A Thief Donates Rs 10 And Then Steals Rs 5000 From Temple - Sakshi
Sakshi News home page

హనుమాన్ టెంపుల్‌లో చోరి.. రూ.10 సమర్పించి.. రూ.5000 దోపిడి..

Published Tue, Jul 11 2023 7:31 PM | Last Updated on Tue, Jul 11 2023 7:52 PM

Thief Donates Rs 10 And Then Steals Rs 5000 From Temple - Sakshi

ఛండీగఢ్‌: హనుమాన్ దేవాలయంలో ఓ దొంగ రూ.10 దేవునికి సమర్పించి రూ.5000 దోచేశాడు. ఈ ఘటన హర్యానా రేవారి జిల్లాలోని ధరుహేరా పట్టణంలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

మొదట గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన దొంగ.. హనుమంతుని పాదాల చెంత చేరి ప్రార్థన చేశాడు. పూజారి ముందే 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీషా చదువుతూ దేవుని సన్నిధిలో గడిపాడు. ప్రార్థన అనంతరం చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని హుండీ తాళాని పగులగొట్టాడు. రూ.5000 చోరీ చేశాడు. 

దోపిడీ జరిగిందని గుర్తించని పూజారి గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా.. అసలు విషయం బోధపడింది. పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement