కట్నం వేధింపులపై చర్యకు వినతి
- ‘గ్రీవెన్స్’లో ఎస్పీకి మహిళ ఫిర్యాదు
సంగారెడ్డి క్రైం: అదనపు కట్నం కోసం వేధిస్తున్న తన భర్త, అత్తమామలు, బంధువులపై చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి మడలం అల్వాల్ గ్రామానికి చెందిన తూము అనిత ఎస్పీ సుమతికి విన్నవించారు. గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుమతి ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకున్నారు. న్యాయం చేస్తానని ఎస్పీ ఆమెకు హామీనిచ్చారు. కాగా, తమ సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన కళావతి, స్వరూప ఫిర్యాదు చేశారు. తన భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారంటూ గొల్ల సురేష్ (జహీరాబాద్), దారిని కొందరు తమ సొంత భూమిలో కలుపుకొన్నారంటూ మజీద్‌పల్లి గ్రామస్తులు ఎస్పీ దృష్టికి తెచ్చారు.