పోలీస్‌ కారునే దొంగతనం చేయబోయి..చావు అంచులదాక వెళ్లొచ్చాడు! | US Cops Rescue Man From Stolen Police Car Before Train Crashes | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కారునే దొంగతనం చేయబోయి..చావు అంచులదాక వెళ్లొచ్చాడు!

Published Tue, Jan 31 2023 3:42 PM | Last Updated on Tue, Jan 31 2023 3:42 PM

US Cops Rescue Man From Stolen Police Car Before Train Crashes  - Sakshi

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్నే దొంగలించేందుకు యత్నం చేశాడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యుముఖం వరకు వెళ్లి త్రుటిలో బయటపడ్డాడు. ఈ అనుహ్య ఘటన యూఎస్‌లోని అట్లాంటాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని అట్లాంటాలో ఓ వ్యక్తి పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును దొంగలించే సాహసం చేశాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్‌ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అంతేకాదు ఒక పక్క కారుని ట్రేస్‌ చేస్తూ ఫాలో చేయడం ప్రారంభించారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్‌ల సాయంతో కూడా ఛేజ్‌ చేస్తున్నారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలికిందులగా పడిపోయింది.

ఐతే అదే సమయంలో అనుహ్యంగా ఒక రైలు స్పీడ్‌గా వస్తోంది. అంతే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆ నిందితుడిని బయటకు లాగి రక్షించిన కొద్ది నిమిషాల్లోనే రైలు ఆ కారుని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. నిందితుడు మాత్రం కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని రక్షించడమే గాక అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 
 

(చదవండి: విమానంలో ప్రయాణకురాలి వీరంగం..సిబ్బందిని హడలెత్తించేలా కొట్టి, ఉమ్మి వేసి...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement