train crash
-
‘బెంగాల్ రైలు ప్రమాదం.. ఈ ఆలస్యమేలా?’
updates పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి డీన్ మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో గాయపడిన 37మంది హాస్పిటల్లో చేరారు. వారికి చికిత్స అందిస్తున్నాం. సీరియస్‌గా ఉన్న ఇద్దరు దృరదృష్టవశాత్తు ఈ రోజు మృతిచెందారు. నిన్న ఎనిమిది, ఈ రోజు ఇద్దరితో కలిపి రైలు ప్రమాద ఘటనలో మొత్తం 10మంది మృతి చెందారు.#WATCH | Kanchenjunga Express train accident | Dean, North Bengal Medical College & Hospital Dr Sandeep Kumar Sengupta says, "Yesterday, 37 people were admitted, 2 people weren't in a bad state hence they were released. 2 people were serious, unfortunately, we couldn't save them… pic.twitter.com/TZ68ncWX17— ANI (@ANI) June 18, 2024 పశ్చిమ బెంగాల్ కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై భారతీయ రైల్వే రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.Railways to hold inquiry into Kanchenjunga train mishap in West Bengal on June 19Read @ANI Story | https://t.co/zcBcAWKQjt#Railways #KanchenjungaTrainAccident #WestBengal pic.twitter.com/JtpCjyrDGC— ANI Digital (@ani_digital) June 18, 2024 కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కాంచనజంగ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిన్నటి నుంచి ‘ఎక్స్’ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.Ashwini Vaishnaw is the worst railway minister ever.RT if you agree.#TrainAccident pic.twitter.com/TULQFj4q8R— Ashish (@error040290) June 17, 2024 బెంగాల్ కాంచనజంగ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లను రైల్వే అధికారుల దారి మళ్లించారు.Several trains cancelled, diverted after Kanchenjunga Express train mishap in West BengalRead @ANI Story | https://t.co/hW9z6YP02k#KanchenjungaExpressTrainAccident #WestBengal pic.twitter.com/s202ygP1YN— ANI Digital (@ani_digital) June 18, 2024 డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా ప్రాంతం నుంచి రైలు సేవలు ప్రారంభం అయ్యాయి.#WATCH | West Bengal: Train services resume from the Phansidewa area of the Darjeeling district. Kanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25 got injured in the accident. pic.twitter.com/8xkDam169Y— ANI (@ANI) June 18, 2024 రాత్రి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని కతిహార్ నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ రైల్వే డీఆర్ఎం సుబేందు కుమార్ తెలిపారు. నిన్న ఇంజన్ ట్రైయల్ రన్ చేశామన్నారు. మరో అర్ధ గంటలో ట్రాక్ లైన్ పక్కన పునరుద్ధరణ పనులు ముగుస్తాయని తెలిపారు.#WATCH | Kanchenjunga Express train accident | Divisional Railway Manager (DRM), Katihar Northeast Frontier Railway, Subhendu Kumar Choudhary says, "Restoration work has been going on since night. The trial of an engine was carried out upline towards NJP (New Jalpaiguri Junction)… pic.twitter.com/Ec8Tg38495— ANI (@ANI) June 18, 2024 రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.#WATCH | Kanchenjunga Express train accident | Medical treatment of the injured people admitted at North Bengal Medical College & Hospital in Siliguri. 8 people died and around 25 got injured in the accident.#WestBengal pic.twitter.com/JmsCrxZMzX— ANI (@ANI) June 18, 2024 కాంచనజంగ రైలులో ప్రయాణిచిన పలువురు ప్రయాణికులను సిల్దా రైల్వే స్టేషన్లో దిగారు. వారితో మాట్లాడిన కోల్‌కతా మేయర్ ఫర్హద్ హకిమ్ సహాయక ఏర్పాట్లు చేశారు.#WATCH | Kanchenjunga Express train accident: West Bengal | Kolkata Mayor Firhad Hakim interacted with the passengers of the Kanchenjunga Express train which arrived at the Sealdah railway station.The train met with an accident in the Phansidewa area of the Darjeeling district,… https://t.co/qrMFaYo5IV pic.twitter.com/82YMyLp8yg— ANI (@ANI) June 17, 2024 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో 9 మంది మరణించగా, 41మంది గాయపడ్డారు. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచి ఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఢికోట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్ పక్కనే ఉన్న గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ , రెస్య్కూ టీం ప్రమాద స్థలానికి చేరుకునే వరకు వర్షంలో స్థానికులు మృతదేహాలను బయటకు తీసి, గాయపడిన వారికి సాయం అందించారు.#WATCH | Kanchenjunga Express train accident: Morning visuals from the spot in the Phansidewa area of the Darjeeling district, West BengalKanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25… pic.twitter.com/bwW83ICA2u— ANI (@ANI) June 18, 2024 ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఎన్డీఆర్ఎఫ్, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని అప్పటివరకు తామే ప్రమాద బాధితులకు సాయం చేశామని స్థానికులు మీడియాతో వెల్లడించారు. స్థానికులు మృతదేహాలు, గాయపడినవారిని బయటకు తీశారు. గాయపడినవారిని రిక్షాల్లో స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సహాయాక బృందాలు.. ఆలస్యంగా ఘటనాస్థలానికి చేరుకున్నారని స్థానికులు అన్నారు.#WATCH | Kanchenjunga Express train accident: Visuals from the North Bengal Medical College in Siliguri Kanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25 got injured in the accident. pic.twitter.com/rns5lIKuqO— ANI (@ANI) June 18, 2024 ప్రమాదం జరిగిన వెంటనే తన స్నేహితులతో రైలు వద్దకు చేరుకొని కిచెన్‌లో ఉపయోగించే పాత్రలతో కిటికిలు పగలగొట్టి మరీ ప్రయాణిలను కాపాడామని స్థానికుడొకరు తెలిపారు. బోగిలో చిక్కుకున్న ప్రయాణికుడిని సాయం చేసే క్రమంలో తన చేతి వేలికి గాయమైందని తెలిపారు. అప్పటికి అక్కడికి అంబులెన్స్‌లు రాలేదని అన్నారు. దీంతో ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకొని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించామని చెప్పారు.తాము ప్రమాదం జరిగిన 10.05 గంటలకే అలెర్ట్ అయ్యామని ఎన్డీఆర్ఎఫ్ అధికారి తెలిపారు. ముందుగా మూడు సహాయక టీంలు 10.40 గంటలకు ప్రమాదస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాద స్థలంలో ముందుగా.. మూడు మృత దేహాలను బయటకు తీశామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సహాయక చర్యలు పూర్తి చేశామని తెలిపారు. రెండు సహాయక టీంలను ప్రమాద స్థలంలోనే సేవలు అందిచాలని ఉంచామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ చెందిన మొత్తం 82 మంది సహాకచర్యలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారలు ఘటనా స్థలానికి చేరుకున్నారని కతిహార్ డివిజన్ సీపీఆర్ఓ సవ్యవాచి తెలిపారు. అయితే రెండు రూరల్ స్టేషన్ల మధ్య ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం అందిన వెంటనే సాధ్యమైంత త్వరగానే చేరుకున్నామని రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సహాయాక బృందాలు తెలిపాయి. ప్రమాద స్థలం వ్యవసాయ క్షేత్రాలు, దట్టమైన చెట్లతో ఉందని ఇక్కడి చేరుకొవాలంటే కొంత దూరం ట్రెక్కింగ్ కూడా చేయాల్సి వచ్చిందని అన్నారు. -
Odisha Train Crash: ఇది సాంకేతిక సమస్య? మానవ తప్పిదమా?..
ఒడిశాలో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలు, లోపాలు గురించి పలు ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీ కొట్టిన కోరమాండల్ ప్యాసింజర్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీన్ని మరోక రైలు యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ పట్టాలు తప్పిన బోగీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసలు ఇదే ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలకు లెవనెత్తాయి. ఈ మేరకు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. వెంటవెంటనే రైళ్లు ఎలా ఢీ కొన్నాయి. అదే ప్రదేశంలో ఎలా జరిగిందనే దానిపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదీగాక గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాక్‌లోనే కోరమాండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ స్టేషనరీ గూడ్స్ రైలు ఎలా ఉందనేది పలు సందేహాలకు దారితీసింది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది సందేహాస్పదంగా ఉంది. సిగ్నల్ లోపమే.. ఈ ఘటనతో రైల్వే మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా యాంటీ కొలిజన్ సిస్టమ్ కవాచ్ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉంది. రైలు ఢీ కొనడానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్(సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ ఎస్పీఏడీ) ఉన్నప్పుడూ ఈ కవాచ్ హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్ రైలు డ్రైవర్ని అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే సమయంలో ట్రాక్‌పై రైలుని గమనించి వెంటనే రైలుని ఆపగలదు కూడా. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో కవాచచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ అన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యంత ప్రభావితమైన భాగాలు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, సాధారణంగా సెలవు దినాల కావడంతో వాటిల్లో అత్యంత రద్దీగా ఉంటుంది. రిజర్వ్ చేయని ప్రయాణికులు కూడా ప్రవేశిస్తారు. అందువల్ల గుర్తు తెలియని వారి మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఘటన స్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీపి నియమించనున్నట్లు తెలిపారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
తీవ్ర విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు (ఫొటోలు)
-
ఓహియో రాష్ట్రంలో వాతావరణం విషపూరితం
-
పోలీస్ కారునే దొంగతనం చేయబోయి..చావు అంచులదాక వెళ్లొచ్చాడు!
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే దొంగలించేందుకు యత్నం చేశాడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యుముఖం వరకు వెళ్లి త్రుటిలో బయటపడ్డాడు. ఈ అనుహ్య ఘటన యూఎస్‌లోని అట్లాంటాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని అట్లాంటాలో ఓ వ్యక్తి పోలీస్ పెట్రోలింగ్ కారును దొంగలించే సాహసం చేశాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అంతేకాదు ఒక పక్క కారుని ట్రేస్ చేస్తూ ఫాలో చేయడం ప్రారంభించారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్ల సాయంతో కూడా ఛేజ్ చేస్తున్నారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలికిందులగా పడిపోయింది. ఐతే అదే సమయంలో అనుహ్యంగా ఒక రైలు స్పీడ్‌గా వస్తోంది. అంతే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆ నిందితుడిని బయటకు లాగి రక్షించిన కొద్ది నిమిషాల్లోనే రైలు ఆ కారుని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. నిందితుడు మాత్రం కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని రక్షించడమే గాక అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Dramatic body camera footage shows Atlanta police saving a suspect from an oncoming train at the last minute. Police chased a man who stole a patrol vehicle while an officer was conducting a traffic stop, but was halted when the suspect crashed the car onto train tracks. pic.twitter.com/7r4MmfIjFp — Newsweek (@Newsweek) January 30, 2023 (చదవండి: విమానంలో ప్రయాణకురాలి వీరంగం..సిబ్బందిని హడలెత్తించేలా కొట్టి, ఉమ్మి వేసి...) -
ఘోర రైలు ప్రమాదం.. 9మంది మృతి
అంకారా : టర్కీ రాజధాని అంకారాలో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైస్పీడు రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రైలు అంకారా నుంచి కోన్యకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రెండు రైళ్లు ఢీకొని, 31 మంది మృతి
-
రెండు రైళ్లు ఢీకొని, 31 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మరో రైలును ఢీకొన్న సంఘటనలో కనీసం 31 మంది మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సెమ్నన్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన జరిగినట్టు గవర్నర్ మహ్మద్ రెజా ఖబాజ్ తెలిపారు. మరణించిన 31 మందిని గుర్తించామని, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం!
-
స్టేషన్లోకి దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం!
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో గురువారం ఉదయం భారీ రైలుప్రమాదం జరిగింది. న్యూజెర్సీలోని హోబోకెన్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కూడిన ఓ రైలు క్రాష్ అయి టెర్మినల్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా.. సుమారు వందమంది గాయపడ్డారని తెలుస్తోంది. రైల్వే స్టేషన్లో తీవ్రస్థాయిలో విధ్వంసాన్ని మిగిల్చిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రయాణికులు ఆన్లైన్లో పోస్టు చేశారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, రైలు జరిపిన విధ్వంసంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఫొటోలను బట్టి రైల్వేస్టేషన్లో భారీ ఎత్తున నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వేస్టేషన్లో రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంత పరిచింది. -
రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి
-
రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి
-
రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 20 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇటలీ దక్షిణప్రాంతంలో కొరాటో, ఆండ్రియా పట్టణాల మధ్య ఒకే రైలు మార్గంలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ఇంజిన్లు, కొన్ని బోగీలు ధ్వంసమయ్యాయి. ఇంజిన్లు తుక్కుతుక్కయ్యాయి. ఈ భాగాలు రైల్వే ట్రాక్ ఇరువైపులా కొద్దిదూరం ఎగిరిపడ్డాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదస్థలికి అంబులెన్స్‌లను, ఫైరింజన్లను తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇటలీ ప్రధాని రెంజీ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. -
బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి
కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైళ్లు ఢీ.. పది మంది మృతి
-
జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి
బాడ్ ఐబ్లింగ్: జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించగా సుమారు 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బవేరియాలోని బాడ్ ఐబ్లింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి ఓవైపు అడవి మరోవైపు నది ఉండటంతో సహాయ సిబ్బంది బోట్లు, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రమాద కారణాలతోపాటు ఆ సమయంలో రైళ్ల వేగం ఎంతో వెంటనే తెలియరాలేదు. అయితే గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిం చేందుకు రైళ్లకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్
సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న చంద్రయ్యగౌడ్(50) సిగ్నల్‌గడ్డ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన మృతదేహం రెండు ముక్కలైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
వరంగల్: గొర్రెల కాపరి రైలు పట్టాలు దాటుతుండగా మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. నెక్కొండ మండలం పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన కడారి భీమయ్య(55) గొర్రెలను పట్టాలు దాటించి తను దాటే క్రమంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వరంగల్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భీమయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. (మట్టెవాడ)