Singapore: For First Time In 20 Years Death Penalty For Woman - Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష.. ఏ కేసులోనంటే?

Jul 25 2023 3:39 PM | Updated on Jul 25 2023 4:07 PM

Singapore: For First Time In 20 Years Death Penalty For Woman - Sakshi

మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్‌ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి  హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ఫర్‌మేటివ్‌ జస్టిస్‌ కలెక్టివ్‌(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని  జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది.

అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. 
చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 

20 ఏళ్లలో తొలిసారి
ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి  2004లో డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్‌ స్టైలిష్‌ యెన్‌ మే వుయెన్‌కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. 

అత్యంత కఠిన చట్టాలు
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు  సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసే వారికి  మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్‌ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement