‘బెంగాల్ రైలు ప్రమాదం.. ఈ ఆలస్యమేలా?’ Kanchanjunga Express, West Bengal Train Accident Live Updates. Sakshi
Sakshi News home page

కాంచన్‌జంగా రైలు ప్రమాదం.. పదికి చేరిన మృతులు సంఖ్య.. అప్‌డేట్స్‌

Published Tue, Jun 18 2024 8:20 AM | Last Updated on Tue, Jun 18 2024 12:43 PM

Kanchanjunga Express  train Crash Tragedy  West Bengal Updates

updates 

  • పశ్చిమ బెంగాల్‌ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. నార్త్‌ బెంగాల్‌ మెడికల్ కాలేజీ  ఆస్పత్రి డీన్‌  మీడియాతో మాట్లాడారు.
  • ప్రమాదంలో గాయపడిన 37మంది హాస్పిటల్‌లో చేరారు. వారికి చికిత్స అందిస్తున్నాం. సీరియస్‌గా ఉన్న ఇద్దరు దృరదృష్టవశాత్తు ఈ రోజు మృతిచెందారు. 
  • నిన్న ఎనిమిది, ఈ రోజు ఇద్దరితో కలిపి రైలు ప్రమాద ఘటనలో మొత్తం 10మంది మృతి చెందారు.

 

 

  • పశ్చిమ బెంగాల్‌ కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై భారతీయ రైల్వే  రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.

     

  • కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కాంచనజంగ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిన్నటి  నుంచి ‘ఎక్స్‌’ట్రెండ్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

      

     

  • బెంగాల్‌ కాంచనజంగ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లను రైల్వే అధికారుల దారి మళ్లించారు.

     

 

  • డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతం నుంచి రైలు సేవలు ప్రారంభం అయ్యాయి.

      

  • రాత్రి నుంచి ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని కతిహార్‌ నార్త్‌వెస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే డీఆర్‌ఎం సుబేందు కుమార్‌ తెలిపారు. 

  • నిన్న ఇంజన్‌ ట్రైయల్‌ రన్‌ చేశామన్నారు. మరో అర్ధ గం‍టలో ట్రాక్‌ లైన్‌ పక్కన పునరుద్ధరణ పనులు ముగుస్తాయని తెలిపారు.

     

 

 

  • రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

      

 

  • కాంచనజంగ రైలులో ప్రయాణిచిన పలువురు ప్రయాణికులను సిల్దా రైల్వే స్టేషన్‌లో దిగారు. వారితో మాట్లాడిన కోల్‌కతా మేయర్‌ ఫర్‌హద్‌ హకిమ్ సహాయక​ ఏర్పాట్లు చేశారు.

 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో 9 మంది మరణించగా, 41మంది గాయపడ్డారు. వేగంగా వస్తున్న  గూడ్స్‌ రైలు రెడ్‌ సిగ్నల్‌ను జంప్‌ చేసి అదే ట్రాక్‌పై నిలిచి  ఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఢికోట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్‌ పక్కనే ఉన్న గ్రామస్థులు  సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ , రెస్య్కూ టీం ప్రమాద  స్థలానికి చేరుకునే వరకు వర్షంలో స్థానికులు మృతదేహాలను బయటకు తీసి, గాయపడిన వారికి సాయం అందించారు.

 

ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని అప్పటివరకు తామే ప్రమాద బాధితులకు సాయం చేశామని స్థానికులు మీడియాతో వెల్లడించారు. స్థానికులు మృతదేహాలు, గాయపడినవారిని బయటకు తీశారు. గాయపడినవారిని రిక్షాల్లో స్థానిక  హాస్పిటల్‌కి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయాక బృందాలు.. ఆలస్యంగా ఘటనాస్థలానికి చేరుకున్నారని స్థానికులు అన్నారు.

 

ప్రమాదం జరిగిన వెంటనే తన స్నేహితులతో రైలు వద్దకు చేరుకొని కిచెన్‌లో ఉపయోగించే పాత్రలతో కిటికిలు పగలగొట్టి మరీ ప్రయాణిలను కాపాడామని స్థానికుడొకరు తెలిపారు. బోగిలో చిక్కుకున్న ప్రయాణికుడిని సాయం చేసే క్రమంలో తన చేతి వేలికి గాయమైందని తెలిపారు. అప్పటికి అక్కడికి అంబులెన్స్‌లు రాలేదని అన్నారు. దీంతో ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకొని నార్త్ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించామని చెప్పారు.

తాము ప్రమాదం జరిగిన 10.05 గంటలకే అలెర్ట్‌ అయ్యామని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. ముందుగా మూడు  సహాయక టీంలు 10.40 గంటలకు ప్రమాదస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాద స్థలంలో ముందుగా.. మూడు మృత దేహాలను బయటకు తీశామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సహాయక చర్యలు పూ​ర్తి చేశామని తెలిపారు. రెండు సహాయక టీంలను ప్రమాద స్థలంలోనే సేవలు అందిచాలని ఉంచామని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ చెందిన మొత్తం 82 మంది సహాకచర్యలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారలు  ఘటనా స్థలానికి చేరుకున్నారని కతిహార్‌ డివిజన్‌ సీపీఆర్‌ఓ సవ్యవాచి తెలిపారు. అయితే రెండు రూరల్ స్టేషన్ల మధ్య ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం అందిన వెంటనే సాధ్యమైంత  త్వరగానే చేరుకున్నామని రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌  సహాయాక బృందాలు తెలిపాయి. ప్రమాద స్థలం వ్యవసాయ క్షేత్రాలు, దట్టమైన చెట్లతో  ఉందని  ఇక్కడి చేరుకొవాలంటే  కొంత దూరం ట్రెక్కింగ్‌ కూడా చేయాల్సి  వచ్చిందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement