్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని, ఆమె బంధువులకు సమాచారం చేరవేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి వారే తమ కుమార్తెను హతమార్చారని ఆరోపించారు. ఈ విషాద ఘటన గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ళకు చెందిన కటారి వెంకటేశ్వర్లు, ప్రభుకుమారిలకు ముగ్గురు సంతానం. మూడో కుమార్తె రమాదేవికి గుంటూరు శ్రీనగర్ 7వ లైన్‌కు చెందిన సత్తెనపల్లి కోటేశ్వరావు కుమారుడు అమోస్తో ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. వీరికి ఏడు నెలల కుమారుడు జాన్‌మోజెస్ ఉన్నాడు. రమాదేవి తండ్రి వివాహ సమయంలోనే స్వర్ణభారతినగర్‌లో ఉన్న ఒక ప్లాట్‌ను విక్రయించి వరకట్నం కింద రూ.3.5 లక్షల నగదు, 15 సవర్ల బంగారం ఇచ్చాడు. అయినా పెళ్లయినప్పటి నుంచి భర్త, మామ రమాదేవిని వే ధించసాగారు. కోటేశ్వరరావుతో వివాహేతర సంబంధం నెరుపుతున్న మహిళ బాజీ, ఆమె అక్క కుమారుడు మహమ్మద్ కూడా వీరికి తోడయ్యారు. వివాహ సమయంలో అమోస్ తల్లి మరణించినట్టు, తండ్రి మరో మహిళలతో ఉంటున్నట్లు కూడా రమాదేవి కుటుంబసభ్యులకు తెలియనివ్వలేదు. స్వర్ణభారతినగర్‌లో రమాదేవి పేరుతో ఉన్న రెండో ప్లాట్‌ను విక్రయించాల్సిందిగా తరచూ వేధిస్తున్నారు. పథకం ప్రకారం ఇంటికి వచ్చి.. వీరి గొడవల విషయం తెలుసుకున్న రమాదేవి కుటుంసభ్యులు ఆర్నెల్ల కిందట పెద్దల సమక్షంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదం చోటు చే సుకోకుండా ఉండేలా మాట్లాడి శ్రీనగర్ 5/2లో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టించారు. ఈ క్రమంలో బాజీ మనవరాలితో అమోస్‌కు మరో వివాహం చేయాలని కోటేశ్వరరావు పథకం వేశాడు. వేరు కాపురం ఉంటున్న కొడుకు నుంచి రమాదేవిని దూరం చేయాలని పథకం వేశాడు. పథకం ప్రకారం బుధవారం రాత్రి కోటేశ్వరరావు, బాజీ, మహమ్మద్‌లు రమాదేవి ఇంటికి వచ్చారు. ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్న రమాదేవి అదేసమయంలో క్షేమ సమాచారం తెలుసుకునేందుకు తల్లి ఫోన్ చేయగా ఇంటికి ముగ్గురూ వచ్చారని, తాను మరలా మాట్లాడతానని చెప్పి, పెట్టేసింది. ఆ వచ్చిన ముగ్గురూ రమాదేవిని తీవ్రంగా కొట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసి వెళ్లిపోయారు. పసిబాలుడి ఏడ్పు విని, అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగు రమాదేవి ఫ్యాన్‌కు వేలాడటం గమనించారు. ఆమె బంధువులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకున్న ఆమె బంధువులు మృతదేహన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. రమాదేవిని అత్తింటి వారే హతమార్చారంటూ విలపించారు. అరండల్‌పేట సీఐ శివప్రసాద్, సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త అమోస్, మామ కోటేశ్వరరావు, బాజీ, మహమ్మద్‌లపై కేసు నమోదు చే శారు. మృతదేహన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టషన్‌కు త రలించి విచారిస్తున్నారు. -
కట్నం కోసం వ్యభిచారం చేయమంటున్నారు...
హెచ్ఆర్సీని ఆశ్రయించిన నవవధువు అఫ్జల్‌గంజ్: వ్యభిచారం చేసి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని ఓ నవవధువు హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి 2015 జనవరి 28 లోగా నివేదిక అందించాలని మల్కాజిగిరి ఏసీపీకి హెచ్ఆర్సీ సభ్యులు మిర్యాల రామారావు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఫీర్జాదిగూడకు చెందిన యువతి (27), అవినాష్సింగ్లకు ఈ ఏడాది మే 24న పెళ్లైంది. రూ.4 లక్షల నగదు, 11 తులాల బంగారు నగలు, కిలో వెండి, బైక్ కానుకలుగా ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అవినాష్సింగ్తో పాటు అతని తల్లిదండ్రులు రూపాఠాకూర్,అమృత్‌సింగ్ అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు. పెళ్లైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా భర్త తనను భార్యగా చూడలేదని, సంసారం కూడా చేయలేదని ఆమె వాపోయింది. మీ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వకపోతే.. వ్యభిచారం చేసైనా నువ్వు డబ్బు తీసుకురావాలని వేధించారని, నాకు మద్దతుగా మాట్లాడిన వారితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో పాటు తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించారని ఆమె వాపోయింది. పగటిపూట తన తండ్రి వద్ద, రాత్రి తన వద్ద పడుకోవాలని భర్త కొద్ది రోజులుగా బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. వారి వేధింపులు తాళలేక నవంబర్ 3న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. -
వరకట్న హత్య?
నెల్లూరు (క్రైమ్) : వైవాహిక జీవితంపై ఎన్నో కలలతో మెట్టింట్లోకి అడుగుపెట్టింది. కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తంటి వేధింపులకు గురైంది. సంసార మాధుర్యాన్ని ఆస్వాదించే లోపే అత్తింటి వరకట్న దాహం ఆమెను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన వెంగళరావ్‌నగర్ సీ బ్లాక్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రాపూరు కొత్తపేటకు చెందిన షేక్ మాసుమ్సాహెబ్, షంషాద్లు దంపతులు. వారికి రియాజ్, ఇలియాజ్, ఇంతియాజ్, హసీనా అలియాస్ షాహీనా(26) పిల్లలు. మసూమ్సాహెబ్ పిల్లలు చిన్న తనంలోనే మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారులే అన్నీ తామై కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. ఒకే ఒక ఆడపిల్ల కావడంతో షాహీనాను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు. అన్నల ఆశయాలకు అనుగుణంగా షాహీనా ఎంఏ బీఈడీ పూర్తి చేసింది. వెంగళరావ్ నగర్‌కు చెందిన షేక్ మీరాసాహెబ్ (విశ్రాంత ఏఆర్ ఎస్ఐ), బీబీజాన్ దంపతుల కుమారుడు షేక్ ఖాసింవలి ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. షాహీనా బంధువులు వెంగళరావునగర్‌లో నివాసముంటున్నారు. వారి ద్వారా సంబంధాలు చూసుకున్నారు. అమ్మాయి చదుకుని ఉండటంతో తమ కుమారుడు ఖాసింవలికి ఇచ్చి పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు షాహీనా కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ మేరకు రూ.8 లక్షలు కట్నం, 25 సవర్ల బంగారు ఇచ్చేలా ఇరుపెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయం అయింది. అనంతరం రూ.10 లక్షలు కట్నం, 30 సవర్ల బంగారు ఆభరణాలు ఇవ్వాలని ఖాసింవలి తల్లి డిమాండ్ చేసింది. తాము ఇచ్చుకోలేమని షాహీనా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ ఖాసింవలి, షాహీనా వివాహం జరిగింది. అదనపుకట్నం కోసం వేధింపులు వివాహామైన కొద్ది రోజుల నుంచే అత్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించింది. రూ.5 లక్షలు అదనంగా కట్నం తీసుకురావాలని డిమాండ్ చేసేది. తమ కొడుక్కి మంచి మంచి సంబంధాలొచ్చాయంటూ షాహీనాను సూటిపోటి మాటలతో హింసించ సాగింది. ఈ విషయాన్ని షాహీనా తన భర్తకు తెలిపింది. అతను తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించ సాగాడు. ఆమె అత్తింటి వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఖాసింవలి ఎవరితోను ఆమెను కలవనిచ్చేవాడు కాదు. నెల కిందట అత్త, భర్తతో షాహీనాకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. వేరు కాపురం పెట్టేందుకు అంగీకరించారు. మంగళవారం రాత్రి అత్త షాహీనాను తీవ్రంగా కొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ చెవిలో నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. అత్తింటివారు తనపై దాడి చేశారని బాధితురాలు తన అన్నలకు తెలిపింది. వారు ఖాసింవలికి ఫోన్ చేసి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఇక్కడ ఏం జరగలేదనీ, చిన్న గొడవ జరిగిందని, ఇంటికి వెళ్లి ఫోన్ చేయిస్తానని ఖాసింవలి చెప్పారు. అప్పటికే వారు నెల్లూరుకు బయలు దేరేందుకు సిద్ధపడుతుండగా అలాంటిదేమి లేదని, నేను వెళ్లి చెబుతానని ఖాసింవలి వారిని వారించడంతో ఆగిపోయారు. గాయాలతో మృతి.... బుధవారం ఉదయం చెవిలో నుంచి తీవ్ర రక్తస్రావం, ముఖం, కంటిపై గాయాలతో షాహీనా తన ఇంట్లోనే మృతి చెంది ఉంది. భర్త, మామ ఇంట్లో ఉండగా అత్త తన సమీప బంధువుల ఇంట్లో వెళ్లిపోయింది. అయితే షాహీనా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాహీనా మృతదేహానిన చూసి జీర్ణించుకోలేని బాధిత కుటుంబ సభ్యులు అత్తింటి వారికి దేహశుద్ధి చేశారు. ఖాసింవలి తల్లిని సైతం చితకబాదారు. అనంతరం ఐదో నగర పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలాన్ని నగర డీఎస్పీ మగ్బుల్, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ విజయకుమార్, తహశీల్దార్ జనార్దన్ పరిశీలించారు. అత్తింటివారే హత్యచేశారు అత్తింటివారే షాహీనాను హత్య చేసి ఆత్మహత్యగా చీత్రీకరించేందుకు యత్నిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన నాటి నుంచే అత్త ఆమెను అదునపు కట్నం కోసం వేధించడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి సైతం షాహీనాను అత్త, భర్త కొట్టారని, దీంతోనే ఆమె మృతి చెందిందన్నారు. షాహీనా మృతికి కారకులైన ఆమె భర్త, అత్తమామలు, ఆడ పడుచులు, మరుదులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఐదోనగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి 304బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు తహశీల్దార్ మృత దేహానికి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తను, అత్తింటివారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. -
పెళ్లైన మూడు నెలలకే భార్యను హతమార్చాడు
హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల శ్రీరామ్‌నగర్‌లో దారుణం జరిగింది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. అదనపు కట్నం కోసం పెళ్లైన మూడు నెలలకే కట్టుకున్న భార్యను హతమార్చాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీరామ్ నగర్‌కు చెందిన పెయింటర్ ఇజాజ్‌కు మెదక్ జిల్లా తండుమూరు గ్రామానికి చెందిన మున్నీసా బేగంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇజాజ్‌కు లక్ష రూపాయిలకు పైగా కట్నం ఇచ్చారు. అయినా అతడు అదనపు కట్నం తీసుకు రావాలని మున్నీసా బేగాన్ని వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించటంతో విచక్షణ కోల్పోయిన ఇజాజ్ బుధవారం అర్థరాత్రి భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. -
కట్నం కోసం భార్య జెడ కత్తిరించిన భర్త
పెగడపల్లి : అదనపు కట్నం తేవాలని ఓ వ్యక్తి భార్య జెడ కత్తిరించిన ఘటన మండలంలోని నామాపూర్‌లో గురువారం జరిగింది. ఎస్సై కోటేశ్వ ర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లెంకల కొమురవ్వ-రాజమల్లు దంపతుల కూతురు మంజుల వివాహం అదే గ్రామానికి చెందిన దండవేని రాజమల్లుతో ఎనిమిదేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో 5 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదు, ఇతర లాంఛనాలు కట్నంగా ఇచ్చారు. కొనేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు పిల్లలు జన్మించారు. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం మంజులను రాజమల్లు, అత్త కొముర వ్వ, మామా బక్కయ్య, ఆడబిడ్డ బూత్కూరి మల్లవ్వ వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గురువారం మంజుల ఉపాధి హామీ పనికి వెళ్తుండగా రాజమల్లు అడ్డుకుని జెడ కత్తిరించాడు. దాడిచేసి గాయపర్చాడు. బాధితురాలు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజమల్లు, కొమురవ్వ, బక్కయ్య, మల్లవ్వపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దసరా వేళ దారుణాలు
పండుగ పూట సారవకోట మండలం విషాద ఘటనలకు నెలవైంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల బలవన్మరణాలు దసరా సరదాను అర్థంతరంగా తుంచేశాయి. శనివారం వెలుగు రేఖలు విచ్చుకుంటూనే.. తమతోపాటు నాలుగు మృతదేహాలను వెలుగులోకి తెచ్చాయి. బావి, పొలంలో తేలిన విగత జీవుల శరీరాలను చూసి గొల్లపేట, బుడితి గ్రామాలు ఘొల్లుమన్నాయి.గొల్లపేట గ్రామానికి చెందిన శ్రావణి, ఆమె కుమార్తె శిరీష, కుమారుడు రోహిత్ గురువారం సాయంత్రం నుంచీ కనిపించకుండాపోయారు. శ్రావణి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే శనివారం తెల్లవారుజామున ఆ ముగ్గురు తమ ఇంటికి సమీపంలోని బావిలోనే విగతజీవులుగా తేలుతూ కనిపించారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అల్లుడు పాపారావు, అతని కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శ్రావణి తండ్రి ఆరోపించారు. కామినాయుడుపేటకు చెందిన విజయమ్మ కన్నవారింటికి వెళుతూ మార్గమధ్యంలో లైంగిక దాడికి, హత్యకు గురైంది. శనివారం ఉదయం పొలాల్లో ఆమె మృతదే హం కనిపించింది. సంఘటన స్థలంలోని ఆనవాళ్ల ఆధారంగా సామూహిక అత్యాచారం జరిపిన అనంతరం హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.గొల్లపేట(సారవకోట రూరల్): తన కుమార్తెను మెట్టినింటిన వారే హతమార్చారని మృతురాలి తండ్రి, బంధువులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తుండేవాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం... కేళవలస పంచాయతీ గొల్లపేటలో శనివారం అనామానాస్పదంగా తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అల ముకున్నాయి. తల్లీ, ఇద్దరు పిల్లల మృతదేహాలు బావి లో తేలి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఊళ్ల శ్రావణి(26), కుమార్తె శిరీష, కుమారుడు రోహిత్(5) శనివారం మృతి చెంది పాడుబడిన బావిలో తేలారు. 2006లో వివాహం కోటబొమ్మాళి మండలం చిట్టేవలస గ్రామానికి చెందిన శ్రావణికి సారవకోట మండలం కేళవలస పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన ఊళ్ల పాపారావుతో 2006లో వివాహమైంది. ఈ నెల 2న భార్యాభర్తలు, పిల్లలు దసరాకు చిట్టేవలస వెళ్లి వచ్చారు. అదే రోజు సాయంత్రం నుంచి శ్రావణి, శిరీష, రోహిత్‌లు కన్పించకుండా పోయారు. దీంతో భర్త పాపారావు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, స్నేహితులను ఆచూకీ కోసం వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో శుక్రవారం శ్రావణి తండ్రి దేవర మల్లేష్ సారవకోట పోలీసుస్టేషన్లో తన పిల్లలు, మనువలు కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు. శనివారం వారింటికి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో మృత దేహాలు తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, కొత్తూరు సీఐ ఇలియాబాబు, స్థానిక ఎస్ఐ గణేష్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శాంతో తెలిపారు. భర్త, అత్తమామలు, ఆడపడుచే హతమార్చారు తమ కుమార్తె శ్రావణిని భర్త పాపారావు, మామ దాలయ్య, అత్త అప్పలనరసమ్మ, ఆడపడుచు నమ్మి బాలమ్మలు హతమార్చారని శ్రావణి తండ్రి దేవర మల్లేష్ ఫిర్యాదు చేశారు. వివాహమైనప్పుడు రూ.80 వేల కట్నం, 5 తులాల బంగారం ఇచ్చామని, అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని దీనిపై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో సంప్రదింపులు జరిగాయన్నారు. ఇటీవల తన ఇంటికొచ్చినప్పుడు కూడా గొడవ పడి తమ కుమార్తెను కొట్టడం జరిగిందని ఆరోపించాడు. అదనపు కట్నం కోసం తన కుమార్తెను మనువలను హతమార్చి బావిలో తోసేశారన్నారు. కుమార్తె, ఆమె పిల్లలు కన్పించడం లేదని గ్రామానికి వెళ్తే తమపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. కన్పించడం లేదని కేసు నమోదు తమ కుమార్తె శ్రావణి, మనుమలు శిరీష, రోహిత్ కన్పించడం లేదని కోటబొమ్మాళి మండలం చిట్టేవలస గ్రామానికి చెందిన దేవర మల్లేష్ శుక్రవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై హెచ్‌సీ రాజారావు కేసు నమోదు చేశారు. అయితే శనివారం నాటికి ఈ మూడు మృత దేహాలు గొల్లపేటలోని పాడుబడిన బావిలో తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అదనపు కట్నం కేసులో అత్తమామలకు జైలు
న్యూఢిల్లీ: అదనపు కట్నం తేవాలని కోడల్ని వేధించి, ఆమె మృతికి కారకులైన అత్తమామలకు ఢిల్లీ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసు విచారించిన అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ కుమార్ గోయల్ నేరం రుజువుకావడంతో ఈ మేరకు తీర్పు చెప్పారు. బాధితురాలి అత్తమామ కృష్ణ ఆనంద్, వీణలపై వరకట్నపు వేధింపులకు పాల్పడినట్లు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు కారు కావాలని, ఇందుకోసం అదనపుకట్నం కావాలని నిత్యం వేధించడం వల్లనే బాధితురాలు ఇంటి భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వివాహమైన ఏడు సంవత్సరాల తరువాత కారు డిమాండ్ చేస్తూ క్రూరంగా, అవమానవీయంగా బాధితురాల్ని వేధించడంతో తీవ్ర మానసికక్షోభకు గురై మృతి చెందినట్లు రుజువైనందున ఈ మేరకు దోషులకు ఒకొక్కరికి ఐదేళ్ల జైలు, బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 25,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. కాగా ఈ కేసు నుంచి బాధితురాలి భర్తపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నిర్దోషిగా భావిస్తూ విముక్తి కల్పించారు. అయితే బాధితురాలి భర్త ఆమెను కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించలేకపోయాడని, కుటుంబంలో భార్య ఆత్మగౌరవాన్ని, స్థానాన్ని కాపాడడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల తీవ్ర వేధింపుల వల్లనే బాధితురాలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు పూర్వపరాలిలా ఉన్నాయి.. నవంబర్ 20, 2005లో బాధితురాలు ఇంటి భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని,ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారని, ఆమె అత్తమామలు బాధితురాలి సోదరునికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె భరత్తతోపాటు అత్తమామ అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే 13 నెలల కుమారుడితోపాటు ఇంటి భవనంపై దూకి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె కుమారుడిని వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేశారని,ప్రస్తుతం కోలుకొంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష ఖరారు చేసినట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. -
పెళ్లయిన మూడు నెలలకే..
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య రామాయంపేటలో ఘటన రామాయంపేట : వరకట్న వేధింపులు తాళలేక మండలంలోని నస్కల్ పంచాయతీ రాంపూర్ గ్రామంలో ఓ వివాహిత పెళ్లి అయిన మూడునెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ ప్రవీణ్‌బాబు కథనం మేరకు.. దుబ్బాక మండలం నగరం గ్రామానికి చెందిన అంజాగౌడ్ కుమార్తె భవాని (18)ని రామాయంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రుద్రారం దుర్గారాజ్‌గౌడ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్తలో పాటు అత్త, మామ, బావ, తోడికోడలు వేధింపులకు గురి చేశారు. దీంత ఈ బాధలు భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అంజాగౌడ్ ఫిర్యాదు మేరకు భవానీ భర్త దుర్గారాజ్‌గౌడ్‌తో పాటు మామ భూమాగౌడ్, అత్త, బావ నాగరాజ్‌గౌడ్, తోడికోడలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కాగా వివాహం అయిన కొద్ది రోజుల త రువాత దుర్గారాజ్ దంపతులు గ్రామంలోనే వేరు కాపురం పెట్టారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, అయితే ఏం జరిగిందో తెలియదు గాని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు వివరించారు. -
కట్నంకోసం భార్యను హత్యచేసిన భర్త
-
కట్న దాహానికి గర్భిణి బలి
గొంతు నులిమి చంపేసిన భర్త ఉప్పల్: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం నిండుచూలాలు అని కూడా చూడకుండా గొంతునులిమి భార్యను హత్య చేశాడు. రామంతాపూర్‌లోని వెంకటరెడ్డినగర్‌లో శుక్రవారం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...ప్రకాశంజిల్లా గిద్దలూరు సమీపంలోని రెవెల్లి గ్రామానికి చెందిన సౌజన్య(21)తో అదే జిల్లా రాచర్ల మండలం అనుముల గ్రామానికి చెందిన వేమురెడ్డి జయరాంరె డ్డి (25)తో ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. సౌజన్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి. జయరాంరెడ్డి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతను గత కొంతకాలంగా అదనపు కట్నం, స్థలం కోసం తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం కూడా వీరి మధ్య గోడవ జరిగింది. ఎప్పటిలాకే శుక్రవారం ఉదయాన్నే జయరాంరెడ్డి విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం అవుతున్నా సౌజన్య ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా సౌజన్య మంచంపై పడి ఉంది. చేయిపట్టుకొని లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చి వైద్యుడిని పిలిపించి పరీక్ష చేయించగా.. ఉదయమే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్ఐ లింగం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి మెడపై గాట్లు ఉన్నాయి. దీని బట్టి భర్తే ఆమెను గొంతు నులిమి చెప్పి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. భర్త జయరాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే సౌజన్య హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
అన్నంత పనీ చేశాడు
- మామను నరికి చంపిన అల్లుడు - కట్నం కేసులో జైలుకు పంపాడని దారుణం జియాగూడ: కట్నం వేధింపుల కేసులో జైలుకు పంపాడన్న కక్షతో మామ ప్రాణం తీశాడో దుర్మార్గుడు. హత్య చేస్తానని హెచ్చరించి మరీ అతిదారుణంగా నరికి చంపాడు. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.కరణ్కుమార్సింగ్ కథనం ప్రకారం... పురానాపూల్ దుర్గానగర్ నివాసి టి.మనోహర్ సింగ్(49) ఛెత్త్తాబజార్ ఎస్బీహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి హారతిని కుల్సుంపురా 2జే బస్టాండ్ వద్ద ఉంటున్న రాంసింగ్ కుమారుడైన సిటీ సివిల్ కోర్టు ఉద్యోగి ఆనంద్‌సింగ్(24)కు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కట్నం కింద 40 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు ఇచ్చారు. వీరికి ఏడాది పాప ఉంది. కాగా, ఆనంద్‌సింగ్ అదనపు కట్నం అడుగుతుండటంతో మనోహర్సింగ్ ఇటీవల మారుతి వ్యాన్‌ను కొనిచ్చాడు. అయినా సంతృప్తి చెందని ఆనంద్‌సింగ్ అదనపు కట్నం తెమ్మని భార్య హారతిని కాల్చుకు తింటున్నాడు. అనుమానంతో ఆమెను నిత్యం మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడు. పలుమార్లు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మామ మనోహర్సింగ్ రెండు నెలల క్రితం సీసీఎస్‌లో వరకట్నం వేధింపుల కేసు పెట్టాడు. పోలీసులు ఆనంద్‌సింగ్‌ను జైలుకు పంపారు. దీంతో కక్షగట్టిన ఆనంద్‌సింగ్ వారం రోజులుగా మామను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నట్టుగానే మామను హత్య చేసేందుకు పథకం వేశాడు. మామ ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడనే విషయం ముందే పసిగట్టిన అతను శనివారం ఉదయం పురానాపూల్ చౌరస్తా దిగువన ఉన్న రోడ్డు వద్ద మరికొందరితో కలిసి మాటు వేశాడు. ఉదయం 9.30కి పురానాపూల్‌లో పాలప్యాకెట్లు కొనుగోలు చేసి దుర్గానగర్ కు స్కూటర్‌పై వస్తున్న మామ మనోహర్సింగ్పై ఒక్కసారిగా దాడి చేసి, కత్తులతో నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని గోషామహల్ ఏసీపీ రాంభూపాల్సింగ్, కుల్సుంపురా ఇన్స్పెక్టర్ కరణ్కుమార్సింగ్ పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. -
తాగుబోతు అల్లుడి దురాగతం
తాగిన మైకంలో ఓ ప్రబుద్ధుడు అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెట్టడమే కాకుండా బావమరుదుల వాహనాలు దహనం చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక వెంకంపేటకు చెందిన పంతగాని లక్ష్మీరాజం కూతురు లావణ్య వివాహం సాయినగర్‌కు చెందిన గంగుల ప్రకాశ్‌తో పదేళ్ల క్రితం జరిగింది. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం తేవాలని ప్రకాశ్ భార్య లావణ్యను వేధించాడు. దీంతో లక్ష్మీరాజం అల్లుడికి గణేశ్‌నగర్‌లో ప్లాటు కొనిచ్చాడు. వ్యసనాలకు బానిసైన ప్రకాశ్ దానిని అమ్ముకున్నాడు. పలుమార్లు లావణ్యను వేధించడంతో పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చాడు. ఇటీవల ప్రకాశ్ అత్తారింటికి వచ్చి అందరిపై దాడిచేసి డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో వారు సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో గురువారం రాత్రి 11 గంటలకు అత్తారింటి గేటుదూకి బావమరుదుల వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనలో రూ.లక్ష ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. -
నిశ్చితార్థమైన వారానికే....
*కాబోయే భర్త అదనపు కట్నం కోసం డిమాండ్ *వివాహం నిలిచిపోతుందని యువతి ఆత్మహత్య ఓర్వకల్లు : నిశ్చితార్థమైన వారానికే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్తే అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడంతో పెళ్లి ఆగిపోతుందని యువతి అఘాయిత్యానికి పాల్పడింది. కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని మయూరి గ్రీన్ హిల్స్‌లోని 439వ ప్లాట్‌లో శంకరాజు, సరస్వతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె హరిప్రియ(22)కు ఖమ్మం జిల్లా, భద్రాచలం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసరాజుకు వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.6 లక్షల నగదు, 15 తులాల బంగారు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థమైన రెండు రోజుల తర్వాత రూ.10 లక్షలు నగదు, 20 తులాలు బంగారు ఇవ్వాల్సిందేనని వరుడు ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆదివారం కూడా హరిప్రియతో ఫోన్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తన పెళ్లి రద్దు అవుతుందేమోనని మనస్తాపానికి లోనైన యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సరస్వతమ్మ ఉలిందకొండలో ఉపాధ్యాయురాలుగా, తండ్రి శంకరాజు కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లి ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విషయంపై ఎస్ఐ విజయలక్ష్మీని వివరణ కోరగా మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: అదనపు కట్నం తెచ్చివ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను గొంతుకోసి, ఇంటికి తాళాలు వేసి పరారైన ఘటన బుధవారం మదనపల్లెలో వెలుగుచూసింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఎదురుగా పటేల్ రోడ్డుకు చెందిన ఖాదర్‌బాషా, రజియా దంపతుల కుమార్తె రేష్మ(22)ను సైదాపేటకు చెందిన ఇస్మాయేల్ కుమారుడు ఆటోడ్రైవర్ మహ్మద్‌జానీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన పెళ్లి చేశారు. వివాహ సమయం లో రూ.60వేల నగదు, 5తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. వారు కొంతకాలం సైదాపేటలోనే కాపురమున్నారు. నెలరోజుల క్రితం ఎగువకురవంకకు మారారు. మహ్మద్‌జానీకి మొబైల్ షాపు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిం ది. అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురిచేశాడు. కుమార్తె కాపురం సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు ఎంతో కొంచెం ఇచ్చి పంపేవా రు. తనకు రూ.2లక్షలు తెచ్చిస్తేనే కాపురానికి రావాలని భార్యను పుట్టింటికి పంపించాడు. రెండు రోజులైనా భార్య రాకపోవడంతో ఆదివారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి వెంట తీసుకెళ్లాడు. డబ్బు విషయమై రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహించిన జానీ కత్తితో భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ రో జు రాత్రి అక్కడే గడిపి ఇంటికి తాళాలు వేసుకుని నేరుగా అత్తగారింటికెళ్లాడు. ఇంటి బాడుగ కట్టాలని రూ.2వేలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు మంగళవారం సాయంత్రం కిటికీలో నుంచి చూడగా రేష్మ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృ తురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహంపై పడి బోరున విలపించా రు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వంశీధర్‌గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తహశీల్దారు శివరామిరెడ్డి పంచనామా నిర్వహించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుకోసం బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు మొబైల్ షాపు పెట్టుకోవాలని డబ్బు తె మ్మని బిడ్డను పదేపదే ఇంటికి పంపేవా డు. పెళ్లి చేసి మేము అప్పటికే అప్పుల్లో ఉన్నాం. నిదానంగా ఆలోచిద్దామని చెప్పి ఇంటికి పంపాం. ఆ దుర్మార్గుడు డబ్బు కోసమే మా బిడ్డ గొంతుకోసి హత్య చేశాడు. వాడికీ అదే శిక్ష వేయాలి. - మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు