జైల్లో ఉన్న భర్తపై మూర్ఖపు పతిభక్తి చూపిన ఓ మహిళ అడ్డంగా బుక్కయింది.
ముజఫర్ నగర్: జైల్లో ఉన్న భర్తపై మూర్ఖపు పతిభక్తి చూపిన ఓ మహిళ అడ్డంగా బుక్కయింది. అతనికి మత్తుమందులు సరఫరా చేస్తూ పట్టుబడడంతో ఊచలు లెక్కపెడుతోంది. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా జైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న భర్త చాంద్ మియాన్ను చూసేందుకు వచ్చిది సైరా. నిబంధనల ప్రకారం కారాగారం ప్రధాన గేటు దగ్గర జైలు అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె మత్తుమందులతో వచ్చిన విషయం బయటపడింది. దీంతో షాకవ్వయడం అధికారుల వంతయ్యింది. ఆమె దగ్గర నుంచి సుమారు యాభై గ్రాముల చరస్ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రాకేష్ సింగ్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
woman, husband arrested, drugs , jail, జైలు, భర్త, భార్య, మత్తుమందు,అరెస్టు