న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు)
సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ క్రిప్టో డాట్‌కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్‌కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇది చదవండి: Starbucks: స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే?
ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్‌లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్‌కాంకు ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment