అదనపు కట్నం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని పెంటపాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
పెంటపాడు: అదనపు కట్నం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని పెంటపాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కె.గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన రాచర్ల రత్నరాజు తన భార్య విజయకుమారిని మరింత కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. విజయకుమారి ఫిర్యాదు మేరకు గుర్రయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్సై రత్నరాజు తెలిపారు.