ఒడిశాలో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపాలు గురించి పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీ కొట్టిన కోరమాండల్ ప్యాసింజర్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీన్ని మరోక రైలు యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ పట్టాలు తప్పిన బోగీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఇదే ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలకు లెవనెత్తాయి.
ఈ మేరకు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. వెంటవెంటనే రైళ్లు ఎలా ఢీ కొన్నాయి. అదే ప్రదేశంలో ఎలా జరిగిందనే దానిపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదీగాక గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌లోనే కోరమాండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ స్టేషనరీ గూడ్స్ రైలు ఎలా ఉందనేది పలు సందేహాలకు దారితీసింది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది సందేహాస్పదంగా ఉంది.
సిగ్నల్ లోపమే..
ఈ ఘటనతో రైల్వే మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా యాంటీ కొలిజన్ సిస్టమ్ కవాచ్‌ని ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియలో ఉంది. రైలు ఢీ కొనడానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్(సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఏడీ) ఉన్నప్పుడూ ఈ కవాచ్ హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్ రైలు డ్రైవర్‌ని అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే సమయంలో ట్రాక్‌పై రైలుని గమనించి వెంటనే రైలుని ఆపగలదు కూడా.
అయితే ప్రమాదం జరిగిన మార్గంలో కవాచచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యంత ప్రభావితమైన భాగాలు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, సాధారణంగా సెలవు దినాల కావడంతో వాటిల్లో అత్యంత రద్దీగా ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణికులు కూడా ప్రవేశిస్తారు. అందువల్ల గుర్తు తెలియని వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఘటన స్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీపి నియమించనున్నట్లు తెలిపారు.
(చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే)
Comments
Please login to add a commentAdd a comment