ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కేటగిరీల పోస్టులను పొందుపరిచింది. ఒకటి..
ఎగ్జిక్యూటివ్. రెండు.. నాన్ ఎగ్జిక్యూటివ్.మొదటి కేటగిరీలో 6 రకాల ఉద్యోగాలు,
రెండో కేటగిరీలో 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం మీద స్టేషన్ కంట్రోలర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, మెయింటెయినర్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటి వివరాలు..
ఖాళీలు: మొత్తం పోస్టులు 3428 (ఎగ్జిక్యూటివ్-44, నాన్ ఎగ్జిక్యూటివ్-3384)
1. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు:
అసిస్టెంట్ మేనేజర్-44 (ఎలక్ట్రికల్-14, సివిల్-5, ఆపరేషన్స్-5, హెచ్‌ఆర్-3, ఫైనాన్స్-10, ఎస్ అండ్ టీ-7)
2. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు:
ఎ. స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్ (ఎస్సీ/టీవో)-662 (ఓపెన్-376, ఓబీసీ-104, ఎస్సీ-96, ఎస్టీ-86). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-95
బి. కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్ (సీఆర్‌ఏ)-1100 (ఓపెన్-556, ఓబీసీ-297, ఎస్సీ-165, ఎస్టీ-82). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-159
సి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-48 (ఓసీ-26, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-3). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-6
డి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్) -81 (ఓసీ-42, ఓబీసీ-21, ఎస్సీ-12, ఎస్టీ-6). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-11
ఇ. జూనియర్ ఇంజనీర్(మెకానికల్)-10
ఎఫ్. జూనియర్ ఇంజనీర్(సివిల్)-66 (ఓసీ-33, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-5). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-9
జి. అకౌంట్ అసిస్టెంట్-24
హెచ్. మెయింటెయినర్-1393 ((ఎలక్ట్రీషియన్-456 (ఓసీ-231, ఓబీసీ-123, ఎస్సీ-68, ఎస్టీ-34); ఫిట్టర్-243 (ఓసీ-134, ఓబీసీ-60, ఎస్సీ-33, ఎస్టీ-
16); ఎలక్ట్రానిక్ మెకానిక్-
602 (ఓసీ-327, ఓబీసీ-110, ఎస్సీ-87, ఎస్టీ-78), రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్-92 (ఓసీ-44, ఓబీసీ-22, ఎస్సీ-12, ఎస్టీ-14))
వేతనం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులకు నెలకు రూ.20,600-46,500 చెల్లిస్తారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఎస్సీ/టీవో పోస్టులకు రూ.13,500-25,520; సీఆర్‌ఏ, అకౌంట్ అసిస్టెంట్లకు రూ.10,170-18,500; జూనియర్ ఇంజనీర్లకు రూ.13,500-25,520; మెయింటెయినర్ పోస్టులకు 8000-14,140 చెల్లిస్తారు.
విద్యార్హత:
1.అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్/ఎస్ అండ్ టీ/సివిల్) పోస్టులకు 2016లో గేట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత బ్రాంచ్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
2.ఎస్సీ/టీవో పోస్టులకు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/తత్సమాన బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా (లేదా) బీఎస్సీ హానర్స్ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్) (లేదా) బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్).
3.సీఆర్‌ఏలకు మూడేళ్ల/నాలుగేళ్ల డిగ్రీతోపాటు కంప్యూటర్ లిటరసీ (కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు వారాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు)
4.జూనియర్ ఇంజనీర్‌లకు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా
5.మెయింటెయినర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ
వయసు:
(2016 జూలై 1 నాటికి)18-28 ఏళ్లు.
ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని అన్ని పోస్టులకు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని జూనియర్ ఇంజనీర్లకు మూడు దశల (రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు. ఎస్సీ/టీవో, సీఆర్‌ఏ పోస్టులకు నాలుగు దశల (రాత పరీక్ష, సైకలాజికల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా; మిగిలిన పోస్టులకు రెండు దశల (రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: ఓసీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.400; ఇతరులు రూ.150 చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15.
వెబ్‌సైట్: www.delhimetrorail.com