![Married Woman Commited Suicide In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/4/154.jpg.webp?itok=Ly-4-E_s)
కర్ణాటక: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా తిరుమలెగౌడనపాళ్య గ్రామంలో చోటుచేసుకుంది. భవ్య (27) మృతురాలు. తిరుమలెగౌడనపాళ్య గ్రామానికి చెందిన కిరణ్‌తో ఏడాదిన్నర క్రితం రూ.30 లక్షల కట్నం ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించారు భవ్య తల్లితండ్రులు. సంతానం కలగలేదని, అదనపు కట్నం తీసుకురావాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి.
భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువర్గాలనూ పిలిచి రాజీ చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో భవ్య లక్కప్పనహళ్లి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది. జీవితం ఇలా అయిపోయిందని విరక్తి చెంది శనివారం సాయంత్రం వాదకుంట గ్రామం వద్ద రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. భవ్య తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment