ndrf forces
-
‘బెంగాల్ రైలు ప్రమాదం.. ఈ ఆలస్యమేలా?’
updates పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి డీన్ మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో గాయపడిన 37మంది హాస్పిటల్లో చేరారు. వారికి చికిత్స అందిస్తున్నాం. సీరియస్‌గా ఉన్న ఇద్దరు దృరదృష్టవశాత్తు ఈ రోజు మృతిచెందారు. నిన్న ఎనిమిది, ఈ రోజు ఇద్దరితో కలిపి రైలు ప్రమాద ఘటనలో మొత్తం 10మంది మృతి చెందారు.#WATCH | Kanchenjunga Express train accident | Dean, North Bengal Medical College & Hospital Dr Sandeep Kumar Sengupta says, "Yesterday, 37 people were admitted, 2 people weren't in a bad state hence they were released. 2 people were serious, unfortunately, we couldn't save them… pic.twitter.com/TZ68ncWX17— ANI (@ANI) June 18, 2024 పశ్చిమ బెంగాల్ కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై భారతీయ రైల్వే రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.Railways to hold inquiry into Kanchenjunga train mishap in West Bengal on June 19Read @ANI Story | https://t.co/zcBcAWKQjt#Railways #KanchenjungaTrainAccident #WestBengal pic.twitter.com/JtpCjyrDGC— ANI Digital (@ani_digital) June 18, 2024 కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కాంచనజంగ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిన్నటి నుంచి ‘ఎక్స్’ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.Ashwini Vaishnaw is the worst railway minister ever.RT if you agree.#TrainAccident pic.twitter.com/TULQFj4q8R— Ashish (@error040290) June 17, 2024 బెంగాల్ కాంచనజంగ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లను రైల్వే అధికారుల దారి మళ్లించారు.Several trains cancelled, diverted after Kanchenjunga Express train mishap in West BengalRead @ANI Story | https://t.co/hW9z6YP02k#KanchenjungaExpressTrainAccident #WestBengal pic.twitter.com/s202ygP1YN— ANI Digital (@ani_digital) June 18, 2024 డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సిదేవా ప్రాంతం నుంచి రైలు సేవలు ప్రారంభం అయ్యాయి.#WATCH | West Bengal: Train services resume from the Phansidewa area of the Darjeeling district. Kanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25 got injured in the accident. pic.twitter.com/8xkDam169Y— ANI (@ANI) June 18, 2024 రాత్రి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని కతిహార్ నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ రైల్వే డీఆర్ఎం సుబేందు కుమార్ తెలిపారు. నిన్న ఇంజన్ ట్రైయల్ రన్ చేశామన్నారు. మరో అర్ధ గంటలో ట్రాక్ లైన్ పక్కన పునరుద్ధరణ పనులు ముగుస్తాయని తెలిపారు.#WATCH | Kanchenjunga Express train accident | Divisional Railway Manager (DRM), Katihar Northeast Frontier Railway, Subhendu Kumar Choudhary says, "Restoration work has been going on since night. The trial of an engine was carried out upline towards NJP (New Jalpaiguri Junction)… pic.twitter.com/Ec8Tg38495— ANI (@ANI) June 18, 2024 రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.#WATCH | Kanchenjunga Express train accident | Medical treatment of the injured people admitted at North Bengal Medical College & Hospital in Siliguri. 8 people died and around 25 got injured in the accident.#WestBengal pic.twitter.com/JmsCrxZMzX— ANI (@ANI) June 18, 2024 కాంచనజంగ రైలులో ప్రయాణిచిన పలువురు ప్రయాణికులను సిల్దా రైల్వే స్టేషన్లో దిగారు. వారితో మాట్లాడిన కోల్‌కతా మేయర్ ఫర్హద్ హకిమ్ సహాయక ఏర్పాట్లు చేశారు.#WATCH | Kanchenjunga Express train accident: West Bengal | Kolkata Mayor Firhad Hakim interacted with the passengers of the Kanchenjunga Express train which arrived at the Sealdah railway station.The train met with an accident in the Phansidewa area of the Darjeeling district,… https://t.co/qrMFaYo5IV pic.twitter.com/82YMyLp8yg— ANI (@ANI) June 17, 2024 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో 9 మంది మరణించగా, 41మంది గాయపడ్డారు. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి అదే ట్రాక్‌పై నిలిచి ఉన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఢికోట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్ పక్కనే ఉన్న గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ , రెస్య్కూ టీం ప్రమాద స్థలానికి చేరుకునే వరకు వర్షంలో స్థానికులు మృతదేహాలను బయటకు తీసి, గాయపడిన వారికి సాయం అందించారు.#WATCH | Kanchenjunga Express train accident: Morning visuals from the spot in the Phansidewa area of the Darjeeling district, West BengalKanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25… pic.twitter.com/bwW83ICA2u— ANI (@ANI) June 18, 2024 ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఎన్డీఆర్ఎఫ్, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని అప్పటివరకు తామే ప్రమాద బాధితులకు సాయం చేశామని స్థానికులు మీడియాతో వెల్లడించారు. స్థానికులు మృతదేహాలు, గాయపడినవారిని బయటకు తీశారు. గాయపడినవారిని రిక్షాల్లో స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సహాయాక బృందాలు.. ఆలస్యంగా ఘటనాస్థలానికి చేరుకున్నారని స్థానికులు అన్నారు.#WATCH | Kanchenjunga Express train accident: Visuals from the North Bengal Medical College in Siliguri Kanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, yesterday. 8 people died and around 25 got injured in the accident. pic.twitter.com/rns5lIKuqO— ANI (@ANI) June 18, 2024 ప్రమాదం జరిగిన వెంటనే తన స్నేహితులతో రైలు వద్దకు చేరుకొని కిచెన్‌లో ఉపయోగించే పాత్రలతో కిటికిలు పగలగొట్టి మరీ ప్రయాణిలను కాపాడామని స్థానికుడొకరు తెలిపారు. బోగిలో చిక్కుకున్న ప్రయాణికుడిని సాయం చేసే క్రమంలో తన చేతి వేలికి గాయమైందని తెలిపారు. అప్పటికి అక్కడికి అంబులెన్స్‌లు రాలేదని అన్నారు. దీంతో ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకొని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి గాయపడిన వారిని తరలించామని చెప్పారు.తాము ప్రమాదం జరిగిన 10.05 గంటలకే అలెర్ట్ అయ్యామని ఎన్డీఆర్ఎఫ్ అధికారి తెలిపారు. ముందుగా మూడు సహాయక టీంలు 10.40 గంటలకు ప్రమాదస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ప్రమాద స్థలంలో ముందుగా.. మూడు మృత దేహాలను బయటకు తీశామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సహాయక చర్యలు పూర్తి చేశామని తెలిపారు. రెండు సహాయక టీంలను ప్రమాద స్థలంలోనే సేవలు అందిచాలని ఉంచామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ చెందిన మొత్తం 82 మంది సహాకచర్యలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారలు ఘటనా స్థలానికి చేరుకున్నారని కతిహార్ డివిజన్ సీపీఆర్ఓ సవ్యవాచి తెలిపారు. అయితే రెండు రూరల్ స్టేషన్ల మధ్య ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం అందిన వెంటనే సాధ్యమైంత త్వరగానే చేరుకున్నామని రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సహాయాక బృందాలు తెలిపాయి. ప్రమాద స్థలం వ్యవసాయ క్షేత్రాలు, దట్టమైన చెట్లతో ఉందని ఇక్కడి చేరుకొవాలంటే కొంత దూరం ట్రెక్కింగ్ కూడా చేయాల్సి వచ్చిందని అన్నారు. -
ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
64 మందిని కాపాడిన సహాయక బృందాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రోప్‌ల సాయంతో కాపాడారు. హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు. పాపాగ్ని నదికి గండి పడడంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులు, 15 పశువులను ఫైర్ సిబ్బంది కాపాడారు. కడప నగరంలో బుగ్గవంక వరద నీటితో నిండిపోయిన ఒక ఇంటి నుంచి గర్భిణిని రక్షించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతిలో చిక్కుకుపోయిన పది మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు. వైఎస్సార్ జిల్లా చెయ్యూరులో వరద నీటిలో ప్రమాదకరంగా చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని రక్షించారు. 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్ ఫోర్స్, ఫైర్ సర్వీస్ బృందాలు సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాయి. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో జల దిగ్భంధమైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20,923 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారంతోపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. వరద సహాయక చర్యల్లో తూర్పు నౌకాదళం వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల్లో తూర్పు నౌకాదళానికి చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి. ఐఎన్ఎస్ డేగా నుంచి ఒక సీకింగ్ హెలికాఫ్టర్‌లో నౌకాదళ బృందం బయలుదేరి కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతం, నందలూరు ప్రాంత ప్రజలకు 6,600 ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, 3,600 కిలోల రిలీఫ్ మెటీరియల్‌ను అందించారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. కాగా వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కోస్టుగార్డు బృందాలు చురుగ్గా పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లాలో 16 సెం.మీ సగటు వర్షం నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సగటున 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లాలో 14.4 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 12.6, అనంతపురం జిల్లాలో 11.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా 24 మంది మృత్యువాతపడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. 1,532 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 121 చోట్ల రోడ్లకు గండ్లు పడగా, 525 చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 541 చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. 380 చోట్ల చిన్న నీటి వనరులు దెబ్బతిన్నాయి. 33 కేవీ ఫీడర్లు 85, 33 కేవీ స్తంభాలు 137, 11 కేవీ స్తంభాలు 1307, ఎల్టీ స్తంభాలు 1753, 11 కేవీ ఫీడర్లు 592, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 82 దెబ్బతిన్నాయి. 33 పంచాయతీ రోడ్లు 121 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. తక్షణ అవసరాల కోసం నాలుగు జిల్లాలకు రూ.7 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సహాయక శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. -
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ
కృష్ణా: కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నందున.. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2.57 లక్షలు, ఔట్ ఫ్లో 2.57 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు(మంగళవారం) సాయంత్రానికి వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక శ్రీశైలం ఇన్ ఫ్లో 4.35 లక్షలు, ఔట్ ఫ్లో 4.68 లక్షల క్యూసెక్కులు. అలాగే సాగర్ ఇన్ ఫ్లో 3.72 లక్షలు, ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులు. కాగా పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
బిహార్‌లో వరద బీభత్సం: 21 మంది మృతి
పాట్నా : బిహార్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. నేపాల్‌లోని నదుల నుంచి బిహార్‌కు నీరు పోటెత్తడంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో గురువారం కొత్తగా ఇద్దరు మృతి చెందడంతో వరదల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 21కు చేరింది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో 69 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఎవతెరపి లేని వర్షాలతో తోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 4.82 లక్షల మందిని ఖాళీ చేయించగా.. వారిలో 12, 239 మందిని ఎనిమిది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. (బిహార్‌కు మరో చేదు వార్త) రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 20కి పైగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఖగారియా జిల్లాలోని బుధి గండక్ నది వెంబడి ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో వరదలు పోటెత్తాయి. అయితే ఆనకట్ట వద్ద మరమ్మత్తు పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని జల వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని సితామార్హి, సుపాల్, షియోహర్, తూర్పు చంపారన్, గోపాల్ గంజ్ సహర్సా, మాధేపుర, మధు బని, సమస్తిపూర్ జిల్లాలు వరద ప్రభావానికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. (భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం) -
గుజరాత్‌కు ‘వాయు’ గండం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్లో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరిక ‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్‌కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్డీఆర్ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది. జామ్‌నగర్‌కు విమానంలో బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు -
ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే!
తిరువనంతపురం: కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. ఓవైపు ఊళ్లకు ఊళ్లు వరదలో మునిగిపోగా.. వరదనీటిలో మునిగి నాలుగైదురోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకా ఉన్నారు. వీరిని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించే పనిలో ఉన్నాయి. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దైన్యంగా ఉంది. సరైన వసతుల్లేకపోవడంతోపాటు తమవారికి క్షేమసమాచారం అందించేందుకు ఏర్పాట్లు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగురోజులపాటు కేరళకు వర్షం రాకపోవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను వెనక్కు తీసుకున్నారు. ఎవరి నోట విన్నా.. ‘మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తామనుకోలేదు. ఇది పునర్జన్మ. నాలుగురోజులుగా పీకల్లోతు నీళ్లలో తిండి తిప్పల్లేకుండా ఉన్నాం. దేవుని దయతో బయటపడ్డాం’ అనే మాటలే వినబడుతున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. చావును కళ్లముందు చూసిన పరిస్థితులనుంచి బయటపడటంతో చాలా మంది ఇంకా షాక్‌లోనే ఉన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వైమానిక, నేవీ బృందాలు పలు ప్రభుత్వ సహాయక బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, పునరావాస కేంద్రాలకు తరలించడంలో బిజీగా ఉన్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 370కి చేరింది. కొనసాగుతున్న సహాయక చర్యలు నాలుగైదు రోజులుగా తినడానికి తిండిలేక.. నీరసించిపోయి మేడలపైనుంచి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నవారిని హెలికాప్టర్లు, పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్, నేవీ, వైమానిక, ఆర్మీ బలగాలు కాపాడాయి. అలప్పుజ, త్రిసూర్, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఇంకా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మొత్తం 370 మంది మృతుల్లో ఒక్క ఇడుక్కి జిల్లా నుంచే 43 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో 28, త్రిసూర్‌లో 27 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. ‘ఇది మాకు పునర్జన్మ. నాలుగురోజులుగా తిండి లేదు నీళ్లు లేవు. మెడ వరకు నీళ్లలోనే భయం భయంగానే నిలబడి ఉన్నాం. ఆర్మీ వాళ్లు కాపాడకపోతే పరిస్థితి వేరోలా ఉండేది’ అని పత్తనంతిట్టలోని ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ మహిళ ఆ భయానక పరిస్థితులను గుర్తుచేసుకుంది. త్రిసూర్ కకావికలం ఎర్నాకులం జిల్లాలోని పరవూర్‌లో చర్చి కుప్పకూలడంతో అక్కడ తలదాచుకుంటున్న ఆరుగురు చనిపోయినట్లు తెలిసింది. ఒక్క త్రిసూర్ జిల్లాలోనే దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ‘త్రిసూర్ జిల్లాలోని కోలే మాగాణి ప్రాంతంలోని 42 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. కరివన్నూర్ నది ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది’ అని కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ వెల్లడించారు. సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కొచ్చిలోని నేవల్ ఎయిర్‌పోర్టును సోమవారం నుంచి తెరవనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్స్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వేల సంఖ్యలో మత్స్యకారులు, స్థానికులు వీరికి సాయం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి చిన్నారులు, మహిళలు, వృద్ధులను ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు కాపాడుతున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. కుంటుంబాన్ని కాపాడి.. తాను బలై త్రిసూర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని రెండ్రోజులక్రితం వరదచుట్టుముట్టింది. ఊరు ఊరంతా మునిగిపోయింది. వరద ఉధృతి గంటగంటకూ పెరగుతుండటంతో ఓ 24 ఏళ్ల యువకుడు తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు నడుంబిగించాడు. ప్రాణాలకు తెగించి తల్లిని, తోబుట్టువులను ఒక్కొక్కరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. తండ్రిని కూడా రక్షించే ప్రయత్నంలో వరద ఉధృతి మరింత పెరిగింది. అతికష్టం మీద తండ్రిని దగ్గరున్న చెట్టును ఎక్కించాడు. కానీ వరదపోటు తీవ్రంగా ఉండటంతో తను కూడా చెట్టునెక్కే ప్రయత్నంలో పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు. కళ్లముందే ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. శనివారం సాయంత్రం ఆ యువకుడి మృతదేహాన్ని ఊరికి సమీపంలోని చెట్ల మధ్య గుర్తించారు. కేరళ వరద బీభత్సంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో ఉన్నాయి. క్షేమంగానే ఉన్నాం కానీ.. సరైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు చెప్పారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా అలువాలోని యూసీ కాలేజీలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో పడుకునేందుకు చాపలు కూడా లేవని వాపోయారు. వయోసమస్యలతో బాధపడుతున్న చాలా మంది వృద్ధులు.. చాపల్లేకుండా చల్లని నేలపై పడుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో మొబైళ్లకు చార్జింగ్ లేక.. తమవాళ్లకు క్షేమసమాచారం తెలపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లినా ఇక్కడున్న ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. చేరుకుంటున్న ‘సాయం’ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితోపాటు.. వరదల్లో చిక్కుకుపోయిన వారికి అందించాల్సిన ఆహారం, పాలు, ఔషధాలు ఒక్కొక్క రాష్ట్రం నుంచి కేరళ చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న మొదటి విడత సాయంలో భాగంగా 129 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల పాలపొడి ఇప్పటికే కొచ్చికి రవాణా అయ్యాయి. మరోవైపు, తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్.. ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర మందులను పంపించింది. దీంతోపాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు 150 ట్రక్కుల లోడ్‌లో బియ్యం ఇతర ధాన్యాలను పంపించాయి. మరోవైపు, పంజాబ్‌లోని పటియాలా, జలంధర్‌ల నుంచి బిస్కట్లు, రస్క్‌లు, తాగునీటి ప్యాకెట్లు విమానం ద్వారా కేరళకు చేరుకున్నాయి. కర్ణాటకలోనూ వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలోనూ భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. వరదల్లో చిక్కుకున్న 3500 మందిని కాపాడాయి. మక్కందూరులో ఓ మహిళ, ఆమె రెండు నెలల చిన్నారిని హెలికాప్టర్ సాయంతో కాపాడారు. అంకెల్లో కేరళ వరద.. మృతులు (జూన్ నుంచి) 370 గత పది రోజుల్లో మృతులు 210 వరద నష్టం అంచనా రూ. 19,512 కోట్లు పంట నష్టం 9,06,400 హెక్టార్లు గేట్లు ఎత్తిన డ్యాములు 35 (మొత్తం డ్యాములు 39) సహాయక శిబిరాలు 5,645 శిబిరాల్లో ఉన్నవారు 7,24,649 బలగాలు రక్షించిన వారు 33,000 కూలిన వంతెనలు, ధ్వంసమైన రోడ్లు 134 సహాయక చర్యల్లో.. ఆర్మీ 10 కాలమ్స్ నేవీ టీమ్స్ 82 కోస్ట్‌గార్డ్ టీమ్స్ 42 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 57 వాడిన హెలికాప్టర్లు 38 రవాణా విమానాలు 20 కేంద్రం పంపినవి బియ్యం 129 మెట్రిక్ టన్నులు పాలపొడి 30 మెట్రిక్ టన్నులు వరద నీటిలో చిన్నారులను భుజాలపై మోసుకెళ్తున్న ఆర్మీ సిబ్బంది అలప్పుజాలో మహిళను రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ నిత్యావసర సరుకుల కోసం మహిళ వేడుకోలు చెంగనూరులో తన వస్తువులతో సహా వరద నీటిని దాటుతున్న వ్యక్తి అందుకోండి సాయం :చెంగనూరులో వరద బాధితులకు హెలికాప్టర్ నుంచి ఆహారపొట్లాలను జారవిడుస్తున్న వైమానిక దళ సిబ్బంది -
పెను గండం
81 కేంద్రాలకు 30,395 మంది తరలింపు ఇంకా తరలించాల్సింది 59,197 మందిని పెనుగాలులకు నేలకొరిగిన చెట్లు ఎగసిపడుతున్న సముద్రపు అలలు కెరటాల ధాటికి హార్బర్లో కూలిన గోడ జిల్లాకు మరో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ హుదూద్ గుప్పెట్లో విశాఖ విలవిల్లాడుతోంది. పెను తుఫాన్ ప్రభావంతో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న కడలి కెరటాలు చెలియలి కట్టదాటి తీరం వెంబడి ఉన్న కట్టడాల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ముందుకు దూసుకువచ్చిన సముద్రంతో బీచ్ అల్లకల్లోలమైంది. సాగర భీకర గర్జనకు మత్స్యకార గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. బలమైన గాలులు వీస్తూ భయకంపితులను చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత హెచ్చడంతో పలుచోట్ల కరెంటు స్తంభాలుపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. హుదూద్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా హైవేలో దాదాపు వాహనాల రాకపోకలను నిషేధించారు. రైలు, బస్సు, విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అనుక్షణం జిల్లా అంతటిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆదివారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటే వేళ పెనుతుఫాన్ మరింత ఉధృత రూపం దాల్చే ముప్పు ఉండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలతో ఉన్నారు. ఈ పెనుగండం దాటేలా చూడాలని గంగమ్మను వేడుకుంటున్నారు. గరిష్ట స్థాయిలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ రూరల్: పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ హుదూద్ విశాఖపైకి దూసుకువస్తోంది. అత్యంత శక్తివంతంగా ‘అల’జడి రేపుతూ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉప్పెనను మోసుకొస్తోంది. ముప్పుకు ముందస్తు సంకేతంగా శనివారం పెనుగాల వర్షంతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోడానికి త్రివిధ దళాలతో పాటు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పరిశ్రమల్లో రాత్రి విధులను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. రవాణా వ్యవస్థను నిలిపివేసింది. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు, పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోటెత్తిన సముద్రం తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. కెరటాల ధాటికి ఫిషింగ్ హార్బర్లో గోడ నేలకూలింది. జిల్లాలో చోలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రధానంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఇక్కడ సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సముద్రం పోటు మీద ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గ స్తీ నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డు మూసివేత పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు. శనివారం ఉదయం నుంచే సందర్శకులను సముద్ర తీరం నుంచి వెనక్కు పంపించారు. శనివారం సాయంత్రం నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి తీర ప్రాంత రోడ్డులో రాకపోకలను పోలీసులు నిషేధించారు. సముద్ర తీవ్రతను చూసేందుకు భారీగా సందర్శకులు బీచ్‌కు వచ్చినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు. నేలకొరిగిన చెట్లు శుక్రవారం రాత్రి నుంచి వీచిన గాలుల ధాటికి జిల్లాలో అనేక చోట్లు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విశాఖకు మరిన్ని బలగాలు హుదూద్ తుపాను విశాఖ పరిసర ప్రాంతాల నుంచి తీరం దాటనుండడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి భారీగా రక్షణ దళాలు విశాఖకు చేరుకున్నాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెండు ఆర్మీ బృందాలు అచ్యుతాపురంలో ఒక పాలిటెక్నిల్ కళాశాలలో మకాం వేశాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీర, తుపాను ప్రభావ మండలాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి, అనకాపల్లి, కశింకోట, మునగపాక, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, కోటవురట్ల, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అధనంగా గజియాబాద్ నుంచి మరో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం విశాఖపైనే అధికంగా ఉంటుందని నిపుణలు అంచనాల మేరకు ఒరిస్సాలో ఉన్న మరో 3 బృందాలు విశాఖకు వస్తున్నారు. మొత్తంగా 12 బృందాలను జిల్లాలో అన్ని మండలాలోను సిద్ధంగా ఉంచుతున్నారు. వీటితో పాటు 30 నేవీ టీమ్‌లు కూడా మండలాలకు చేరుకున్నాయి. మండలాలకు బోట్లు ముంపు ప్రభావిత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బోట్లను తరలించారు. పాయకరావుపేట మండలంలో గజపతినగరం, పెంటకోట గ్రామాలకు ఒక్కో బోటు, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, పెదతీనార్లకు, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపేట, రేవుపోలవరం గ్రామాలకు, అనకాపల్లి, రాంబిల్లి మండలం దిమిలి, నారాయణపురం, మునగపాక మండలం చూచుకొండ, చోడవరం మండలం పి.ఎస్.పేట, యలమంచిలి, కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామాలకు ఒక్కో బోటను సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మరో 10 బోట్లు పంపించారు. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. అతి భారీ వర్షాలు, పెనుగాలులు హెచ్చరికలతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి బంద్ అతిభారీ వర్ష సూచనలతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు శనివారం సాయంత్రం 7 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అత్యవసర వాహనాలు, అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీర ప్రాంత, తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్బన్‌లో 26, రూరల్‌లో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు వారి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారు సైతం తిరిగి కొంత మంది వెనక్కు వచ్చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. శనివారం రాత్రికి 40 వేల మందిని తరలించారు. ప్రతి పునరావాస కేంద్రానికి డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వంటలు చేసి కేంద్రాల్లో ప్రజలకు అందజే స్తున్నారు. సింహాచలం దేవస్థానం వారు 5 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల వద్ద బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లను సిద్ధంగా ఉంచారు. -
మూడు జిల్లాల్లో రెండు లక్షల మంది తరలింపు
హుదూద్ తుఫాను ముంచుకొస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఒడిషాలోని 11 జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని తరలించేశారు. ప్రస్తుతం తుఫాను విశాఖకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని గమనం వేగంగా ఉంది. సహాయ కార్యక్రమాల కోసం 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు రెడీగా ఉన్నాయి. నాలుగు నౌకలు, పది హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఇప్పటికే 250 మంది సైనికులు చేరుకున్నారు. తుఫాను బలహీనపడే అవకాశాలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ టెలికం కంపెనీలు ప్రజలకు ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కంట్రలో రూం ఏర్పాటుచేశారు. దీని నెంబర్లు 040 23456005, 23450419. మొత్తం 200కు పైగా సహాయ శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దుచేశారు. డీజిల్, పెట్రోలు నిల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
శవాలు కుళ్లిపోతున్నాయి..!
- మాలిన్‌లో వ్యాపిస్తున్న దుర్గంధం - ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం - శవపరీక్షలు జరపకుండానే అంత్యక్రియలు జరిపేందుకు యోచన సాక్షి, ముంబై : పుణే జిల్లా అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామ పరిసర ప్రాంతవాసులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా కొండచరియలు విరిగిపడి నాలుగు రోజులు పూర్తికావడంతో శిథిలాల కింద ఇరుకున్నవారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని భావిస్తున్నారు. దీంతో మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, బురద కారణంగా మృతదేహాలను బయటకు తీయడంతోపాటు శవపరీక్షలు జరిపి వారిని గుర్తించడం, అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం తదితర ప్రక్రియలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో మాలిన్ గ్రామం పరిసరాల్లో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోయి అక్కడ తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ దుర్గంధం కారణంగా చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. శిథిలాలను తొలగించే పనులు మరో రెండు మూడురోజులపాటు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుళ్లిన మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధం కారణంగా స్థానికులు రోగాల బారిన పడకుండా ఉండేందుకు శవపరీక్షలు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం శవపరీక్షల కోసం మాలిన్ గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని అడివరె గ్రామానికి తరలిస్తున్నారు. అయితే అక్కడ కూడా శవాలను ఉంచేందుకు సరైన స్థలంలేదు. మరోవైపు శవపరీక్షలు పూర్తిచేసి వారిని గుర్తుపట్టే ప్రక్రియ చాలా జాప్యమవుతోంది. దీంతో శవాలు మరింత కుళ్లి విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో శవపరీక్షలు చేయకుండా మృతులను గుర్తించేందుకు ఫొటోలు, డీఎన్ఎ నమూనాలు సేకరించాలని డాక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం శవపరీక్షల అనంతరం గుర్తించిన వారికి సామూహికంగానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉపగ్రహ చిత్రంలో గల్లంతైన మాలిన్ ... పుణేకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఉపగ్రహం ద్వారా ఫొటోలను తీశారు. ఈ ఫొటోల్లో మాలిన్ గ్రామం కన్పించకుండాపోయింది. మాలిన్ గ్రామం ఉండే స్థానంలో కేవలం బురదతోపాటు ఒకటిరెండు ఇళ్లు కన్పిస్తున్నాయి. 82కు పెరిగిన మృతుల సంఖ్య పుణే: కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మాలిన్ గ్రామంలో మృతుల సంఖ్య శనివారానికి 82కు పెరిగింది. ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ గణేశ్ పాటిల్ తెలిపారు. ఇప్పటివరకు ఎన్డీఆర్ఆఫ్ దళాలు 23 మందిని కాపాడాయని ఆయన చెప్పారు. మట్టిలో సుమారు 200 మంది గ్రామస్తులు, వందలాది పశువులు కూరుకుపోయినట్లు అనుమానిస్తున్నామన్నారు. కాగా, మృతుల్లో 42 మంది మహిళలు, 30 మంది పురుషులు, 10 మంది బాలలు ఉన్నట్లు ఆయన వివరించారు.