విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పీ పినాకి మిశ్రా, పక్కన నిందితుడు నిరంజన్ ప్రధాన్.
బరంపురం: ఇటీవల జరిగిన భార్యపై యాసిడ్ దాడి కేసులో నిందితుడు, భర్త మొబైలోను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రా తెలియజేశారు. బరంపురం జిల్లా పోలీసు కార్యక్రమంలో ఎస్‌పీ పినాకి మిశ్రా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాలలో డిప్లమో ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ మూడవ సంవత్సరం చదువుతున్న భార్య మినతి కుమారి ప్రధాన్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో స్వయాన భర్త నిరంజన్ ప్రధాన్ గత ఏడాది నవంబర్ 16వ తేదీన ఆమె ముఖంపై యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు.
ఈ నేపథ్యంలో బీఎన్‌పూర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన నాటి నుంచి పోలీసుల దర్యాప్తు కొసాగిందని చెప్పారు. తాను బరంపురం ఎస్‌పీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్ద బజార్ పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి నిరకార్ మహంతి, గుసానినువగం పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి కులమణి శెట్టి బరంపురం ఎస్‌డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్ మరికొంతమంది పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు చెప్పారు. నిందితుడు నిరంజన్ ప్రధాన్ భార్యపై యాసిడ్ దాడి చేసిన అనంతరం కొంతకాలం విశాఖపట్నాంలో తలదాచుకున్నాడని అక్కడినుంచి ముంబైకి పరారై అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.
ముంబై పోలీసుల సహకారంతో..
ఈ కేసుపై ప్రత్యేక బృందం ముంబై వెళ్లి అక్కడ 7 రోజుల పాటు స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడు నిరంజన్ ప్రధాన్‌ను బుధవారం అరెస్ట్ చేసి అక్కడి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బరంపురం నగరానికి గురువారం తీసుకువచ్చినట్లు చెప్పారు. యాసిడ్‌దాడిపై వివిధ రకాల కథనాలు వినిపిస్తున్నాయని అయితే నిందితుడు నిరంజన్ ప్రధాన్‌ను విచారణ చేసిన తరువాత మరిన్ని వివరాలు తెలియవలసి ఉందని ఎస్‌పీ పినాకి మిశ్రా చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీలు త్రినాథ్ పటేల్, సంతున్ దాస్, పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠీ, టౌన్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి నిరకార్ మహంతి, గుసానినువగాం పోలీసు స్టేషన్ ఐఐసీ అధికారి కులమణి శెట్టి బరంపురం ఎస్‌డీపీఓ ప్రభాత్ చంద్ర రథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment