ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్ డెలివరీ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగింది. ఒక క్లిక్‌తో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని ఎంచెక్కా లాగించేయడం సర్వ సాధారణమైపోయింది. అదే సందర్భంలో డెలివరీ ప్రతినిధులు కస్టమర్ ఆహారంకోసం కక్కుర్తి పడటం, ఆహారాన్ని దొంగిలిండం లాంటి షాకింగ్ వీడియోలు ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బ్యాక్‌యార్డ్ స్టేట్ కంబైన్ యూ ట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం అందించలేదు. సుమారు 185 వేలకు పైగా వ్యూస్, కమెంట్లతో దూసుకుపోతోంది.
ఉబెర్ ఈట్స్‌కు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలనుంచి ఆహారాన్ని దొంగిలించడం కెమెరాకు చిక్కింది. వరుసగా ఒక్కో డబ్బా ఓపెన్ చేసి, దాంట్లో ఉన్న ఫుడ్‌ను చేత్తో తీసి పక్కన ఉన్న తన డబ్బాలో వేసుకుంటూ పట్టుబడ్డాడు. ఏమీ తెలియనివాడిలాగా మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ తన పనికానిచ్చాడు. చివరికి సూప్ బాక్స్‌నుకూడా వదల్లేదు. అలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తైన తర్వాత, అతను స్టాప్లర్ సహాయంతో బ్యాగ్‌ని రీసీల్ చేశాడు. దీనిపై యూజర్లు విభిన్నంగా స్పందించారు. మన దృష్టిలో పడనివి ఇలాంటివి చాలానే ఉంటాయంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "డ్యూడ్ బహుశా అతను ఆకలితో ఉన‍్నట్టున్నాడు" మరి కొందరు కమెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment