చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం..
శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు.
విజయాలు ‘అమేయం’..
2 దశాబ్దాల కెరీర్‌లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్‌లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్‌వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్‌లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్‌లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్‌మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్‌కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.
మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి
చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్‌లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని
సగర్వంగా చెబుతారు.
క్రూయిజ్ నుంచి సిటీ దాకా...
దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్‌లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment