ప్రియుడి వేధింపులే కారణం.. | married woman suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియుడి వేధింపులే కారణం..

Feb 19 2024 9:54 AM | Updated on Feb 19 2024 9:54 AM

married woman suicide in hyderabad - Sakshi

హైదరాబాద్: శివాలి అనే వివాహిత ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచి్చంది. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి శివాని(32) అనే మహిళ ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న శివాని ప్రియుడు ముస్తఫా అలియాస్‌ ఖాలీద్‌తో  సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా ఖాలీద్‌ తన కుమార్తె(12)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

అయినా  ముస్తఫా ప్రవర్తనలో మార్పు రాలేదు. తన కుమార్తెను ప్రియుడు లైంగికంగా వేధిస్తుండటాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి లోనైన శివాని శనివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తన సోదరి ఇంటికి పంపి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఆమె ప్రియుడు ముస్తఫాను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్సై నరేష్‌ కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement