Error
-
ఆడిట్ సంస్థల్లో లోపాలు
న్యూఢిల్లీ: బిగ్–4 ఆడిటింగ్ కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఎంటెటీలలో ఆడిటింగ్ కార్యకలాపాల పరంగా లోపాలు ఉన్నట్టు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) గుర్తించింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ, బీఎస్ఆర్ అండ్ కో ఎల్ఎల్పీ, ఎస్ఆర్బీసీ అండ్ కో ఎల్ఎల్పీ, ప్రైస్ వాటర్ హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎల్ఎల్పీ సంస్థల్లో ఆడిట్ నాణ్యత తనిఖీలను ఎన్ఎఫ్ఆర్ఏ నిర్వహించగా ఈ లోపాలు వెలుగు చూశాయి. ప్రైస్ వాటర్ హౌస్, డెలాయిట్, ఈవై, కేపీఎంజీలను బిగ్–4 ఆడిటింగ్ సంస్థలుగా చెబుతారు. సంస్థల నాణ్యత నియంత్రణలను ఎన్ఎఫ్ఆర్ఏ పరిశీలించింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించి వార్షిక స్టాట్యూటరీ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అధ్యయనం చేసింది. డెలాయిట్ హస్కిన్స్ అండ్ ఎల్ఎల్పీకి సంబంధించి ఆరు లోపాలను గుర్తించింది. బీఎస్ఆర్ అండ్ కోకు సంబంధించి కూడా ఆరు లోపాలు బయటపడ్డాయి. -
మీకు తెలుసా! వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి
రోగాలను నిర్థారించడంలో తలెత్తిన లోపాల కారణంగా ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌కి చెందిన ఓ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది లక్షల మంది దాక చనిపోతున్నట్లు యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం ..ప్రతి ఏడాది వ్యాధులను సరిగా గుర్తించడంలో వైఫల్యం కారణంగా ఏటా మూడు లక్షల మరణాలు, నాలుగు లక్షల మందికి అంగవైకల్యం, మరికొందరూ ఇతర శారీరక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తన అధ్యయనంలో పేర్కొంది. శాస్త్రవేత్తలు 15 రకాల వ్యాధులను గుర్తించడంలో వైద్యులు విపలమవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రోగ నిర్థారణ లోపాల్లో చాలా వరకు ఆస్పత్రుల్లో సరైన విధంగా వనరులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అని తెలిపింది. ఇక వైద్యులు ఊపితిత్తుల క్యాన్సర్, సెప్సిన్, న్యుమోనియా, సిరలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, తదితర వ్యాధులను తప్పుగా నిర్థారిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధులు సాధారణ వ్యాధుల లక్షణాలను చూపించడంతో తరుచుగా వైద్యులు ఆయా వ్యాధులను గుర్తించడంలో విఫలమవుతున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ న్యూమాన్-టోకర్ వెల్లడించారు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
సిగ్నల్ లోపం వల్లే రైలు ప్రమాదం
-
Odisha Train Crash: ఇది సాంకేతిక సమస్య? మానవ తప్పిదమా?..
ఒడిశాలో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపాలు గురించి పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీ కొట్టిన కోరమాండల్ ప్యాసింజర్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీన్ని మరోక రైలు యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ పట్టాలు తప్పిన బోగీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఇదే ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలకు లెవనెత్తాయి. ఈ మేరకు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. వెంటవెంటనే రైళ్లు ఎలా ఢీ కొన్నాయి. అదే ప్రదేశంలో ఎలా జరిగిందనే దానిపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదీగాక గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌లోనే కోరమాండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ స్టేషనరీ గూడ్స్ రైలు ఎలా ఉందనేది పలు సందేహాలకు దారితీసింది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది సందేహాస్పదంగా ఉంది. సిగ్నల్ లోపమే.. ఈ ఘటనతో రైల్వే మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా యాంటీ కొలిజన్ సిస్టమ్ కవాచ్ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉంది. రైలు ఢీ కొనడానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్(సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఏడీ) ఉన్నప్పుడూ ఈ కవాచ్ హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్ రైలు డ్రైవర్ని అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే సమయంలో ట్రాక్‌పై రైలుని గమనించి వెంటనే రైలుని ఆపగలదు కూడా. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో కవాచచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యంత ప్రభావితమైన భాగాలు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, సాధారణంగా సెలవు దినాల కావడంతో వాటిల్లో అత్యంత రద్దీగా ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణికులు కూడా ప్రవేశిస్తారు. అందువల్ల గుర్తు తెలియని వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఘటన స్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీపి నియమించనున్నట్లు తెలిపారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
ఈపీఎఫ్ పోర్టల్‌లో సమస్యలు.. వినియోగదారులకు చుక్కలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వెబ్ సైట్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది 2021-2022 కాలానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.1శాతానికి పెరిగాయి. అయితే పెంచిన ఆ వడ్డీ రేట్లు ఈపీఎఫ్ పోర్టల్‌లో మాయమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పాస్‌బుక్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తు ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. అయినా పోర్టల్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. జనవరి 14 సాయంత్రం 5గంటలకు అప్డేట్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ తరహా మెసేజ్‌లు గతకొన్ని రోజులుగా అలాగే చూపిస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై వినియోగదారులు ట్విటర్లో ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఈపాస్ బుక్ కనిపించడం లేదంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫిర్యాదులపై ఈపీఎఫ్‌వో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని, యూజర్ల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రిప్లయి ఇచ్చారు. For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 -
భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యాప్‌లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్‌ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్ చిత్రాన్ని వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap. All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022 భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్. వాట్సాప్ క్షమాపణలు.. మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది వాట్సాప్. జరిగిన తప్పుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్ ఇదీ చదవండి: స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై ‘బీఎస్ఎఫ్’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం -
100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు) సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ క్రిప్టో డాట్‌కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్‌కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చదవండి: Starbucks: స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే? ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్‌కాంకు ఇవ్వాలని ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం.. అంతలోనే ఆవిరైన ఆనందం
ఒక క్రేన్ ఆపరేటర్ కూతురు.. రోజుకు 18 గంటలపాటు కష్టపడింది. స్మార్ట్‌ఫోన్ ప్రిపరేషన్, అరకోర పుస్తకాలతో.. అందునా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టింది. పైగా ఆల్ ఇండియాలో 323వ ర్యాంక్ సాధించింది. ఈ కథ స్ఫూర్తిని ఇచ్చేదే. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఆ అమ్మాయి ఆనందాన్ని ఆవిరి చేసింది. జార్ఖండ్ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించడంతో ఆమెను మెచ్చుకోని వాళ్లంటూ లేరు. ఆమె తండ్రి సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కోచింగ్ లేకుండానే ఆమె ఈ ఘనత సాధించడంతో.. మీడియా కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అయితే.. ఆమె ఆనందం ఇప్పుడు ఆవిరైంది. ర్యాంక్ వచ్చింది ఆమెకు కాదని స్పష్టత వచ్చింది. దివ్య పాండే అక్క ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్ చేసి ఫలానా దివ్య పాండేకు సివిల్స్ ర్యాంక్ వచ్చిందని చెప్పిందట. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్లో ఫలితాల కోసం సెర్చ్చేయగా.. ఆ టైంకి ఇంటర్నెట్ పని చేయలేదని చెబుతోంది ఆ కుటుంబం. అయినా ఆలోచించకుండా ర్యాంక్ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు. అయితే ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్ వచ్చింది జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లా చిట్టాపూర్‌లోని రాజ్రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు చెప్పారు. ఆ ర్యాంక్ దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా వెనుదిగింది. అంతేకాదు ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు చెబుతోంది. మరోవైపు ఈ తప్పిదం ఆధారంగా ఆ కుటుంబంపై ఎలాంటి చర్యలు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. -
అమెరికా జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ షాక్
వాషింగ్టన్: ఉత్పత్తి సమయంలో చోటు చేసుకున్న తప్పిదం కారణంగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు వృథా అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడమే కాక వ్యాక్సిన్ డెలివరీ టార్గెట్‌ని రీచ్ అయినట్లు వారు తెలిపారు. ఈ సంఘటన బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది. కానీ దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక ఒక బ్యాచ్ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన చేసింది. ప్లాంట్‌లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కార్మికులు అనుకోకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు సంబంధించని ఔషధ పదార్థాలను ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్ టీకా కార్యక్రమం కోసం జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు ఫైజర్, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ మినహాయించి మిగతా రెండు కంపెనీలు 120 మిలియన్, 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసి టార్గెట్ రీచ్ అయ్యాయి. ఈ తప్పిదం విషయాన్ని ఎమర్జెంట్‌తో పాటు ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అధికారులకు కూడా తెలిపామని జాన్సన్ అండ్ జాన్సన్ ఉద్యోగి ఒకరు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని ఎఫ్‌డీఏ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి -
రైల్వే టికెట్‌తో ఇబ్బందులు
రైల్వే శాఖ తప్పిదంతో మానసిక వేదన అనుభవించిన ఆ వృద్ధుడు.. చివరకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. బలవంతంగా రైలు దించేయటంతో రైల్వే శాఖపై పోరాటానికి దిగారు. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... లక్నో: షరన్పూర్కు చెందిన రిటైర్డ్ ఫ్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా(72) 2013లో నవంబర్ 19వ తేదీన కన్నౌజ్ వెళ్లేందుకు టికెట్‌ను తీసుకున్నారు. అయితే టికెట్ ప్రింట్ మీద 2013కి బదులు.. 3013గా ముద్రణ అయ్యింది. అది గమనించని విష్ణుకాంత్.. రైల్వే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీసీ తనిఖీలో వెయ్యి సంవత్సరాల తర్వాత తేదీ ముద్రించి ఉండటం గమనించిన ఆయన ఖంగుతిన్నారు. టీసీ రూ.800 ఫైన్ రాయటంతో ఆయన వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో ఆయన్ని బలవంతంగా తర్వాతి స్టేషన్లో కిందకు దించేశారు. ఈ వ్యవహారంపై ఆయన షరన్పూర్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, విచారణ కొనసాగుతూ వస్తోంది. ‘అందరి ముందు తనను అవమానించారని, అందుకు పరిహారం చెల్లించాలని’ విష్ణుకాంత్ వాదించగా, టికెట్ జారీ అయ్యాక పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని రైల్వే శాఖ వాదించింది. అయితే ఫోరమ్ చైర్మన్ మాత్రం రైల్వే శాఖ వాదనతో విబేధించారు. ‘70 ఏళ్ల వృద్ధుడ్ని మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని’ రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం కింద రూ.10,000 మరియు టికెట్ ధర.. వడ్డీతో కలిపి మరో రూ.3 వేలు చెల్లించాలని ఫోరమ్ బుధవారం తీర్పు వెలువరించింది. -
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సారీ!
తమకు తెలిసిన మెకానిక్ తో హోమ్ బటన్ ను మార్పిడి చేసుకున్న ఐఫోన్ యూజర్లకు తాజాగా 'ఎర్రర్ 53' వస్తుండటంతో వారికి యాపిల్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్ల హోమ్ బటన్‌లో యాపిల్ 'టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ రీడర్' ఉంటుంది. పాస్వర్డ్ అవసరం లేకుండానే ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, హోమ్ బటన్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటీవల ఐఫోన్, ఐప్యాడ్ లలో వాటిని స్థానిక మెకానిక్‌ల ద్వారా మార్చుకున్న వినియోగదారులకు.. ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేసుకునేటప్పడు.. 'ఎర్రర్ 53' అని వస్తుంది. దీంతో ఐఫోన్ షట్‌డౌన్ అయి.. ఎంతకూ రీస్టార్ట్ కావడం లేదు. వేలమంది వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ మాత్రం డివైస్ సెక్యూరిటీ కోసమే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టామని చెప్పింది. ఈ ఫీచర్ విషయంలో ఎర్రర్ వస్తే యాపిల్ సపోర్ట్‌కు కాల్ చేసి.. సమస్య పరిష్కరించుకోవచ్చునని సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అప్డేటెడ్ వెర్షన్ ఐవోఎస్‌లో ఈ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఇబ్బందిపడిన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. -
వాల్యూయేషన్‌లో తప్పిదాలకు మూల్యం
-
గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!
ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే... కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు. అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది. నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు. నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ గ్రీన్ చెక్ బాక్స్ లో యాడ్ అయ్యి ఉండటం గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట. అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు. అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు. ''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు. దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది'' అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్. ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్ ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి. ప్రస్తుతానికి గూగుల్ ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది. -
ఫేస్బుక్లో గుర్తుతెలియని సమస్య
ఫేస్బుక్లో సమస్య తలెత్తింది. రాత్రి 9.30 గంటల తర్వాత ఉన్నట్టుండి ఫేస్బుక్ పేజీ మొత్తం అదృశ్యం అయిపోయింది. ఏదో తెలియని ఇబ్బంది ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి తాము కృషి చేస్తున్నామంటూ ఓ సందేశం మాత్రం కనిపించింది. మధ్యలో కాసేపు బాగానే ఉన్నా.. మళ్లీ తర్వాత అదే సమస్య తలెత్తింది. దాంతో యూజర్లు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎంతసేపు ఉంటుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఫేస్బుక్ కూడా సమస్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియకపోవడంతో అంతకుమించి మరేమీ చెప్పలేకపోయింది. వచ్చి.. పోయి.. వచ్చి.. పోయి.. అన్నట్లుండి, యూజర్ల సహనానికి పరీక్ష పెట్టింది. -
దోషం ఉందంటూ దోచేసింది
12 కాసుల నగలతో ఉడాయించిన మాయ‘లేడి’ లబోదిబోమంటున్న బాధితులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రంపంచ అగ్ర రాజ్యాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా అక్కడక్కడ మూఢనమ్మకాలు రాజ్యమేలు తున్నాయి. అమాయక సామాన్యజనాన్ని నట్టేట ముంచుతూనే ఉన్నాయి. కైకలూరు : ఇంట్లో దోషం ఉందంటూ నమ్మించి 12 కాసుల నగలు, రూ. 9వేలుతో ఉడయించిన మహిళ ఉదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. సినీఫక్కీలో జరిగిన ఈ దొంగతనం పట్టణంలో కలకలం రేపింది. స్థానిక వెలంపేటలో పోలన సతీష్, భార్య గౌరి, తల్లి, సోదరుడితో కలసి నివసిస్తున్నారు. వారం రోజుల క్రితం గౌరి వద్దకు ఓ మహిళ వచ్చి ముఖంపై పెద్ద బొట్టు, చేతిలో సంచితో ఓ మహిళ రావడం చూశారా అని ప్రశ్నించింది. గౌరి ఏవరని అడిగింది. ఆమె మా ఇంటిలో దోషాలను పరిష్కరించిందని, ఆమె కనిపిస్తే కొవ్వూరు నుంచి ఓ మహిళ వచ్చిందని చెప్పండని నమ్మించి వెళ్లిపోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గౌరి వద్దకు నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకున్న ఓ మహిళ వచ్చింది. ఆమె కరక్కాయిలు, మూలికలు అమ్ముతానని చెప్పింది. దీంతో గౌరీ వారం రోజుల కిత్రం చెప్పిన మహిళ అనుకుని లోపలికి రమ్మంది. ఇంట్లోకి వెళ్లిన ఆ మాయలేడి గోడపై ఉన్న ఫొటోను చూసి చేతబడి చేయడం వల్లే ఆయన చనిపోయారని చెప్పింది. చేతబడి నివారణకు వివాహం కాని బ్రాహ్మణుడితో పూజలు చేయించాలని, ఆయనకు ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదని నమ్మబలికింది. గౌరి అమాయకంగా డబ్బులు తీసుకోకుండా ఎవరు పూజ చేస్తారని అడగడంతో 10 నిముషాల్లో నేను చెస్తానని ఆమె చెప్పింది. ఇంట్లో బియ్యం తీసుకురమ్మని నగలు ఉంచాలని కోరింది. తూకం రాయి చూపించి బరువు సరిపోలేదని డబ్బు ఉంచాలని కోరింది. పుసుపు, కుంకుమతో పూజ చేసి డబ్బాలో నగలు, డబ్బును ఉంచింది. దానిపై తాయత్తలు కట్టి దేవుడి పూజ గదిలో ఉంచాలని చెప్పింది. ఈ విషయం మరుసటి రోజు ఉదయం వరకు ఎవరికీ చెప్పకూడదని, పూజ చేసి నగలు, డబ్బులు తీసుకోవాలని చెప్పింది. నమ్మకం కలగడానికి తన పేరు నాగమ్మ అని కొవ్వూరులో డోర్ నెంబరు 101లో నివాసముంటున్నానని, అక్కడకు వచ్చి నా పేరు చెబితే ఇంటికి తీసుకొస్తారని చెప్పి ఊడాయించింది. మరుసటి రోజు ఉదయం గౌరి బాక్సు తీసి చూస్తే బియ్యం మాత్రమే అందులో ఉన్నాయి. మోసపోయానని గుర్తించిన గౌరి విషయాన్ని ఇంటిలో చెప్పింది. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగలకు మెరుగు పెడతాం, దోషాలను నివారిస్తాం అంటూ వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.