తప్పని వారించినందుకు భార్యను హత్య... | husband murder his wife for illegal activities | Sakshi
Sakshi News home page

తప్పని వారించినందుకు భార్యను హత్య...

Published Fri, Feb 13 2015 11:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

husband murder his wife for illegal activities

సారంగపూర్: ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను గొంతులో గుళికల మందు పోసి ఆమె భర్త చంపాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... అల్లమయ్య, పుష్కల(40)  దంపతులు జామ్ గ్రామంలో ఉంటున్నారు. అల్లమయ్య తరచుగా ఇంటికి వేశ్యలను తెచ్చుకునేవాడు. శుక్రవారం కూడా సరిగా అలాగే ఓ అమ్మాయిని తెచ్చుకుని శారీరక కోర్కెలను తీర్చుకుంటున్న సమయంలో భార్య పుష్పల ఆ దృశ్యాన్ని చూసింది. కోపోద్రిక్తురాలైన పుష్పల ఈ విషయంపై తన భర్త అల్లమయ్యతో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహావేశాలకు గురయిన భర్త అల్లమయ్య భార్య నోట్లో బలవంతంగా గుళికల మందు పోశాడు. దీంతో పుష్పల అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పుష్పల బంధువులు అల్లమయ్య బట్టలు ఊడదీసి చితకబాదారు. బంధువులు సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement