executive
-
సీటీ చెఫ్.. టేస్ట్‌కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు. -
నాట్స్ నూతన అధ్యక్షుడిగా మదన్ పాములపాటి
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2024- 26 కాలానికి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. చికాగో విభాగంలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మదన్ పాములపాటికి నాట్స్ బోర్డు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. గతంలో చికాగో చాప్టర్లో జరిగిన ఎన్నో సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు నాట్స్ కోశాధికారి, సంబరాల కమిటీ సెక్రటరీ, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్) ఇలా ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో నాట్స్ అధ్యక్ష పదవికి మదన్ పాములపాటి వైపే నాట్స్ బోర్డ్ మొగ్గు చూపింది. నాట్స్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఒకరికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా ప్రవేశపెట్టింది. నలుగురికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. వారిలో, శ్రీహరి మందాడి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్),శ్రీనివాసరావు భీమినేని (వైస్ ప్రెసిడెంట్ - ఆపరేషన్స్), హేమంత్ కొల్ల (వైస్ ప్రెసిడెంట్ -ఫైనాన్స్), భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (వైస్ ప్రెసిడెంట్ -మార్కెటింగ్), శ్రీనివాస్ చిలుకూరి (వైస్ ప్రెసిడెంట్ -ప్రోగ్రామ్స్), నాట్స్ కార్యదర్శి గా రాజేష్ కాండ్రు, కార్యనిర్వహక కార్యదర్శి (మీడియా)గా మురళీ కృష్ణ మేడిచెర్ల, కార్యనిర్వాహక కార్యదర్శి (వెబ్) గా రవి తుమ్మల, కార్యనిర్వాహక సహ కార్యదర్శి (వెబ్) గా ఫాలాక్ష్ అవస్థి, కోశాధికారిగా సుధీర్ కె. మిక్కిలినేని, సంయుక్త కోశాధికారిగా రవి తాండ్ర లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది.నాట్స్ కార్యవర్గం జాబితా మిగతా పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.కిషోర్ గరికపాటి నేషనల్ కోఆర్డినేటర్ (స్పోర్ట్స్),రామకృష్ణ బల్లినేని నేషనల్ కోఆర్డినేటర్ (మెంబెర్షిప్),సంకీర్త్ కటకం నేషనల్ కోఆర్డినేటర్ (సోషల్ మీడియా),రాజలక్ష్మి చిలుకూరి నేషనల్ కోఆర్డినేటర్ (వుమన్ ఎంపవర్మెంట్),భాను లంక నేషనల్ కోఆర్డినేటర్ (హెల్ప్‌లైన్),యమ్మానుయేల్ నీలనేషనల్ కోఆర్డినేటర్ (ఫండ్ రైసింగ్),కిరణ్ మందాడి నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్),వెంకట్ మంత్రి నేషనల్ కోఆర్డినేటర్ (ఇండియా లైసోన్),కిశోరె నారె నేషనల్ కోఆర్డినేటర్ (మీడియా),శ్రీనివాస్ మెంట జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్ జోన్),మనోహర రావు మద్దినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ వెస్ట్ జోన్),వెంకటరావు దగ్గుపాటి జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ ఈస్ట్ జోన్),శ్రీ హరీష్ జమ్ముల జోనల్ వైస్ ప్రెసిడెంట్(మిడ్ సెంట్రల్ జోన్),సత్య శ్రీరామినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ సెంట్రల్ జోన్),సుమంత్ రామినేని జోనల్ వైస్ ప్రెసిడెంట్(సౌత్ ఈస్ట్రన్ జోన్) -
కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యుటివ్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు. కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు. రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు. "మొదట్లో ఇన్ఫోసిస్ డిజిటల్ ఫస్ట్ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు. -
నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నం.. కొట్టేసిన కోట్లతో...
Facebook former executive fraud: టాప్ కంపెనీలో ఉద్యోగం.. అది కూడా టాప్ పొజిషన్.. మంచి జీతం.. అయినా ఆమె బుద్ధి గడ్డి తినింది. జల్సాలు, లగ్జరీ లైఫ్ కోసం నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నమేసింది. ఏకంగా రూ.33 కోట్లకు పైగా కొట్టేసింది. ఫేస్బుక్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా పని చేసిన అర్బరా ఫర్లో స్మైల్స్ అనే 38 ఏళ్ల మహిళ నకిలీ విక్రేతలు, కల్పిత ఛార్జీలు, క్యాష్ కిక్‌బ్యాక్‌ల ద్వారా కంపెనీ నుంచి 4 మిలియన్లకు పైగా (సుమారు రూ. 33 కోట్లు) కొట్టేసినట్లు అంగీకరించింది. కంపెనీలో 2017 నుంచి 2021 సంవత్సరాల కాలంలో కాజేసిన ఈ డబ్బును ఆమె కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవనం కోసం ఖర్చు చేసింది. మోసం చేసిందిలాగే.. డబ్బును కాజేసేందుకు ఫర్లో స్మైల్స్ కంపెనీ ఖర్చు ఖాతా వ్యవస్థనే మార్చేసింది. పేపాల్, వెన్మో, క్యాష్ యాప్ వంటి చెల్లింపు సేవలకు తన కార్పొరేట్ క్రెడిట్ కార్డులు లింక్ చేసుకుంది. వీటి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి సంబంధించిన చెల్లింపులకు కంపెనీ సొమ్మును వినియోగించేది. తర్వాత వారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకునేది. ఈ సొమ్మును నేరుగా, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ ద్వారా, కొన్నిసార్లు టీ షర్టుల వంటి వాటిలో దాచి ఆమెకు ఇచ్చేవారని ఈ కేసును డీల్ చేస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఖర్చు చేసింది వీటికే.. ఫేస్‌బుక్‌ను మోసం చేసి కాజేసిన సొమ్మును ఫర్లో స్మైల్స్ విలాసాలకు వినియోగించేది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్లకు భారీగా ఖర్చు పెట్టేదని తెలిసింది. పిల్లల ప్రీస్కూల్ ట్యూషన్ ఫీజుకే ఆమె 18,000 డాలర్లు (రూ.14 లక్షలకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం. నేరాన్ని బార్బరా ఫర్లో స్మైల్స్ అంగీకరించింది. దీంతో ఆమెకు వచ్చే ఏడాది మార్చి 19న శిక్ష విధించనున్నారు. అప్పటి వరకు ఆమె 5,000 డాలర్లు (రూ.4.15లక్షలు) బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. -
విశాఖలో సీఎంవోకు దశలవారీగా చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ కీలక వ్యాఖ్యలు అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. -
మస్క్‌కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఎగ్జిక్యూటివ్ సంస్థకు గుడ్ బై చెప్పారు. ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ తన పదవికి రాజీనామా చేశారు. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) రాయిటర్స్ నివేదిక ప్రకారం కంటెంట్ నియంత్రణను పర్యవేక్షణా అధికారి ఇర్విన్ సంస్థ నుంచి వైదొలగారు. ట్విటర్ టేకోవర్ చేసిన క్లిష్ట సమయంలో, అప్పటి హెడ్ యోయెల్ రోత్ రాజీనామా చేయడంతో జూన్ 2022లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా ఇర్విన్ బాధ్యతలు చేపట్టారు. విద్వేష పూరిత కంటెంట్, ట్విటర్లో ప్రకటనదారులు ఒక్కొక్కరు తప్పుకుంటున్న సమయంలో ఇర్విన్ నిష్క్రమణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామంపై మస్క్ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ట్విటర్.2 సీఈవోగా లిండా యాకారినోను నియమించినట్లు మస్క్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) -
తప్పతాగి బెడ్ మీద నగ్నంగా.. పోలీసులు షాక్
ఆయనో ప్రముఖ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తాగుడు అలవాటుకు బానిసయ్యాడు. ఆ మత్తులో తప్పతాగి పరాయి వాళ్ల ఇంట్లో నిద్రపోయాడు. అదీ నగ్నంగా!. ఆ ఇంటి ఓనర్ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. అమెరికాలోని ఫాయెట్విల్లే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...‘‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడంటూ కాల్ వచ్చింది. దీంతో మేము హుటాహుటినా ఆమె ఇంటికి వెళ్లాం. ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి. మేము బలవంతంగా పైకి లేపి కూర్చొబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా అతను మాట్లాడే స్థితిలో లేడు’’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్ చేసే టైసన్ ఫుడ్స్ కంపెనీ వ్యవస్థాపకుడి మనవడు జాన్ ఆర్ టైసన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారాయన. ఈ వ్యవహారంతో జాన్‌ను.. అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాత పేరుప్రఖ్యాతలు, పరువు పొగొట్టిన మనవడిగా ఇప్పుడతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయమే కంపెనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఐతే సదరు ఆఫీసర్ మాత్రం తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు జాన్ టైసన్. ప్రసుతం తాను డ్రింకింగ్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని చెప్పారు. (చదవండి: కాంట్రవర్సీ: తాగుబోతు స్టాంప్ కోసం పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే చాలట!) -
KSR కామెంట్ : రాజధానిపై కృత నిశ్చయం
-
భారత్‌తో డీల్ జాప్యం.. టెస్లాకు భారీ షాక్
న్యూఢిల్లీ: భారత్‌లో తమ ఈవీ కార్ల ఎంట్రీకి బ్రేకులు వేసిన తరుణంలో.. టెస్లా కంపెనీకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. లాబీయింగ్‌లో ఇంతకాలం కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన టెస్లా కంపెనీ భారత ఎగ్జిక్యూటివ్ అసహనంతో కంపెనీ నుంచి వైదొలిగినట్లు సమాచారం!. భారత్‌లో రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో .. టెస్లా కంపెనీ మనుజ్ ఖురానాను పాలసీ & బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది టెస్లా. ఐఐఎం బెంగళూరుకు చెందిన మనుజ్ ఖురానాకు అప్పటికే మేనేజ్మెంట్ కన్సల్టింగ్‌లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. టెస్లాకు భారత్‌లో ఆయనే తొలి ఎంప్లాయ్ కూడా!. ఈ మేరకు మార్చి 2021లో ఆయన నియామకం జరిగింది. అప్పటి నుంచి టెస్లా తరపున మనుజ్ అండ్ టీం కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సూచనల మేరకు.. దిగుమతి సుంకం తగ్గించుకోవాలంటూ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ముందుగా తక్కువ దిగుమతి సుంకంతో కార్లను అనుమతించాలని, ఇక్కడి మార్కెట్‌పై ఓ అంచనాకి వచ్చి కార్ల ఉత్పత్తిని మొదలుపెడతామని మనుజ్ విజ్ఞప్తి చేశారు. చైనా కూడా ఇదే తరహాలో టెస్లాకు అనుమతులు మంజూరు చేసిందని వివరించారాయన. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో అస్సలు తగ్గలేదు. దీంతో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్నారు. అయినప్పటికీ మనుజ్ తన ప్రయత్నాలను ఆపలేదు. అయితే ముందుగా స్థానిక ఉత్పత్తిని ప్రారంభించాకే.. రాయితీల గురించి చర్చించాలని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామాలతో తాజాగా టెస్లా కంపెనీ భారత్ ఎంట్రీని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇండోనేషియాతో పాటు థాయ్‌లాండ్‌ల పైనా దృష్టిసారించింది. అంతేకాదు భారత్‌లో షోరూంల కోసం వెతికే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఇక్కడి టీంకు వేరే పనులను అప్పజెప్పింది. ఈ క్రమంలోనే.. మనుజ్ ఖురానా టెస్లాకు రాజీనామా చేశారు. భారత్‌లో రంగప్రవేశం విషయంలో టెస్లా వైఖరి వల్లే ఆయన కంపెనీని వీడినట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. దీనిపై ఆయన స్పందన కోరగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. -
అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు
ఇండోర్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్లైన్లో గంజాయిని విక్రయిస్తుందనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై మధ్యప్రదేశ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో పోలీసులు గతవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) అంతేకాదు తాము అమెజాన్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ డ్రగ్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాన్ఫెడరేషన్ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ప్రతినిధి దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం, మద్దతును ఇస్తానని హామీ కూడా ఇచ్చిన సంగతని ఈ సందర్భంగా పోలీసులు గుర్తుచేశారు. పైగా అమెజాన్ సంస్థ సకాలంలో స్పందించి అందించిన వివరాలు తాము వెలకితీసిన సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అంతేకాదు వివిధ చిరునామాలకు బుక్ చేసి డెలివరీ చేసిన 20 నిషేధిత సరుకుల వివరాలు ఇంకా అందాల్సి ఉందని భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ..."ఈ కేసు విచారణకు ఈ-కామర్స్ దిగ్గజం సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆన్లైన్ వ్యాపారాలకు ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతేకాదు అమెజాన్‌కు కాల్ చేసినా వారు స్పందించడం లేదన్నారు. దయచేసి మాకు సహకరించండి లేనట్లయితే అమెజాన్ ఎండీ సీఈవోకి విజ్ఞప్తి చేస్తాం లేదా తదుపరి చర్యలు త్వరిత గతిన ప్రారంభిస్తాం" అని హెచ్చరించారు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) -
ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడో తెలిస్తే.. షాక్ అవుతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్ డెలివరీ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగింది. ఒక క్లిక్‌తో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని ఎంచెక్కా లాగించేయడం సర్వ సాధారణమైపోయింది. అదే సందర్భంలో డెలివరీ ప్రతినిధులు కస్టమర్ ఆహారంకోసం కక్కుర్తి పడటం, ఆహారాన్ని దొంగిలిండం లాంటి షాకింగ్ వీడియోలు ఇటీవల ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బ్యాక్‌యార్డ్ స్టేట్ కంబైన్ యూ ట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం అందించలేదు. సుమారు 185 వేలకు పైగా వ్యూస్, కమెంట్లతో దూసుకుపోతోంది. ఉబెర్ ఈట్స్‌కు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలనుంచి ఆహారాన్ని దొంగిలించడం కెమెరాకు చిక్కింది. వరుసగా ఒక్కో డబ్బా ఓపెన్ చేసి, దాంట్లో ఉన్న ఫుడ్‌ను చేత్తో తీసి పక్కన ఉన్న తన డబ్బాలో వేసుకుంటూ పట్టుబడ్డాడు. ఏమీ తెలియనివాడిలాగా మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటూ తన పనికానిచ్చాడు. చివరికి సూప్ బాక్స్నుకూడా వదల్లేదు. అలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తైన తర్వాత, అతను స్టాప్లర్ సహాయంతో బ్యాగ్‌ని రీసీల్ చేశాడు. దీనిపై యూజర్లు విభిన్నంగా స్పందించారు. మన దృష్టిలో పడనివి ఇలాంటివి చాలానే ఉంటాయంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "డ్యూడ్ బహుశా అతను ఆకలితో ఉన్నట్టున్నాడు" మరి కొందరు కమెంట్ చేస్తున్నారు. -
జూనియర్ మేనేజర్ జాబ్స్.. స్టాటింగ్ సాలరీ 50 వేలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీఎఫ్‌సీసీఐఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 1074 ► పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్. ► విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ తదితరాలు. ► జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకట్రానిక్స్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్/కంట్రోల్/మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్),ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎంఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.50,000నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు. ► ఎగ్జిక్యూటివ్: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/పవర్ సప్లై/ఇండస్ట్రియల్/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్/కమ్యూనికేషన్/డిజిటల్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ. 30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు. ► జూనియర్ ఎగ్జిక్యూటివ్: పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.68,000 వరకు చెల్లిస్తారు. వయసు:18 నుంచి 30ఏళ్లు ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. సర్టిఫికేట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021 ► వెబ్సైట్: https://dfccil.com/ -
ఐబీఎంకు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై: షేర్లు పతనం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్ జిమ్ వైట్ వైట్‌హర్స్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐబీఎం ధృవీకరించింది. పదవిని చేపట్టిన 14 నెలలకే కంపెనీ ఆయన ధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐబీఎం ప్రకటించింది. అయితే అమెరికాకు చెందిన రెడ్ హ్యాట్ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పదంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది. సీఈవోకి అరవింద్ కృష్ణుడికి సీనియర్ సలహాదారుగా కొనసాగుతారని తెలిపింది. అయితే జిమ్ ఎందుకు వైదొలగుతున్నారు, ఆయన స్థానంలో ఎవర్ని నియమించబోతోందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఐబీఎం 4.8 శాతం కుప్పకూలాయి. ఐదు నెలల కనిష్టానికి చేరాయి. వైట్‌హర్స్ట్ నిష్క్రమణ విశ్లేషకులకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సీఈవో అరవింద్ కృష్ట తరువాతి ఆ స్థానంలో జిమ్ ఉంటారనే అంచనాలున్నాయి. రెడ్ హ్యాట్ విలీనం తరువాత ఐబీఎంలో ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు జిమ్. ఐబీఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ తరువాత ఐబీఎం ఛైర్మన్, సీఈవో గిన్నీ రొమెట్టి వైదొలగడంతో జనవరి 2020 లో అరవింద్ కృష్ట సీఈవోగా ఎంపికయ్యారు. ఒక దశలో అరవింద్ స్థానంలో జిమ్ సీఈవో అవుతారనే కూడా చాలామంది భావించారు. రెడ్ హ్యాట్ విలీనంతో ఐబీఎం క్లౌడ్ మార్కెట్లో ఐబీఎం రూపురేఖలను మార్చడంలో కీలక ప్రాత పోషించిన ఆయన కంపెనీ వీడటం ఎదురుదెబ్బ అని వెడ్బష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మోషే కత్రి వ్యాఖ్యానించారు. సీఈవో పదవిని చేపట్టిన తరువాత అరవింద కృష్ట సంస్థను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన మార్పులు, కార్పొరేట్ కంప్యూటర్ వ్యవస్థలను నిర్వహించే వ్యాపారం నిలిపివేత, గత ఏడాది చివర్లో ఐరోపాలో భారీగా ఉద్యోగ కోతలు పరిణామాలు కారణమా? అని పలువురు భావిస్తున్నారు. -
వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు
సాక్షి, ముంబై: ఫెస్టివ్ సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో వినియోగదారుల ముందుకొచ్చిన ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పై పెద్దదుమారం రేగుతోంది. అయితే ఆ తరువాత సంస్థ తరపున జరిగిన తీవ్ర తప్పిదానికి ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ చేసింది ఘోర తప్పిదమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్ సర్వీస్‌లు నాగాలాండ్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కొహిమాకు చెందిన ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇంకా స్వాతంత్ర్యం లభించలేదా.. తమ రాష్ట్రంలో ఎందుకు డెలివరీ చేయడం లేదని ప్రశ్నించారు. ఫ్లిప్‌కార్ట్ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీనికి ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి ఇచ్చిన సమాధానమే దుమారానికి కారణమైంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు, కానీ తమ విక్రయదారులు ఇండియా బయట తమ సేవలను అందించలేరని పేర్కొన్నారు. ఈ సమాధానానికి షాకైన సదరు వినియోగదారులు తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఈ జవాబును తొలగించింప్పటికీ చాలామంది దీని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. వావ్..నాగాలాండ్ కు ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్యం ఇచ్చేసిందని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నాగాలాండ్ భవిష్యత్తును ముందే ఊహించారంటూ ప్రఖ్యాత నాగా సంగీతకారుడు అలోబో చమత్కరించారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన ఈశాన్యరాష్ట్రం గురించి ఎంత తక్కువ మందికి తెలుసు అనేవిషయాన్ని హైలైట్ చేస్తోంది.. నాగాలాండ్ ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. దీనికి విద్యావ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలని తాను భావిస్తున్నానన్నారు. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్‌తో కాకపోయినా, తనకూ ఇలాంటి అనుభవం ఎదురైదంటూ నాగాలాండ్ బోర్డర్స్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రూపిన్ శర్మ పేర్కొన్నారు. నాగాలాండ్ ఇండియాలో భాగమన్నారు. ఈ వివాదంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ యూజర్లను క్షమాపణలు కోరింది. ఇలా జరిగినందుకు విచారిస్తున్నామని, సాంకేతికంగా జరిగిన పొరపాటని పేర్కొంది. నాగాలాండ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్ సేవలు అందిస్తుందని వివరణ ఇచ్చింది. To those who were questioning me ! Here is the @Flipkart reply ! Don’t shoot the messenger 💪 Nagaland and NE is India even if your heart may not think so pic.twitter.com/qocNMXqH3N — Pradyot_Tripura (@PradyotManikya) October 8, 2020 Although not with Flipkart, Even I had this experience once. Nagaland is India #Flipkart . pic.twitter.com/WDS7kodF94 — Rupin Sharma IPS (@rupin1992) October 8, 2020 -
ఇస్మార్ట్ సిటీ
-
యంత్రాంగమే ఎదుర్కోగలదు
న్యూఢిల్లీ: దేశంలో విపత్తులు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని కార్యనిర్వాహక వ్యవస్థే సమర్థంగా ఎదుర్కోగలదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. సంక్షోభాల్లో ‘ప్రజలు, ధనం, వస్తుసామగ్రి’ని ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవడం ఎలా అనేది యంత్రాంగమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనూ కోర్టులు పనిచేస్తాయనీ, యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా పౌరులకు అపాయం వాటిల్లినప్పుడు జోక్యం చేసుకుంటాయని సీజేఐ స్పష్టం చేశారు. -
ఎగ్జిక్యూటివ్ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కాపుసేన
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని రాష్ట్ర కాపుసేన గౌరవ అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి, అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకా భాస్కరరావు, గంట్ల శ్రీనుబాబు తెలిపారు. వారు విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఇప్పటివరకు ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలని ఏ పార్టీ భావించలేదన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మా ప్రాంతానికి రాజధాని రావడం ఆనందంగా ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటయితే ముంబాయిని మించి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిపాలనా రాజాధాని ఏర్పాటయితే సినీ పరిశ్రమ విశాఖకు రావడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని.. కాపుసేన తరపున ఆయనకు అభినందనలు తెలిపారు. -
వెలుగు రేఖ.. విశాఖ
అందరి మొగ్గు విశాఖవైపే.. అందరి చూపు అందాల నగరిపైనే.. గత కొన్నేళ్ల నుంచి ఆర్థిక రాజధానిగా.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలకు వేదికగా మారిన విశాఖకు రాజధాని కావడానికి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచీ సర్వత్రా వినిపిస్తున్న మాట. తాజాగా ఈ అంశంపై నియమించిన జీఎన్‌రావు కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో వెల్లడించిన మూడు రాజధానుల ఆలోచన.. ఇప్పుడు నిపుణుల కమిటీ విశాఖ వైపు మొగ్గు చూపుతూ చేసిన సిఫారసులు.. విశాఖతో పాటు మొత్తం ఉత్తరాంధ్రకు మహర్దశ కల్పిస్తాయని ఈ ప్రాంత రాజకీయ పార్టీలు, మేధావులు, సామాన్యులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వనరులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు విశాఖకు రాజధాని యోగ్యత కల్పించేందుకు అనుకూలంగా ఉన్నాయన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు తగినట్లే నిపుణుల కమిటీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలని సూచించింది. సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తు విశాఖదే. అందమైన నగరాన్ని చూసి ముగ్ధులైన ఎంతోమంది మహామహుల మాట ఇదే. దశాబ్దాలుగా ఈ మాట వింటున్నామే తప్ప విశాఖ సహా ఉత్తరాంధ్రకు సమన్యాయం దక్కట్లేదని సగటు విశాఖ వాసుల అసంతృప్తి మాటల్లో చెప్పలేనిది. విశాఖను విశ్వపటంలో ఆవిష్కరిస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన గత పాలకులకు భిన్నమైన పాలన ఇప్పుడు వచ్చింది. సమన్యాయం చేస్తానన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పాలన పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లలోనే ఒక్కొక్క అడుగూ విశాఖ అభివృద్ధి వైపు వడివడిగా వేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ఆయన నిర్ణయాలకు బలం చేకూర్చింది. ప్రాంతీయ అసమానతలను పారదోలేలా పలు సిఫారసులు చేసింది. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్య వస్థలకు విశాఖను కూడా ఒక వేదిక చేయాలనే సూచనలతో నివేదిక సమర్పించింది. సహజ వనరులకు ఆటపట్టు.. సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటి అనుసంధాన మార్గాలే కాదు.. ఒక రాజధానికి ఉండాల్సిన సహజ సిద్ధమైన లక్షణాలన్నీ విశాఖకు ఉన్నాయనేది మేధావుల అభిప్రాయం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా అవతరించింది. తాజాగా జీఎన్ రావు కమిటీ పలు అంశాల్లో విశాఖకు పెద్దపీట వేసింది. ప్రాంతాల మధ్య సమతూకం, సమానాభివృద్ధే కొలమానంగా రూపొందించిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. ఈ సిఫారసుల పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు బెంచ్.. రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినపుడు కనీసం విశాఖలో హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు గట్టిగా కోరుకున్నారు. న్యాయవాదులు ఏకంగా ఉద్యమాలే నడిపారు. ఇప్పుడు జీఎన్ రావు కమిటీ కూడా అనూహ్యమైన సిఫారసులు చేసింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, దాని బెంచ్‌లను అమరావతి, విశాఖలలో నెలకొల్పాలని సూచించింది. ఇది ఒక్క విశాఖకే కాదు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ మేలు చేసే సూచన అనేది మేధావుల అభిప్రాయం. పాలనా నిలయం పాలనలో అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ (సచివాలయం), ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్‌లోనే ఉండాలనే జీఎన్ రావు కమిటీ సిఫారసుపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలనకు విశాఖ వేదిక అయితే సర్వతోముఖాభివృది్ధకి నోచుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సాకారమైతే విశాఖలో మౌలిక వసతులు మరింత మెరుగవుతాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తరలివస్తాయి. వ్యాపార రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. అసెంబ్లీ సమావేశాలు మహారాష్ట్ర మాదిరిగా శాసన వ్యవస్థ అటు అమరావతిలో, ఇటు విశాఖలో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలనే జీఎన్ రావు కమిటీ సిఫారసు కూడా ఇదే. ఇవన్నీ సాకారమైతే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. ప్రపంచపటంలో తలెత్తుకుని విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందనే వాదనల్లో సందేహమే అక్కర్లేదు. త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో నిపుణుల కమిటీ సూచనలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి అభివృద్ధిలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించిన నాలుగు మండళ్లలో ఇదొకటి. దీన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు గట్టి మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సూచనల్లో కొన్ని ⇒కార్యనిర్వాహక వ్యవస్థ(సచివాలయం) ⇒హైకోర్టు బెంచ్ ⇒సీఎం క్యాంపు కార్యాలయం ⇒అసెంబ్లీ వేసవి సమావేశాల నిర్వహణ ⇒ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి -
‘విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్ల ప్రభావం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై ఏయూ మెట్రాలజీ మాజీ విభాగాదిపతి, వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ భానుకుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే హుద్ హుద్ తప్పితే.. విశాఖను నేరుగా తాకిన తుఫాన్లు లేవని ఆయన వెల్లడించారు. విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్ల ప్రభావం ఎక్కువని భానుకుమార్ పేర్కొన్నారు. ఒకేసారి అసాధారణంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కూడా సముద్రతీర ప్రాంతం వల్ల విశాఖకు మేలు జరుగుతుందని అన్నారు. అన్ని కాలాల్లోనూ విశాఖలో అనువైన వాతావరణం ఉంటుందని భానుకుమార్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని భానుకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎకనామిస్ట్, ఏయూ మాజీ ఆర్థిక విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీరామమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో చాలా తక్కువ ఖర్చుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. ముంబైని మించి విశాఖ నగరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని శ్రీరామమూర్తి పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని చెప్పారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే విధంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఉందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అయన అభిప్రాయపడ్డారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో జీడీపీ రేటు అభివృద్ధి చెంది హ్యాపీ ఇండెక్స్ ర్యాంకు కూడా పెరుగుతుందని శ్రీరామమూర్తి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు, మూడు రాజధానులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఒక ఆర్థికవేత్తగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమని శ్రీరామమూర్తి తెలిపారు. -
ఆపిల్‌కు షాక్ : డిజైన్ జీనియస్ గుడ్ బై
టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన అద్భుతమైన డిజైన్లతో ఆపిల్ సంస్థకు తనదైన ముద్రను అందించిన చీఫ్ డిజైన్ ఆఫీసర్ డిజైనర్ జోనాథన్ పాల్ ఐవ్ (జానీ ఐవ్) రాజీనామా చేయనున్నారు. 1992 నుంచి 27 సంవత్సరాలు సంస్థకు విశేష సేవలందించిన జానీ ఐవ్ (52) ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని వీడనున్నారు. ముఖ్యంగా తన సొంత డిజైనింగ్ కంపెనీ ప్రారంభించే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో 100మంది బాల్డ్మెన్లో ఒకరిగా పేరు గడించిన ఐవ్ ‘లవ్ ఫ్రమ్’ అనే కొత్త సంస్థను లాంచ్ చేయనున్నారు. ఆపిల్ పునరుజ్జీవనంలోనూ, ఉత్పత్తుల డిజైన్లలో కీలక పాత్ర పోషించిన ఏకైన వ్యక్తి ఐవ్ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. 5వేలకు పైగా పేటెంట్లు, బెస్ట్ డిజైనర్‌గా పలు ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన సొంతం. ఈవ్ లేకుండా ఆపిల్ పరికరాలను ఊహించుకోవడం అసాధ్య అని ఆపిల్ సీఈవో కుక్ వ్యాఖ్యలే ఐవ్ ప్రతిభకు నిదర్శనం. మరోవైపు యాపిల్ కంపెనీలో ఉద్యోగం నుంచి రాజీనామా చేసినప్పటికీ ఇదే కంపెనీతో కలిసి పలు ప్రాజెక్టులు చేపడతామని ఆపిల్ ప్రకటించింది చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా ఐమాక్, ఐఫోన్, ఆపిల్ పార్క్, ఆపిల్ రీటైల్స్టోర్లను తీర్చిద్దిద్దడంలో అతని పాత్ర అపూర్వమని టిమ్ కుక్ ప్రశంసించారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో తనకు యాపిల్‌లో ఎవరైనా స్పిరిచ్యువల్ పార్ట్నర్ ఉన్నారా అంటే అది జానీ ఐవ్ మాత్రమేనని వ్యాఖ్యానించారట. అంతేకాదు ఆపిల్ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఐవ్ వాయిస్ ఒక పెద్ద మ్యాజిక్ అని బిజినెస్వర్గాల టాక్. తన నిష్క్రమణపై ఐవ్ మాట్లాడుతూ గతంకంటే బలంగా, శక్తివంతంగా, మరింత నైపుణ్యంతో తన సహోద్యోగులతో కూడిన ఆపిల్ డిజైన్ టీం ఉత్తమంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోయే చాలా సంవత్సరాల్లో వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. -
గూగుల్‌కు రాజన్ ఆనందన్ గుడ్‌బై
అమెరికన్ టెక్ జెయింట్ గూగుల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన గూగుల్‌కు సేవలందించిన గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ సంస్థను వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల చివరి వరకు గూగుల్లోనే కొనసాగుతారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్న ఆనందన్ వెంచర్ ఫండ్ సీక్వోయా క్యాపిటల్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరుగురు మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు ఆనందన్ సంస్థలో నాయకత్వ జట్టులో చేరినట్లు సీక్వోయా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర జి. సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్ లో తెలిపారు. మరోవైపు రాజన్ స్థానంలో ప్రస్తుత గూగుల్ సేల్స్ కంట్రీ డైరెక్టర్ వికాస్ అగ్నిహోత్రి తాత్కాలిక బాధ్యత తీసుకుంటారని గూగుల్ వెల్లడించింది. అలాగే గత ఎనిమిదేళ్ళ కాలంలో తమ సంస్థకు విశేష సేవలందించి నందుకుగాను రాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గూగుల్ ప్రకటించింది. కాగా, మైక్రోసాఫ్ట్ ఇండియా నుంచి 2010లో ఆనందన్ గూగుల్‌లో చేరారు. అంతకుముందు ఆయన డెల్ ఇండియా, మెకిన్సే అండ్ కంపెనీల్లో పని చేశారు. 8 amazing years. 850million internet users across India and SEA. Many billions of revenue and fastest growing region in the world. Incredible team that thinks big and executes superbly. Thank you @GoogleIndia #GoogleSEA. Loved every minute. — Rajan Anandan (@RajanAnandan) April 2, 2019 -
గర్ల్ ఫ్రెండ్ కోసం భార్య హత్య: ఒరాకిల్ ఉద్యోగి అరెస్ట్
బెంగళూరు: అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ, సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్ కుమార్ జినారాజ్, అలియాస్ ప్రవీణ్ (42) చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే.. అహ్మదాబాద్ వాసి తరుణ్‌కు, బ్యాంకు ఉద్యోగి సాజ్నితో నవంబరు 15, 2002న వివాహం జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు. అయితే ఎన్నాళ్లనుంచో ఇతగాడికోసం గాలిస్తున్న పోలీసులు ఇటీవల తరుణ్ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే బాబు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు ఒరాకిల్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ద్వారా అన్నమ్మకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులు కూపీ లాగగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణ అధికారి కిరణ్ చౌదరికి ఒరాకిల్ ఆఫీసులో తరుణ్ ఆచూకీ అంత ఆషామాషీగా దొరకలేదు. చివరకు పాత ఫోటోల ద్వారా గుర్తించి, నాటకీయంగా డైరెక్టుగా తరుణ్ (ప్రవీణ్) క్యాబిన్ దగ్గరి కెళ్లి.."హలో తరుణ్, నీ కథ ముగిసింది ...లెట్స్ గో" అనడంతో ప్రవీణ్ అవాక్కయ్యాడు. మొదట్లో తిరస్కరించినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. అంతేకాదు తన భార్య(నిషా)కు ఫోన్ చేసి తన అసలు స్వరూపాన్ని కూడా వివరించాడట. ఎలా తప్పించుకున్నాడు? మధ్యప్రదేశ్‌లోని మండౌరుకు చెందిన తన పాతస్నేహితుడి సర్టిఫికెట్లను దొంగిలించి ప్రవీణ్ భాట్లీగా అవతరించాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా పూర్తిగా మారిపోయాడు. నకిలీ సరిఫికెట్లతో ముందు కొంతకాలం పుణేలో కాల్ సెంటర్లో పనిచేశాడు. అక్కడే 2009లో నిషాను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బెంగళూరు ఓరాకిల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్‌లు మాత్రమే చేస్తూ తన గుట్టు ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించాడు. తల్లిదండ్రులు, తమ్ముడు కారు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి నమ్మించి మరీ నిషా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సాజ్ని తల్లితండ్రులు కృష్ణన్, రమణి కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ఆ తరువాత వారు అహ్మదాబాద్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన సాజ్ని బ్యాంకులో పని చేస్తున్నారు. వీరి పరిచయం నాటికి అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వాలీబాల్ కోచ్ గా పని చేసేవాడు తరుణ్. అప్పటికే సాజ్ని పనిచేస్తున్న బ్యాంకు పనిమీద ఒకటి రెండు సార్లు సాజ్ని ఇంటికి వచ్చాడు తరుణ్. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతోనే సాజ్నిని పెళ్లి చేసుకున్నాడు. తరుణ్ అరెస్ట్‌పై కృష్ణన్, తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోయిన తరువాత తమ జీవితం శూన్యంగా మారిపోయిందనీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ బతికామని చెప్పారు. మొదట్లో మర్యాద ప్రవర్తనతో సాజ్ని భర్త, ఆ తరువాత పోలీస్ దర్యాప్తులో పోలీసులు తమను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొప్ప నటుడు అనీ, అతని ప్రవర్తన తమకు ఎపుడూ అనుమానాస్పదంగా కనిపించలేదని, తమని చూడగానే లేచి నిలబడుతూ చాలా నెమ్మదిగా, సంస్కారవంతంగా ఉండేవాడని తెలిపారు. అప్పటికే మరో మహిళతో సంబంధమున్న సంగతి కూడా తమకు తెలియదన్నారు. కానీ పెళ్లి తరువాత అనుకున్నంత అతను మంచివాడు కాదంటూ తన కూతురు బాధపడిందనీ, తన డబ్బంతా తరుణ్ బలవంతంగా లాగేసుకుంటున్నాడని వాపోయిందని కూడా గుర్తు చేసుకున్నారు. పకడ్బందీగా హత్య దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా చిందర వందర చేశాడు. బీరువాలోని వస్తువులన్నీ లాగి పడేశాడు. సాజ్ని మెడలోని బంగారం గొలుసును రెండు ముక్కలు చేశాడు. విమాన టికెట్లను, కొంత సొమ్మును కూడా కింద పడేశాడు. (మరునాడు ఆమె ట్రైనింగ్ కోసం బయలుదేరాల్సి ఉంది). ఆమె చున్నీతోనే ఉరిబిగించి చంపేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. గాయాలు, షాకుకు గురయ్యాననే పేరుతో సమీపంలోని ఆసుపత్రి ఐసీయూలో చేరాడు. అనుమానం ఎక్కడ మొదలైంది మరునాడు పోస్ట్‌మార్టం అనంతరం ఇంటికి తీసుకొచ్చిన సాజ్ని మృతదేహాన్ని చూసి ఆసుపత్రి నుంచి వచ్చిన తరుణ్ బోరున విలపిస్తూ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. కానీ సాజ్నీ మెడలోని చున్నీని వాసన చూసిన స్నిఫర్ డాగ్స్ మాత్రం అతగాడి వాసన పసిగట్టాయి. గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. దీంతో అప్పటివరకూ సంస్కారవంతమైన అల్లుడిగా భావించిన కృష్ణన్ , రమణలకు అనుమానం మొదలైంది. తమ కూతురు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అంతేకాదు..ఇక్కడ బోరున ఏడ్చి కారెక్కిన తరువాత నవ్వుతున్నాడంటూ అక్కడున్నవారు గొణుక్కోవడం కూడా సాజ్ని తల్లి చెవిన పడింది. దీంతో వారు తరుణ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అప్పటినుంచి తరుణ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. 15సంవత్సరాల తరువాత కేసును ఎలా ఛేదించారు నిజానికి ఈ హత్య కేసు పదిహేను సంవత్సరాల తరువాత ఛేదించడమే విశేషం. ఇందుకు సాజ్ని తల్లి దండ్రులు పెద్దపోరాటమే చేశారు. తరుణ అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో చేరకు ముందు నుంచే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసుననీ, ఆయన తరచుగా తమ ఇంటికి కూడా వచ్చేవారని రమణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సాజ్ని హత్య జరిగాక దాదాపు ఆరేళ్ల తరువాత తమకు అత్యంత సన్నిహితుడి ద్వారా మోదీని పలుమార్లు కలిసి, తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామని కృష్ణన్, రమణి దంపతులు వివరించారు. దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె శర్మ , డీసీపి హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత డీసీపీ దీపన్ భద్రాన్ ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా తరుణ్ ఆట కట్టించింది. తరుణ్ తల్లికి వచ్చిన దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు కమిషనర్ జేకే భట్ చెప్పారు. వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న హత్య గర్ల్ఫెండ్కు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా భార్య హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు తరుణ్. కానీ హంతకులతో తనకు స్నేహం అక్కరలేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందట ఆమె. -
#మీటూ: టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ పైత్యం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మీడియా రంగంలో మొదలైన మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్నిరంగాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. మీటూ ఉద్యమానికి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమ అనుభవాలను, క్షోభను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైంగిక వేధింపుల వేటగాళ్ల బారిన పడి విలవిల్లాడిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. వారు ధైర్యంగా ముందుకు వస్తున్న తీరు ప్రశంసనీయం. తాజాగా టాటా మోటార్స్‌లో వెలుగు చూసిన వేధింపుల పర్వంతో కార్పొరేట్ రంగాన్ని కూడా మీటూ సెగ తాకినట్టయింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఉదంతాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు సంధ్యామీనన్ మరో బాధితురాలి గోడును ట్విటర్ వేదికగా బయటపెట్టారు. టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేష్ రంగరాజన్ వక్రబుద్ధిని బాధితురాలు అందించిన ట్విటర్ సమాచారం ఆధారంగా బహిర్గతం చేశారు. ఆ స్క్రీన్ల షాట్లను ట్విటర్లో షేర్ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్ అతగాడిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్ కింద ఇంటికి పంపింది. ప్రతీ ఒక్కరికీ గౌరవనీయమైన సురక్షితమైన పనిపరిస్థితులను కల్పించేందుకు తామెపుడూ కృషి చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్‌పై తగిన చర్య తీసుకుంటామని వెల్లడించింది. I'm just so sad that young women still go through this every day. pic.twitter.com/rlTIt9VlP5 — Sandhya Menon (@TheRestlessQuil) October 11, 2018 In light of the enquiry by ICC, Suresh Rangarajan, has been asked to proceed on leave in order to allow for an objective enquiry to be completed as swiftly as possible. — Tata Motors (@TataMotors) October 11, 2018 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అనూహ్య పరిణామం
సాక్షి, ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ ఆకస్మికంగా రాజీనామా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. ఆయన 90రోజుల్లో పదవిని వీడనున్నారని తెలిపింది. అయితే ఆయన స్థానంలో ఎవర్ని నియమించిందీ బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. పదవీకాలం ఇంకా మిగిలి వుండగానే ఆయన పదవినుంచి వైదొలగడం పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. 2017లో బ్యాంకు డిప్యూటీ ఎండీగా ఎన్నికైన పరేశ్ పదవీకాలం 2020, అక్టోబర్‌తో ముగియనుంది. అలాగే ఆదిత్య పూరీకి సహజమైన వారసుడిగా పరేశ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ డిప్యూటీ ఎండీ పరేశ్‌ను పునర్ నియామకానికి గారు వాటాదారుల అనుమతిని కోరనున్నట్టు ఈ ఏడాది జూన్‌లో బ్యాంకు ప్రకటించింది. ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన పలువురికి షాక్ ఇచ్చింది.