జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి | Train Crash in Germany, 4 dead, 150 Injured | Sakshi
Sakshi News home page

జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి

Published Wed, Feb 10 2016 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

Train Crash in Germany, 4 dead, 150 Injured

బాడ్ ఐబ్లింగ్: జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించగా సుమారు 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బవేరియాలోని బాడ్ ఐబ్లింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి ఓవైపు అడవి మరోవైపు నది ఉండటంతో సహాయ సిబ్బంది బోట్లు, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రమాద కారణాలతోపాటు ఆ సమయంలో రైళ్ల వేగం ఎంతో వెంటనే తెలియరాలేదు. అయితే గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిం చేందుకు రైళ్లకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెప్పారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement