steals
-
హనుమాన్ టెంపుల్లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..
ఛండీగఢ్: హనుమాన్ దేవాలయంలో ఓ దొంగ రూ.10 దేవునికి సమర్పించి రూ.5000 దోచేశాడు. ఈ ఘటన హర్యానా రేవారి జిల్లాలోని ధరుహేరా పట్టణంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మొదట గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ.. హనుమంతుని పాదాల చెంత చేరి ప్రార్థన చేశాడు. పూజారి ముందే 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీషా చదువుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రార్థన అనంతరం చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ తాళాని పగులగొట్టాడు. రూ.5000 చోరీ చేశాడు. దోపిడీ జరిగిందని గుర్తించని పూజారి గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా.. అసలు విషయం బోధపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది
ఆక్టోపస్‌లకు సంబంధించిన విషయాలు కాస్త ఆసక్తికరంగానే ఉంటాయి. అవి ఏ వస్తువునైన వాటి కాళ్లతో గట్టిగా అదిమ పట్టేస్తాయి. అలానే ఓసారి ఒక అమ్మాయి..ఆక్టోపస్‌ని పట్టుకుని సరదాగా కామెడీ చేయబోగా ఏకంగా తన ముఖాన్నే గట్టిగా పట్టకుని..ఆ అమ్మాయిని ఏడిపించేసిన ఘటన తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఓ యువకుడిని ఇబ్బంది పెట్టింది. 15 ఏళ్ల జెస్సీ లోఫెల్ జెర్విస్ బోడెరీ నేషనల్ పార్క్‌లోని న్యూసౌత్ వేల్స తీరంలో స్నార్కెలింగ్(నీటి అడుగున ఈత కొట్టడం) చేస్తున్నాడు. నీటి అడుగున ఉండే అందాలను తన ప్రో కెమరాతో చక్కగా బంధిస్తున్నాడు. ఇంతలో అక్కడే సంచరిస్తున్న ఆక్టోపస్‌ని చూసి..దానికి దూరం నుంచే షూట్ చేస్తున్నాడు. ఇంతలో అది సడెన్ ఆ యువకుడి ప్రో కెమెరాను లాక్కుంది. దానికి ఉండే సెల్ఫీ స్టిక్‌ని గట్టిగా పట్టుకుని ఆ కెమారాను లాక్కుంది. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు దాని నుంచి ఆ కెమెరాను లాక్కునేందుకు చాలాసేపు ట్రై చేసి..చివరికి వదిలేశాడు. ఆ తర్వాత అక్కడే నీటి అడుగున స్నార్కెలింగ్ చేస్తూ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ మేరీ క్లౌట్ని సంప్రదించాడు. దీంతో ఇద్దరు కలిసి అదే స్థానంలో నీటి అడుగుకి వెళ్లేటప్పటికి అదృష్టవశాత్తు ఆ ఆక్టోపస్ అక్కడే ఉంది. దీంతో క్లౌట్ కెమెరా తీసేందుకు యత్నించాడు. ఐతే ఆక్టోపస్ కెమెరాను వదిలే మూడ్‌లో లేదు. అది ఆ కెమెరాను చాలా గట్టిగా పట్టుకుంది. ఏం చేసిన వదలటం లేదు. చివరికి క్లౌట్ ఆ సెల్ఫీ స్టిక్‌తోనే ఆక్టోపస్‌ని పైకి లాగి విదిలించడంతో అది ఇక ఇవ్వక తప్పదన్నట్లు.. వదిలేసి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన అమేజింగ్ వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చిట్టడవిలో ఓ భూత్‌బంగ్లా..లోపలికి అడుగుపెడితే..) -
పోలీస్ కారునే దొంగతనం చేయబోయి..చావు అంచులదాక వెళ్లొచ్చాడు!
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే దొంగలించేందుకు యత్నం చేశాడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యుముఖం వరకు వెళ్లి త్రుటిలో బయటపడ్డాడు. ఈ అనుహ్య ఘటన యూఎస్‌లోని అట్లాంటాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని అట్లాంటాలో ఓ వ్యక్తి పోలీస్ పెట్రోలింగ్ కారును దొంగలించే సాహసం చేశాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అంతేకాదు ఒక పక్క కారుని ట్రేస్ చేస్తూ ఫాలో చేయడం ప్రారంభించారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్ల సాయంతో కూడా ఛేజ్ చేస్తున్నారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలికిందులగా పడిపోయింది. ఐతే అదే సమయంలో అనుహ్యంగా ఒక రైలు స్పీడ్‌గా వస్తోంది. అంతే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆ నిందితుడిని బయటకు లాగి రక్షించిన కొద్ది నిమిషాల్లోనే రైలు ఆ కారుని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. నిందితుడు మాత్రం కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని రక్షించడమే గాక అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Dramatic body camera footage shows Atlanta police saving a suspect from an oncoming train at the last minute. Police chased a man who stole a patrol vehicle while an officer was conducting a traffic stop, but was halted when the suspect crashed the car onto train tracks. pic.twitter.com/7r4MmfIjFp — Newsweek (@Newsweek) January 30, 2023 (చదవండి: విమానంలో ప్రయాణకురాలి వీరంగం..సిబ్బందిని హడలెత్తించేలా కొట్టి, ఉమ్మి వేసి...) -
Video: మహిళ చేతివాటం.. అందరి ముందే రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది
లక్నో: ఒక మహిళ బ్లాక్ కళ్లజోడు, మాస్కో ధరించి ఒక జ్యూవెలరీ షాపుకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ షాపు కూడా కస్టమర్లతో చాలా బిజీగా ఉంది. దీంతో ఆ మహిళ ఇదే అవకాశం అనుకుందో ఏమో గానీ ఆ షాపు అతనితో నెక్లెస్ మోడళ్లను చూపించమంది. దీంతో అతను రకరకాల మోడల్స్‌ను చూపించాడు. ఆమె తెలివిగా ఒక మోడల్ నెక్లెస్‌ని చూస్తున్నట్లుగా పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్‌ని క్లోజ్ చేసి ఆ బాక్స్‌పై తాను చూస్తున్న నగ బాక్స్‌ని పెట్టింది. ఆ తర్వాత షాపు వాడు గమనించడం లేదనుకుని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన వొడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్‌ని చీర మడతల్లో తెలివిగా దాచింది. ఆ తర్వాత తనకు ఏం నగలు నచ్చలేదున్నట్లుగా కామ్‌గా పైకి లేచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న షాపు అతను ఆమె ఏం కొనక్కుండా ఎందుకలా వెళ్లిపోతుంది అని కూడా అనుమానించ లేదు. ఆమె మాత్రం భలే గమ్మత్తుగా రూ. 10 లక్షలు ఖరీదు చేసే చెవి పోగోలు తోపాటుగా ఉన్న నెక్లెస్ బాక్స్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటన నవంబర్ 17న గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేమండి. (చదవండి: చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్: మండిపడుతున్న నెటిజన్లు) -
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
టార్గెట్ సెల్‌ఫోన్స్ ! ఏటా వేల సంఖ్యలో గల్లంతు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి. కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు... రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల పిక్పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ.... ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. పెండింగ్ భయంతోనే అధికం... జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు. (చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్) -
అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది. అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా -
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులు గోవాకు.. పెద్ద కుమార్తె ఇంటికే కన్నం
చిలకలగూడ: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడిని తిరగరాశారు చిలకలగూడ పోలీసులు. కన్న ఇంటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కూతురితోపాటు ఆమెకు సహాయపడిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు. రూ. 5.50 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. జామై ఉస్మానియా అంబర్‌నగర్‌కు చెందిన ఇఫ్తార్ రాణికి అయిదుగురు కుమార్తెలు. పెద్దకుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం ప్రేమ వివాహం చేసుకుని భర్త, పిల్లలతో కలిసి బ్రాహ్మణ బస్తీలో నివసిస్తున్నారు. ఇఫ్తార్‌రాణి తన మనవడి పుట్టినరోజు వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించాలని భావించి కుమార్తెలు, అల్లుళ్లు, వారి పిల్లలను ఆహ్వానించారు. పెద్ద కుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం గోవాకు రానని చెప్పడంతో ఇంటికి తాళం వేసి ఇఫ్తార్‌రాణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3న గోవా వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పెద్ద కుమార్తె కన్న వారింట్లో చోరీ చేసేందుకు పథకం వేసింది. రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్ ఫరూఖీ సహాయంతో ఇంటి తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారు, 70 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసింది. ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయనే సమాచారం మేరకు గోవాలో ఉన్న ఇఫ్తార్‌రాణి తన బంధువు బర్ల శ్రీకాంత్‌తో ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించి పలు ఆధారాలు సేకరించి పెద్దకుమార్తె మేరీ అలియాస్ మెహర్‌బేగం నిందితురాలిగా గుర్తించారు. నిందితురాలు మెహర్బేగంతో పాటు ఆమెకు సహకరించిన ముషీరాబాద్ హరినగర్, రామ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్ ఫరూఖీను అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి చోరీ మిస్టరీని చేధించిన చిలకలగూడ సీఐ నరేష్, డీఎస్ఐ సాయికృష్ణ, క్రైం కానిస్టేబుళ్లు ప్రకాశ్, మజర్, వసీ, వినయ్, ఆంజనేయులు, నాగేశ్వరరావును నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్సింగన్వార్, గోపాలపురం ఏసీపీ సుధీర్‌లు అభినందించి ప్రోత్సాహకాలు ప్రకటించారు. -
బిర్యానీకి వెళ్తే రూ.2 లక్షలు మాయం
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): హోటల్లో బిరియానీ తినేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. బ్యాడరహళ్ళిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఆటోడ్రైవర్ హనుమంతరాయ కుటుంబ అవసరాల కోసం బ్యాంక్‌లో బంగారు నగలు పెట్టి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిని బైక్ సైడ్ బాక్సులో పెట్టుకొని బావమరిదితో కలసి ఇంటికి వెళుతున్నాడు. దారిలో బిరియాని హోటల్ వద్ద బైక్ ఆపి ఇద్దరూ వెళ్లి ఆరగించారు. వచ్చి చూడగా బాక్సులోని నగదు మాయమైంది. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకెళ్లినట్లు రికార్డయింది. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం గాలిస్తున్నారు. -
దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి.. రూ.85 లక్షలతో పరార్
ఖైరతాబాద్: నమ్మకంగా వాచ్‌మన్‌గా చేరిన దంపతులు అర్ధరాత్రి వృద్ధ దంపతులను బంధించి రూ.85 లక్షలు విలువచేసే నగదు, నగలు, డైమండ్ ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వస్త్ర వ్యాపారం చేసే ఓం ప్రకాష్ ఆగర్వాల్, అతని భార్య సంతోష్ ఆగర్వాల్ చింతలబస్తీ, హిల్ కాలనీలో శ్రీవీన్ హౌస్‌లో నివాసముంటున్నారు. ఇదే అపార్ట్మెంట్లో వీరి కోడలు, మనవడు స్వప్న, యజ్ఞ ఉంటుండగా, కొడుకు విదేశాల్లో ఉంటున్నారు. 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు దీపేష్(23), అనిత శశి అలియాస్ నిఖిత(21).. వీరి అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా చేరారు. అప్పటి నుంచి వీరి కదలికలను పక్కగా గమనించిన వాచ్‌మన్ దంపతులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత పథకం ప్రకారం 4వ అంతస్తులో పడుకున్న వృద్ధ దంపతులు ప్రకాష్, సంతోష్ ఆగర్వాల్ వద్దకు వెళ్లారు. వారిని నిద్రలేపి లోపలికెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుప రాడ్‌తో దాడిచేశారు. బీరువా తాళాలు తీసుకొని నగదు, బంగారు, డైమండ్ ఆభరణాలు తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత కట్లను విడిపించుకున్న సంతోష్ అగర్వాల్ ఐదో అంతస్తులో నిద్రిస్తున్న యజ్ఞను లేపి విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.40 లక్షలు విలువచేసే డైమండ్ జ్యువెలరీ, 40 లక్షల విలువైన బంగారు, సిల్వర్ ఆభరణాలతోపాటు 5 లక్షల నగదు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫాబాద్ డీఐ రాజునాయక్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. బయటి వ్యక్తులు మరో నలుగురు ఈ చోరీలో పాల్గొన్నట్లు గుర్తించారు. -
ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న కిరాణం సరిగా నడవలేదు. వచ్చిన డబ్బు జల్సాలు, కుటుంబ పోషణకు సరిపోలేదు. దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. కారులో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నాడు. ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన దొంగను మంచిర్యాల పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రూ.9.21లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్‌మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. అయిన వాళ్లు ఎవరూ చేరదీయకపోవడంతో కొరటిపాడు పట్టణంలోని కిరాణ దుకాణంలో నెల జీతానికి కొంతకాలం పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా కిరాణం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించాడు. దుకాణం సరిగా నడవకపోవడం, జల్సాలకు అలవాటు పడడం, వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో, బైక్ దొంగతనాలు చేశాడు. 2008 రాజమండ్రి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. అక్కడ కొందరితో పరిచయాలు ఏర్పర్చుకుని విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 2009లో పోలీసులు మరోసారి నెల్లూరు సెంట్రల్‌జైలుకు పంపించారు. ఆరు నెలల జైలు శిక్షణ అనంతరం దొంగతనాలకు పాల్పడగా.. తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 71, కర్ణాటకలో 4, కేరళలో 1, తమిళనాడు రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన వెంకయ్య జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, కరీంనగర్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. కారులోనే చోరీ సొత్తు వెంకయ్య ఉరఫ్ వెంకటేష్ ఒక్కడే లేదా జైల్లో పరిచయమైన దొంగ స్నేహితులతో కలిసి కారులో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. కారులో కత్తులు, వేటకొడవళ్లు, స్క్రూడైవర్, ఇనుప రాడ్లు ఉండవి. ఎవరైనా అడ్డుకుంటే వాటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. చోరీ సొత్తును కారులోనే దాచి ఉంచుతూ పెద్దమొత్తంలో ఒకేసారి విక్రయించేవాడు. సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు. దొంగతనానికి వెళ్తూ.. చోరీ సొత్తును కారులోనే ఉంచి బెల్లంపల్లిలో మరో దొంగతనానికి కారు (ఏపీ28డీఎం 6110)లో వెళ్తుండగా ఏసీసీ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. 424.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 9.21లక్షలు ఉంటుందని, ఐదు వేట కొడవళ్లు, రెండు కత్తులు లభించాయని ఏసీపీ వెల్లడించారు. మంచిర్యాల సీసీఎస్ పోలీసులు, స్థానిక సీఐ నారాయణ్‌నాయక్, సీసీఎస్ సీఐ, ఎస్సైలను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి..
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చిన ఒక మహిళ.. మరో మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.65 వేల రూపాయాలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడ నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్‌లో డబ్బులు కన్పించపోవడంతో కంగారుగా వేతికింది. ఈ క్రమంలో బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడో తెలిస్తే.. షాక్ అవుతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్ డెలివరీ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగింది. ఒక క్లిక్‌తో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని ఎంచెక్కా లాగించేయడం సర్వ సాధారణమైపోయింది. అదే సందర్భంలో డెలివరీ ప్రతినిధులు కస్టమర్ ఆహారంకోసం కక్కుర్తి పడటం, ఆహారాన్ని దొంగిలిండం లాంటి షాకింగ్ వీడియోలు ఇటీవల ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బ్యాక్‌యార్డ్ స్టేట్ కంబైన్ యూ ట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం అందించలేదు. సుమారు 185 వేలకు పైగా వ్యూస్, కమెంట్లతో దూసుకుపోతోంది. ఉబెర్ ఈట్స్‌కు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలనుంచి ఆహారాన్ని దొంగిలించడం కెమెరాకు చిక్కింది. వరుసగా ఒక్కో డబ్బా ఓపెన్ చేసి, దాంట్లో ఉన్న ఫుడ్‌ను చేత్తో తీసి పక్కన ఉన్న తన డబ్బాలో వేసుకుంటూ పట్టుబడ్డాడు. ఏమీ తెలియనివాడిలాగా మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ తన పనికానిచ్చాడు. చివరికి సూప్ బాక్స్నుకూడా వదల్లేదు. అలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తైన తర్వాత, అతను స్టాప్లర్ సహాయంతో బ్యాగ్‌ని రీసీల్ చేశాడు. దీనిపై యూజర్లు విభిన్నంగా స్పందించారు. మన దృష్టిలో పడనివి ఇలాంటివి చాలానే ఉంటాయంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "డ్యూడ్ బహుశా అతను ఆకలితో ఉన్నట్టున్నాడు" మరి కొందరు కమెంట్ చేస్తున్నారు. -
మాజీ ఆర్మీ జవాన్ బాగోతం.. మహిళతో పరిచయం.. అది కాస్తా..
సాక్షి, భూపాలపల్లి(వరంగల్): అతనో ఆర్మీ జవాన్. హత్య చేసి జైలుకు పోవడంతో ఉద్యోగం పోయింది. కట్టుకున్న భార్య విడాకులు ఇచ్చింది. దీంతో జల్సాలకు అలవాటుపడిన అతడు డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల భూపాలపల్లి మండలంలో రెండు చోట్ల చోరీలకు పాల్పడి మంగళవారం పోలీసులకు చిక్కాడు. నిందితుడి అరెస్ట్ వివరాలను భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు వివరించారు. జయశంకర్ భపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం రేగులగూడెం జీపీలోని చల్లపల్లికి చెందిన చల్ల మహేష్ 2004లో ఆర్మీలో చేరాడు. 2011లో సెలవులో వచ్చేటప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్లో కేసముద్రంకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత ఆ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. అదే ఏడాది వారిద్దరి మధ్య గొడవ కావడంతో కేసముద్రంలోని మహిళ ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. అయితే మహేష్ ప్రవర్తన నచ్చక భార్య విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడడంతో చోరీలు చేయాలని భావించాడు. 2011 నుంచి చెల చెల్పూరు, గోదావరిఖని, ఎన్టీపీసీ, కరీంనగర్, చెన్నూరు, హన్మకొండ, రామగిరి, మంథని పట్టణాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇట్టి కేసుల్లో పలుచోట్ల పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. 2021 మార్చిలో కొయ్యూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కొండంపేటలో ఒక ఇంట్లో చోరీ చేశాడు. ఆ సొత్తును వరంగల్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తికి రూ. 40 వేలకు అమ్మాడు. గత నెల జూలై 29న మధ్యాహ్నం భూపాలపల్లి మండలంలోని వెరంచపల్లిలో దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. మరుసటి రోజున ఇదే మండలంలోని కమలాపూర్‌లో ఓ ఇంట్లో చోరీ చేశాడు. దొంగిలింన నగదు, సొత్తుతో విజయవాడకు వెళ్లి బతుకుదామని మంగళవారం భూపాలపల్లి బస్టాండ్‌కు వచ్చాడు. సవచారం అందుకున్న సీఐ ఎస్ వాసుదేవరావు పోలీసు సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. నిందితుడి నుండి 3తులాల నెక్లెస్, జత వెండి పట్టా గొలుసులు, రూ.2,10,000 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ ఎస్ వాసుదేవరావు, పరిశోధనకు సహకరింన ఎస్సైలు అభినవ్, నరేష్, రైటర్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు హరి, వేణు, నవీన్, జితేందర్‌లను ఏఎస్పీ అభినందించారు. -
యువ ఇంజనీర్ నిర్వాకం.. బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకోవాలని..
న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకొని తమ రిచ్‌నేస్‌ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్ పార్క్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటం.. బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్‌ప్లేట్‌లేని బైక్‌తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్ అని.. షాహదారాలోని జ్యోతి నగర్లో ఉంటానని తెలిపాడు. కాగా, బీఎస్ఈఎస్లో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్‌పై పలు సెక్షన్ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
సీసీ కెమెరాలను పైకి తిప్పేసి.. దర్జాగా దోచుకుపోయాడు..
సాక్షి, సత్తుపల్లి: సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి..ఓ దొంగ దోచుకున్న తీరు సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్లోని చిన్నా సెల్ వరల్డ్ షాపులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ.6.50 లక్షల విలువైన సెల్ఫోన్లను అపహరించాడు. ఆగంతకుడు అర్ధరాత్రి 1.23 గంటలకు మొదటి అంతస్తు లోపల నుంచి కిందకు దిగి ఒక వైపు తాళం వేసిన ఉన్న షట్టర్‌ను చాకచక్యంగా తెరిచి 1.26 గంటలకు లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత షాపులోని సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు. సుమారు 40 నిమిషాలకుపైగా షాపులో ఉన్న ఆగంతకుడు షో కేసుల్లోని బ్రాండెడ్ సెల్ఫోన్లు మాత్రమే ఎంపిక చేసుకొని ఎత్తుకెళ్లాడు. అయితే, షట్టర్‌పైన ఉన్న సీసీ కెమెరాను గమనించకపోవటంతో ఆగంతకుడి కదలికలన్నీ రికార్డు అయ్యాయి. ఎత్తుగా, సన్నగా ఉండి తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్ ధరించి ఉండడాన్ని పుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే వచ్చిందా ఒకరా, ఇద్దరా అనేది తేలడం లేదు. కాగా, చోరీ జరిగిన సెల్ పాయింట్‌ను కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్ గురువారం ఉదయం పరిశీలించారు. అలాగే, ఖమ్మం నుంచి ప్రత్యేక క్లూస్‌టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించారు. యజమాని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సుమారు 6.50 లక్షల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. -
వ్యాపారం అచ్చిరావట్లేదని.. ఇంటర్నెట్లో చూసి బైక్‌లను..
సాక్షి, కరీంనగర్: వృత్తి, వ్యాపారం అచ్చిరాక పోవడంతో అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్ చూశాడు.. ఒక ఛానల్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఎలా తీయాలో నేర్చుకున్నాడు. కరీంనగర్ కమిషనరేట్‌లో పలు ప్రాంతాల్లో 12 బైక్‌లను దొంగతనం చేసి, చివరికి పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ టౌన్ డివిజన్ డాక్టర్ పి.అశోక్ తన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్(33) అలియాస్ జల్సా ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. 2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్లో వివాహం చేసుకొని, 2012 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత గుండి ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్, కారు, వివిధ వాహనాలు నడిపాడు. 2020 జనవరిలో గోపాల్రావుపేటలో ఆటోస్టోర్ పెట్టుకున్నాడు. లాక్డౌన్ వల్ల నష్టం రావడంతో షాపు తీసేసి, కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్ మంకమ్మతోటలో భార్య, కుమారుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరగడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఏ విధంగా తీయాలో నేర్చుకొని, కరీంనగర్ టూటౌన్ పరిధిలో 9, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి నామాపూర్‌లలో 3 బైక్‌లు దొంగిలించాడు. నంబర్ ప్లేట్లు తీసేసి, తన స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌ను మంగళవారం పద్మనగర్ బైపాస్‌రోడ్డులో అరెస్టు చేశారు. అతడు, అతని స్నేహితుల వద్ద ఉన్న 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, పవన్‌లను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
మాస్క్ చాటున మోసం.. తాగేందుకు మంచి నీళ్లు అడిగి..
సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం): ఈ కరోనా కాలంలో అందరూ మాస్క్‌లు ధరించడం సహజమవడంతో.. ఓ మోసగాడు దొంగ తెలివి ప్రదర్శించాడు. సిద్ధారం గ్రామానికి చెందిన గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన చికెన్ సెంటర్ వద్దకు మాస్క్ ధరించిన గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తనకు రూ.7వేలకు రూ.100, రూ.50 నోట్ల చిల్లర కావాలని అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ వెనుకనే ఆయన ఇంటి గుమ్మం వద్దకు వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపి అనుమానం రాకుండా చేశాడు. చిల్లర తీసుకున్నాక.. తాగేందుకు మంచినీళ్లు కావాలని అడగటంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా ఈ మోసగాడు తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే పరారయ్యాడు. కాసేపటికే నీళ్ల గ్లాసుతో బయటికొచ్చిన లక్ష్మీనారాయణ మోసపోయినట్లు గ్రహించి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాడు. అతను ద్విచక్రవాహనంపై వచ్చినట్లు పుటేజీ లభ్యమైంది. అయితే.. వేసుకొచ్చిన ఫ్యాషన్‌ప్రో బండికి ముందు, వెనుక నంబర్ ప్లేట్లు లేవు. దీంతో తనలా మరొకరు మోసపోకూడదని ఆ దృశ్యాలను, మోసపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడు గుళ్లపల్లి లక్ష్మీనారాయణ కుమారుడు వెంకట్రామయ్య మాస్క్ మాటున జరిగిన మోసాన్ని పోస్టు చేసిన వెంటనే మరి కొందరు బయట పడ్డారు. తమకు కూడా ఇదే తరహాలో మోసం చేశాడని బాధితులు వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. నిందితుడు సత్తుపల్లి, కాకర్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. మాస్క్ పెట్టుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. -
వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): వృద్ధురాలిని ఏ మార్చి నగలు కాజేసిన దుండగుల ఉదంతం హడ్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు– బాగలూరు రోడ్డులోని రెయిన్‌బౌ కాలనీకి చెందిన ఉషా(62) బుధవారం సాయంత్రం అదే ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు. ఈ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని, వంటిపై నగలు భద్రపరిచి ఇస్తామని నమ్మబలికి కాగితంలో చుట్టినట్లు నటించి ఖాళీ కాగితం ఉండను అందజేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధురాలికి కాగితం ఉండలో నగలు కనిపించలేదు. దీంతో హడ్కో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: కట్టుకున్న భార్య మంత్రాలు చేస్తుందనే అనుమానం.. దీంతో.. -
మరికొద్ది గంటల్లో పెళ్లి, 5 తులాల నగలతో ఉడాయించిన కోతులు
సాక్షి, నర్సాపూర్(మెదక్): పెళ్లికి వెళ్లాలన్న హడావిడిలో ఐదు తులాల నగలను కోల్పోయిన ఉదంతమిది. శనివారం నర్సాపూర్ పట్టణానికి చెందిన బాధితుడు వడ్ల నర్సింలు స్థానిక విలేకరులతో మాట్లాడి తన బాధను వివరించారు. ఈ నెల 23న తన మేనకోడలు వివాహం మండలంలోని ఆద్మాపూర్ గ్రామంలో ఉండగా అదే రోజు ఉదయం తాను వెళ్లేందుకు పెళ్లికూతురుకు చెందిన రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే ఐదు తులాల బంగారు నగలు ఒక కవరులో పెట్టి దానిని దుస్తుల సంచిలో పెట్టుకుని బైక్‌పై బయలు దేరానని చెప్పారు. కొంత దూరం వెళ్లాక మరికొన్ని వస్తువులు గుర్తుకురావడంతో వెనుదిరిగి వచ్చినట్లు చెప్పారు. బైక్‌ను ఇంటికి కొద్దిదూరంలో నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి కోతులు బైక్‌పై ఉన్న కవర్‌ను చిందర వందర చేశాయన్నారు. హడావిడిలో దుస్తుల కవర్‌ను సర్దుకొని ఆద్మాపూర్‌కు వెళ్లిన తర్వాత బంగారు నగల కోసం సంచిలో పరిశీలించగా అందులో లేవని తెలిపారు. దీంతో రెడిమేడ్ నగలతో పెళ్లి జరిపించామని నర్సింలు చెప్పారు. కోతులు బంగారు నగల కవరును ఎత్తుకుపోయి కవరును చించితే ఆ ముక్కలు దొరికేవని, చుట్టుపక్కల వెతికినా జాడా దొరకలేదని ఆయన చెప్పారు. 24న తమ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా తాను బైక్‌పై వెళ్లగానే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అక్కడికి వచ్చి తచ్చాడారని, వారిపైన అనుమానంగా ఉందని నర్సింలు అన్నారు. 25న స్థానిక ఎస్ఐ గంగరాజుకు జరిగిన ఘటనను వివరించగా నీ అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పారని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా సంబధితశాఖ అధికారిని పిలిపించి మాట్లాడగా ఆ అధికారి తమ సిబ్బంది నగలు ఎత్తుకుపోలేదని చెబుతూ నన్నే అనుమానిస్తూ మాట్లాడారని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వివరణ.. వడ్ల నర్సింలు బంగారు నగలు పోగొట్టుకున్న విషయాన్ని స్థానిక ఎస్ఐ గంగరాజుతో ప్రస్తావించగా అతను అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పానన్నారు. నగలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందని ఆయన చెప్పారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని -
చంద్రుడిపై శృంగారం కోసం రూ.150 కోట్ల విలువైన దొంగతనం
వాషింగ్టన్: కొందరు చేసే తింగరి పనులు చేస్తే ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇతగాడికి చంద్రుడి మీద శృంగారం చేయాలనే కోరిక కలిగింది. అందుకోసం అతడి చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. థాడ్ రాబర్ట్స్ 2002 లో అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్ నాసా ఇంటర్న్‌షిప్ చేశాడు. అతడి గర్ల్‌ఫ్రండ్ టిఫాని ఫ్లవర్స్ కూడా అక్కడే ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ క్రమంలో వారికి ఓ వింత కోరిక కలిగింది. చంద్రుడి మీద శృంగారం చేయాలని భావించారు. ఇది సాధ్యం కాదని వారికి తెలుసు. దాంతో నాసా అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి భూమి మీదకు తీసుకువచ్చిన రాళ్లపై వారిపై కన్ను పడింది. ఎలాగైనా వాటిని దొంగిలించి.. తమ బెడ్ మీద పెట్టుకుని.. వాటిపై పడుకుని.. తమ కల నేరవేర్చుకోవాలని భావించారు. ఈ క్రమంలో మరో స్నేహితుడితో కలిసి.. తన ఐడీలతో అర్థరాత్రి పూట బిల్డింగ్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లను దొంగతనంగా తమ గదికి తీసుకెళ్లి.. వారి కోరిక తీర్చుకున్నారు. ఇక ఈ రాళ్లకు చాలా విలువ ఉంటుంది. మూన్ రాక్ ఒక్కగ్రాము ధర 5 వేల డాలర్లు(3,75,013 రూపాయలు) పలుకుతుంది. ఇక వీరు దొంగతనం చేసిన శాంపిల్ ఖరీదు 21 మిలియన్ డాలర్ల(157,69,24,650 రూపాయలు) విలువ చేస్తుంది. ఓ బెల్జియన్ ఔత్సాహిక ఖనిజ శాస్త్రవేత్త ఈ మూన్ రాక్‌ని కొనడానికి ఉత్సాహం చూపాడు. అయితే వీరి ప్రయత్నానికి నాసా బ్రేక్ వేసింది. మూన్ రాక్స్ దొంగిలించబడినవి అని గుర్తించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ చేయగా రాబర్ట్స్, అతడి బ్యాచ్ చేసిన నిర్వాకం గురించి తెలిసింది. వీరిపై పోలీసు కేసు నమోదు చేశారు. కోర్టు రాబర్ట్స్‌కి ఎనిమిదేళ్ల శిక్ష విధించింది. ఇక జైలులో ఉన్న కాలంలోరాబర్ట్స్ భౌతికశాస్త్రం, మానవ శాస్త్రం, తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు అతడి వయసు 44 సంవత్సారు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ కంపెనీలో అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి! -
కోతి ఎంత పని చేసింది.. వీడియో వైరల్
సాక్షి, కాన్పూర్ : కాన్పూర్‌లోని ఒక టోల్ బూత్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. టోల్‌బూత్‌లోకి చొరబడిన ఒక కోతి అక్కడున్నగల్లా పెట్టెలోని డబ్బులను చాలా ఒడుపుగా లాక్కుపోయింది. ఏప్రిల్ 25న కాన్పూర్ డిహత్ ప్రాంతంలోని బారా టోల్ ప్లాజాలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజిలోని వీడియో ప్రకారం.. టోల్ బూత్ వద్ద ఒక తెల్ల కారు ఆగింది. ఒక కోతి దాని నుండి దూకి.. విండోంలోంచి బూత్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉద్యోగి భుజం మీద నుంచి దర్జాగా నేరుగా క్యాష్ బ్యాక్స్‌లో ఉన్న నగదును లాక్కుని ఉడాయించింది. ఏం జరుగుతోందో అక్కడున్న అపరేటర్కి అర్థమయ్యేలోపే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. దీనిపై టోల్ మేనేజ్మెంట్ సీనియర్ అధికారి మనోజ్ శర్మ మాట్లాడుతూ.. కోతి ఎత్తుకెళ్లిన సొమ్ము మొత్తం 5 వేల రూపాయలని చెప్పారు. ఈ విషయంలో కోతికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వుంటారని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తాజా ఘటనపై ఫిర్యాదు నమోదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కారు డ్రైవర్ వాదిస్తున్నారు. -
కోతి ఎంత పనిచేసింది.. వీడియో వైరల్..
-
స్మార్ట్ఫోన్లే టార్గెట్‌గా...
వాషింగ్టన్ : ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా గూగుల్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్న షాకింగ్ న్యూస్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు తమ రూటు మార్చి మొబైల్ ఫోన్ల ను తమ టార్గెట్ గా ఎంచుకున్నట్టు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించబడిన గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్)కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్టు భద్రతా పరిశోధకులు బుధవారం చెప్పారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం గూలిగాన్ అనే మాల్వేర్ తో గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే ఆండ్రాయిడ్ 4.0 , 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా హ్యాకర్లు దాడికి దిగుతున్నారు. తద్వారా లక్షలమంది వినియోగాదారుల జీమెయిల్స్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని బాంబు పేల్చింది. సాధారణంగా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్న సందర్భంలోనూ, లేదా ఫిషింగ్ మేసెజెస్, హానికరమైన లింక్ లు, మెసేజ్ లను క్లిక్ చేయడం ద్వారా ఈ దాడి ప్రారంభమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆగస్టులో ప్రవేశపెట్టిన గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా రోజుకు 37 వేల డివైస్ లు హ్యాక్ అవుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 57 శాతం స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, సుమారు తొమ్మిది శాతం యూరోప్ లో ఉన్నట్టు తమ పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. ఇలా ఈ మెయిల్స్, ఫోటోలు సహా, డాక్యుమెంట్లు, ఇతర సెన్సిటివ్ డ్యాటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు గూగుల్ ప్లే ద్వారా కూడా వినియోగదారుల డాటాను తస్కరించే అవకాశంఉందని తెలిపింది. యాప్ లను డౌన్ లోడ్ సందర్భంగా ఖాతాదారుడు రేటింగ్ పై క్లిక్ చేసినపుడు ఎటాక్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని గూగుల్ సంస్థకి రిపోర్ట్ చేశామన్నారు. ఈ మాల్వేర్ పై విచారించి. వినియోగదారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. అయితే ఈ తాజా హ్యాకింగ్ అలజడిపై టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.