అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి | Woman Steals Gold Ornaments From Friends House In Karnataka | Sakshi
Sakshi News home page

అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి

Published Fri, Dec 17 2021 7:12 AM | Last Updated on Fri, Dec 17 2021 7:17 AM

Woman Steals Gold Ornaments From Friends House In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్‌ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్‌ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది.

అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్‌ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్‌ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement