Husband arrested
-
నవ వధువుది ఆత్మహత్యే..
ఖలీల్‌వాడి: ఈ నెల 2న నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని సుధా హైట్స్ అపార్ట్మెంట్ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి.. రెండు నెలల క్రితం హమాల్వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్‌తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉన్న టిప్ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..!
కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సృష్టించాడు. నెపం వేరేవారిపై నెట్టేందుకు మరో వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. తీరా పోలీసులు విచారణలో అసలు నిజం వెలుగుచూడడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు. పుత్తూరు(చిత్తూరు జిల్లా): మండలంలోని ఉత్తరపు కండ్రిగలో బుధవారం భానుప్రియ(26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు భర్త నారాయణమూర్తే భార్యను హత్యచేశాడని గురువారం తేల్చేశారు. పోలీసుల కథనం మేరకు.. నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మహీధర్(6), బాబి(4) అనే ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో భానుప్రియను స్థానికులైన ఉపాధ్యాయుడు గోపి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ వేధిస్తుండేవారు. దీంతో అనుమానం పెంచుకున్న నారాయణమూర్తి సైతం భార్యను ఇబ్బందిపెట్టేవాడు. దీనిపై మూడురోజుల క్రితం భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు సైతం చేసింది. ఆగ్రహించిన నారాయణమూర్తి భార్యతో బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి, ఉరేసి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ధనశేఖర్ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టాడు. చివరకు నారాయణమూర్తే అసలు నిందితుడని తెలియడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపై మరో కేసు నమోదు చేశారు. చదవండి: ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య భర్తను చంపి.. ఇంటి పెరట్లో పాతిపెట్టి.. -
గొడవపడిన భర్త..కాల్‌గర్ల్ పేరుతో భార్య ఫొటో పోస్టు
సాక్షి,హైదరాబాద్: భార్యతో గొడవ పడిన విషయాన్ని మనస్సులో పెట్టుకుని సొంత భార్య ఫొటోనే సామాజిక మాధ్యమంలో పెట్టి అల్లరిపాలు చేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కుషాయిగూడ ఈసీఐఎల్‌లోని రాధికా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న జాన్ జార్జ్ అలియాస్ సన్నీ దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కుటుంబంతో కలసి ఉంటున్నాడు. ఈ మధ్యలో చిన్నచిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భార్య వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలను కున్న సన్నీ ఆమె తన స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను షేర్‌చాట్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఉన్నవారంతా కాల్‌గర్ల్స్ అని కామెంట్ చేయడంతో పాటుగా వాయిస్ ఇచ్చాడు. ఆ ఫొటోకింద భార్య ఫోన్ నంబర్‌ను పేర్కొన్నాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అతడి భార్యకు ఫోన్‌కాల్స్ రావటంతో బాధితురాలు శనివారం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడు సన్నీని శనివారం అరెస్టు చేశారు. -
సీసీ కెమెరాలు అమర్చి పైశాచికత్వం
కృష్ణరాజపురం : భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త.. ఇంట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. భర్త పైశాచికత్వాన్ని భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన బెంగళూరులోని రామ్మూర్తినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మూపర్తి బెంగళూరు నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహమైంది. ఆ సమయంలో రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం ఇచ్చి రూ.45 లక్షలు ఖర్చు చేసి పెళ్లిని ఘనంగా వివాహం జరిపించారు. కొద్ది కాలం భార్యను బాగానే చూసుకున్న ప్రదీప్.. మెల్లగా తనలోని పైశాచికత్వాన్ని బహిర్గతం చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ పడకగదిలో, వంటగదిలో, హాల్లో సీసీ కెమెరాలు అమర్చాడు. దీంతోపాటు కెమెరాతో వీడియో తీస్తూ తన ముందు నగ్నంగా నడవాలంటూ అనూపను వేధించేవాడు. అందుకు నిరాకరించిన అనూపను శారీరకంగా కూడా వేధించాడు. మరో వైపు బెంగళూరులోనే ఉంటున్న ప్రదీప్ అక్క ప్రశాంతి, ఆమె భర్త సంజీవ్‌లు అనూపను శారీరకంగా, మానసికంగా హింసించా రు. ఓ దశలో అనూపను పుట్టింటికి పం పించారు. దీంతో అనూప తల్లితండ్రులు అదనంగా రూ.5 లక్షలు ఇచ్చారు. దీన్ని అదునుగా భావించి ముగ్గురు మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగారు. విడాకులు విషయం దాచి రెండో పెళ్లి... ప్రదీప్‌కు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్యను కూడా ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రదీప్ తల్లితండ్రులు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహం జరిపించారు. కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్న ప్రదీప్ అక్క ప్రశాంతి.. కొద్ది రోజుల క్రితం అనూపను తన ఇంటికి తీసుకెళ్లి ప్రదీప్ మొదటి వివాహం సీడీని చూపించి మొదటి భార్య తల్లితండ్రులు ఇంకా ఎక్కువ మొత్తంలో తన తమ్మడికి కట్నకానుకలు ఇచ్చారని అంతకంటే ఎక్కువ మొత్తంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిం చింది. అనూప తల్లితండ్రులు వచ్చి ఆరా తీయగా ప్రదీప్ మొదటి వివాహం వ్యవహార ం వెలుగు చూసింది. అంతేగాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించిన విషయం కూడా బహిర్గతమైంది. దీంతో అనూప ఈనెల 4వ తేదీ భర్త ప్రదీప్‌తో పాటు ప్రదీప్ అక్కబావలైన ప్రశాంతి, సంజీవ్కుమార్లపై రామ్మూర్తినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భార్యను వేధించిన కేసులో భర్త అరెస్టు
శ్రీకాకుళం రూరల్ : భార్యను వేధించిన కేసులో భర్తను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటకు చెందిన సుజాతపై భర్త నగేష్ చేసిన అకృత్యాలపై ‘భర్తే.. మానవమృగం’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వరుస కథనాలు రావడం, బాధితురాలు సుజాత తరఫున పలువురు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అధికారులు నిలబడటంతో పోలీసులు స్పందించారు. సుజాత భర్త నగేష్, అత్త సరోజిని, ఆడపడుచు మాలతీపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు అనంతరం నగేష్‌పై గృహహింస, అదనపు కట్నం, బలవంతపు హత్యాయత్నం, అంగవైకల్యం తదితర సెక్షన్లు కింద కేసు నమోదు చేసి 15 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్ఐ చిన్నంనాయుడు బుధవారం తెలిపారు. సుజాతకు దిక్కెవరు..! సుజాత పరిస్థితి తెలుకొని అందరూ జాలిగా చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు గానీ, మహిళా సంఘాలు ముందుకు రాకపోవడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు నాలుగు నుంచి ఆరు నెలలు పాటు బెడ్ రెస్ట్ ఉండాలని, మలమూత్ర విసర్జన బెడ్‌మీదే జరగాలని వైద్యులు చెప్పినప్పటికీ ఆ దిశగా సేవలందించే వారు ఎవరున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. ఇతరులపై ఆధారపడడం కంటే ఆస్పత్రిలోనే ఉంటే కాస్తయిన వైద్యం అందుతోందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెమ్స్ వైద్యులు డిశ్చార్జ్ ఇస్తామని, మరో నాలుగు రోజలు పోతే కుట్లు విప్పుతామని చెప్పారు. ఈ పరిస్థితిలో బయటకు వెళ్తే తిరిగి రాలేనని, ఆ నాలుగు రోజులు ఇక్కడ ఉంటానని, అప్పుడే కుట్లు విప్పాలని వైద్యులను వేడుకున్నట్లు తెలిసింది. కాగా, సుజాత భవిష్యత్‌లో కాలు బాగైనప్పటికీ కొంతమేరకు అంగవైకల్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. -
భార్యపై యాసిడ్ దాడి కేసులో భర్త అరెస్ట్
బరంపురం: ఇటీవల జరిగిన భార్యపై యాసిడ్ దాడి కేసులో నిందితుడు, భర్త మొబైలోను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా తెలియజేశారు. బరంపురం జిల్లా పోలీసు కార్యక్రమంలో ఎస్పీ పినాకి మిశ్రా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాలలో డిప్లమో ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ మూడవ సంవత్సరం చదువుతున్న భార్య మినతి కుమారి ప్రధాన్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో స్వయాన భర్త నిరంజన్ ప్రధాన్ గత ఏడాది నవంబర్ 16వ తేదీన ఆమె ముఖంపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో బీఎన్‌పూర్ పోలీసుస్టేషన్లో నమోదైన నాటి నుంచి పోలీసుల దర్యాప్తు కొసాగిందని చెప్పారు. తాను బరంపురం ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్ద బజార్ పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి నిరకార్ మహంతి, గుసానినువగం పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి కులమణి శెట్టి బరంపురం ఎస్డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్ మరికొంతమంది పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు చెప్పారు. నిందితుడు నిరంజన్ ప్రధాన్ భార్యపై యాసిడ్ దాడి చేసిన అనంతరం కొంతకాలం విశాఖపట్నాంలో తలదాచుకున్నాడని అక్కడినుంచి ముంబైకి పరారై అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. ముంబై పోలీసుల సహకారంతో.. ఈ కేసుపై ప్రత్యేక బృందం ముంబై వెళ్లి అక్కడ 7 రోజుల పాటు స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడు నిరంజన్ ప్రధాన్‌ను బుధవారం అరెస్ట్ చేసి అక్కడి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బరంపురం నగరానికి గురువారం తీసుకువచ్చినట్లు చెప్పారు. యాసిడ్‌దాడిపై వివిధ రకాల కథనాలు వినిపిస్తున్నాయని అయితే నిందితుడు నిరంజన్ ప్రధాన్‌ను విచారణ చేసిన తరువాత మరిన్ని వివరాలు తెలియవలసి ఉందని ఎస్పీ పినాకి మిశ్రా చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు త్రినాథ్ పటేల్, సంతున్ దాస్, పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠీ, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి నిరకార్ మహంతి, గుసానినువగాం పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి కులమణి శెట్టి బరంపురం ఎస్డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్ తదితరులు పాల్గొన్నారు. -
గృహిణి హత్య కేసులో భర్త అరెస్టు
చోడవరం: చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) హత్య కేసులో ఆమె భర్త బైన వెంకటఅప్పన్నదొరను పోలీసులు అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ ఎం. శ్రీనివాసరరావు విలేకరులకు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం కన్నంపాలెం గ్రామానికి చెందిన బైన సుజాత(35) ఈనెల 15వతేదీ అర్ధరాత్రి హత్యకు గురైంది. సుజాతపై రెండేళ్లుగా అనుమానంతో ఉన్న భర్త వెంకటఅప్పన్నదొర మూడునెలలుగా పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15వతేదీ అర్ధరాత్రి భార్య,భర్తల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో అక్కడే ఉన్న మంచం కోడుతో భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అప్పన్నదొర ఆ గ్రామ వీఆర్వో సుమలత ఎదుట సోమవారం లొంగిపోయాడు. ఆమె తమకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. కోర్టుకు తరలించామని చెప్పారు. ఈ సమావేశంలో చోడవరం ఎస్ఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఇదిలావుండగా సుజాత, అప్పన్నదొరకు 11యేళ్ల కిందట వివాహం జరిగింది. ఐదో తరగతి, ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటు తల్లిని కోల్పోయి, అటు తండ్రి జైలుకి వెళ్లడంతో వారిద్దరూ అనాథలుగా మిగిలారు. -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
జ్యోతినగర్: భార్య ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ఓ డాక్టర్ ను ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎన్టీపీసీ పరిధిలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్న వాణి(28), శ్యాంకుమార్‌లు భార్యాభర్తలు. శ్యాంకుమార్ ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా అదనపుకట్నం కోసం శ్యాంకుమార్, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన వాణి ఈ నెల 7న తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాల పాలైన వాణి చికిత్సపొందుతూ 9వ తేదీన మరణించింది. అప్పటి నుంచి భర్త శ్యాంకుమార్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. -
అనుమానంతోనే కడతేర్చాడు
►భార్య హత్య కేసులో భర్త అరెస్ట్ నెల్లూరు (క్రైమ్) : మరొకరితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను ఐదో నగర పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన మార్తాల సుమలత (28)కు అదే ప్రాంతానికి చెందిన రవీంద్రబాబుతో వివాహమైంది. వివాహానంతరం వారు పడారుపల్లి చలపతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి పవన్, మదన్ కుమారులు. రవీంద్రబాబు పలురకాల వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2012లో ఆయన అనారోగ్యంతో మతి చెందాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్‌తో ఆమె వివాహమైంది. కొద్దిరోజులు వారి కాపురం సజావుగా సాగింది. శ్రీకాంత్ హైదరాబాద్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. వ్యసనాలకు బానిసైన అతను సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయసాగాడు. అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో చలపతినగర్‌లోని ఇంటిని అమ్మేందుకు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భార్య ససేమిరా అంది. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుమలత తన ఇంటి పక్కనే ఉంటున్న ఆటో డ్రైవర్‌తో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై జూలై 25న దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ ఆమెను తీవ్రంగా కొట్టడంతో మతి చెందింది. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అప్పట్లో బాధిత కుటుంబ సభ్యుల ఐదోనగర ఇన్స్పెక్టర్ జి. మంగారావుకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ గురువారం నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. -
భార్యను కడతేర్చిన భర్త అరెస్ట్
మిర్యాలగూడ రూరల్ : భార్యను కడతేర్చిన భర్తను అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ 1వ పట్టణ సీఐ భిక్షపతి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్‌కు చెందిన నర్మద, ఇదే పట్టణం కలాల్‌వాడకు చెం దిన కొంక రాములు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం కలిగిన తరువాత కుటుంబ తగాదాల నేపథ్యంలో నర్మద తన పిల్లలతో భర్తకు దూరంగా ఉంటూ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుంది. ఈ నెల 27న పాఠశాలకు వె ళ్లి సాయంత్రం ఇంటికి నడచుకుంటు వెళుతున్న నర్మదను నందిపహాడ్ బైపాస్ రోడ్డు వద్ద కాపు కాసి భర్త రాము సుత్తెతో ఆమె తలపై మోది హత్య చేసి పారిపోయాడు. కాగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణ శివారులో రైల్యే బ్రిడ్జి సమీపంలో సంచరిస్తున్న రాములను అరెస్ట్ చేసినట్లు తె లిపారు. నిందితుడి విచారణ చేయగా భార్య తనపై కేసులు పెట్టిందనే అక్కసుతోనే హతమార్చినట్టు నిందితుడు పేర్కొన్నాడని తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై వి.సర్దార్‌నాయక్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై బుచ్చయ్య, పోలీసులు సురేష్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, రాంమూర్తి, శ్రీను, గోపి పాల్గొన్నారు. -
జైలు, భర్త, భార్య, డ్రగ్స్
ముజఫర్ నగర్: జైల్లో ఉన్న భర్తపై మూర్ఖపు పతిభక్తి చూపిన ఓ మహిళ అడ్డంగా బుక్కయింది. అతనికి మత్తుమందులు సరఫరా చేస్తూ పట్టుబడడంతో ఊచలు లెక్కపెడుతోంది. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా జైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న భర్త చాంద్ మియాన్‌ను చూసేందుకు వచ్చిది సైరా. నిబంధనల ప్రకారం కారాగారం ప్రధాన గేటు దగ్గర జైలు అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె మత్తుమందులతో వచ్చిన విషయం బయటపడింది. దీంతో షాకవ్వయడం అధికారుల వంతయ్యింది. ఆమె దగ్గర నుంచి సుమారు యాభై గ్రాముల చరస్‌ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రాకేష్ సింగ్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. woman, husband arrested, drugs , jail, జైలు, భర్త, భార్య, మత్తుమందు,అరెస్టు -
భార్యను వేధిస్తున్న భర్త అరెస్ట్
పెంటపాడు: అదనపు కట్నం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని పెంటపాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కె.గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన రాచర్ల రత్నరాజు తన భార్య విజయకుమారిని మరింత కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. విజయకుమారి ఫిర్యాదు మేరకు గుర్రయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్సై రత్నరాజు తెలిపారు. -
తప్పని వారించినందుకు భార్యను హత్య...
సారంగపూర్: ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను గొంతులో గుళికల మందు పోసి ఆమె భర్త చంపాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... అల్లమయ్య, పుష్కల(40) దంపతులు జామ్ గ్రామంలో ఉంటున్నారు. అల్లమయ్య తరచుగా ఇంటికి వేశ్యలను తెచ్చుకునేవాడు. శుక్రవారం కూడా సరిగా అలాగే ఓ అమ్మాయిని తెచ్చుకుని శారీరక కోర్కెలను తీర్చుకుంటున్న సమయంలో భార్య పుష్పల ఆ దృశ్యాన్ని చూసింది. కోపోద్రిక్తురాలైన పుష్పల ఈ విషయంపై తన భర్త అల్లమయ్యతో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహావేశాలకు గురయిన భర్త అల్లమయ్య భార్య నోట్లో బలవంతంగా గుళికల మందు పోశాడు. దీంతో పుష్పల అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పుష్పల బంధువులు అల్లమయ్య బట్టలు ఊడదీసి చితకబాదారు. బంధువులు సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు
కట్నం కోసం రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్దుడు. ఆ విషయం తెలిసన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పెళ్లికోడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే అతడు అదనపు కట్నం కావాలని నిరంతరం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆ క్రమంలో ఆమె పుట్టింటి నుంచి కొంత నగదు తీసుకువచ్చి భర్త ఇచ్చింది. ఆ నగదు అయి పోగానే మళ్లీ నగదు కావాలని ఆమెను వేధించసాగాడు. తన తల్లిదండ్రులకు నగదు ఇచ్చేంత స్థోమత లేదని ఆమె భర్తకు వెళ్లడించింది. దాంతో రవిశంకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని అతడు గోప్యంగా ఉంచాడు. అయితే ఆ విషయాన్ని రవిశంకర్ భార్య తెలుసుకుంది. దాంతో ఆమె సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. శనివారం సనత్‌నగర్‌లో రెండో వివాహం చేసుకుంటున్న రవిశంకర్‌ను పెళ్లి పీటల మీద అరెస్ట్ చేయించింది. దీంతో పెళ్లి కొడుకును సనత్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.