Novotel
-
సీటీ చెఫ్.. టేస్ట్‌కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో సీఎం భేటీ
-
సీజేఐతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
9న నొవోటెల్ విజయవాడ ప్రారంభం
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడలో వరుణ్ గ్రూపు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న నొవోటెల్–వరుణ్ హోటల్‌ను ఈ నెల 9న ప్రారం భించనున్నట్లు వరుణ్ గ్రూపు అధినేత వి.ప్రభు కిషోర్ చెప్పారు. 2009లో ఆతిథ్య రంగం లోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి మరిన్ని గదు లను జత చేసుకుంటూ ముందుకెళుతున్నామని చెప్పారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘విజయవాడ హోటల్లో 227 విలాసవంతమైన గదులతోపాటు 4 ఫుడ్‌బేవరేజ్ అవుట్లెట్లు, 7 సమావేశ గదులు, 10 వేల చ. అ. విస్తీర్ణంలో బాంక్వెట్ హాలు ఉంటాయి. అకార్డ్ గ్రూపునకు చెందిన నొవోటెల్ బ్రాండుకు 20వ హోటల్‌గా ప్రారంభమవుతుంది. నొవోటెల్ సిగ్నేచర్ స్పా, రూఫ్‌టాప్ స్విమ్మింగ్ ఫూల్, ఫిట్నెస్ కోసం ఇన్–బ్యాలెన్స్ జిమ్‌తో పాటు దేశంలోని ఏ హోటల్లో లేనివిధంగా 200 మీటర్ల యూనీఫ్లో జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 కోట్లు వెచ్చించి కన్వెన్షన్ సెంటర్‌ను 2019 మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారాయన. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ బెల్లంకొండ మధు, హోటల్ మేనేజర్ టి.వి. మధుపాల్ పాల్గొన్నారు. -
అందమైన భామలు..లేత మెరుపుతీగలు
-
డిజైనర్ షో..
-
లవ్ పండుగ చేద్దాం ఇలా..
పెదగంట్యాడ : ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి నగరంలోని వివిధ రకాలు ఏర్పాట్లు జరిగాయి. అందులో కొన్ని మీకోసం... పార్క్ హోటల్లో ః ఆక్వా డైనింగ్ హాల్లో స్పెషల్ డిన్నర్ ఉంది. కుదరదనుకుంటే పార్క్ హోటల్లోనే విస్తా హాల్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం వైజాగ్ కమేడియన్ ఫీట్ పేరుతో ఒక షో సాయంత్రం జరుగుతుంది. నోవాటెల్‌లో ః ఇక్కడ కూడా ప్రేమికుల రోజు స్పెషల్ లంచ్ డిన్నర్‌తో పాటు నియోన్ మ్యూజికల్ ఫెస్టివల్ జరుగనుంది. కొత్త ప్రేమికులకు లైవ్ మెలోడీ సాంగ్స్‌తో విందు ఏర్పాటు చేస్తారు.. సిటీ దాటి వెళ్లాలనుందా... లంబసింగి డ్యామ్ దగ్గర ట్రైబల్స్ చలి కాలం చేసుకునే పండుగ ఉంది. అక్కడి గిరిజనులు ఉదయాన్నే డ్యామ్ దగ్గర పండుగ చేసుకుంటారు. ట్రావెలర్స్ చాలా మంది వెళ్లి పాల్గొంటారు. అక్కడ టెంట్లు కూడా దొరుకుతాయి. ఈ పండుగ ప్రేమికుల రోజు కూడా కావడంతో ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నారు. అరకు వెళదాం.. సాగా ట్రావెల్స్ అరకు వెళ్లడడానికి ప్రత్యేకంగా బస్‌ను ఏర్పాటు చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకుంటే ఎంచక్కా బస్ ఎక్కెయ్యోచ్చు. బెలూన్ బ్లాస్ట్.. బీచ్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. టీ ట్రైల్స్నే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లు దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాలైంటైన్స్ డే స్పెషల్ బెలూన్స్ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన దాన్ని పగలగొట్టొచ్చు. దానిలో వోచర్స్ ఉంటాయి. మీరు లక్కీ అయితే మీకు లంచ్, డిన్నర్లో డిస్కౌంట్ లేదా పూర్తి ఫ్రీగా కూడా పొందవచ్చు. -
అభిమానులూ... నా మాట వినండి!
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో ఫంక్షన్ చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో నిన్నటి వరకూ ఉన్నాం. మామూలుగా అయితే పాటలను ఓ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసేద్దామనుకున్నాం’’ అని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఆడియో వేడుకకు పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని కోరుతున్నానని చెప్పారు. ఆయన మాట్లాడుతూ- ‘‘నేను బయట అభిమానుల సమక్షంలో ఫంక్షన్లు నిర్వహించుకునే సంస్కృతికి బద్ధవ్యతి రేకిని. కానీ సినీ వ్యాపార విధానాలకు నేనూ లొంగక తప్పలేదు. ఈ ఆడియో ఫంక్షన్ నోవాటల్లో చేస్తామని పోలీస్ పర్మిషన్ అడిగినప్పుడు భద్రతాపరమైన సమస్యలున్నాయ న్నారు. మొదట నిజామ్ గ్రౌండ్స్‌లో చేద్దామనుకున్నాం. కానీ పోలీసులు అక్కడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. సినీ ఫంక్షన్‌గా మొదలై తర్వాత ఏ రూపం దాలుస్తుందోనని భయమేసింది. అందుకే నోవాటెల్‌లోనే చేస్తున్నాం. నిర్మాత శరత్ మరార్ నోవాటెల్‌లోని విదేశీ ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న భద్రతా చర్యలను పోలీసులకు వివరించి, అనుమతి పొందారు. అందుకే, పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. లేనివాళ్లు దయచేసి అక్కడ గూమిగూడవద్దని కోరుతున్నా’’ అన్నారు. ‘‘అభిమానులతో పాటు అసాంఘిక శక్తులు కూడా ఫంక్షన్‌కి వచ్చే అవకాశం ఉంది. అందుకే పాస్‌లు ఉన్నవాళ్ళే తప్ప, మిగిలినవారు రావద్దని ఫ్యాన్స్‌కు ప్రేమతో చెబుతున్నా. వాళ్లు కచ్చితంగా వింటారనుకుంటున్నా’’ అని పవన్‌కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కూ, మంత్రులు హరీశ్‌రావు, కె.టి.ఆర్ల సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు చిరంజీవి అతిథిగా రానుండడం గురించి ప్రస్తావిస్తూ, ‘‘గతంలో ‘గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు కూడా అన్నయ్య చిరం జీవి వచ్చారు. ‘జానీ’ తర్వాత నేను కథ-స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో మళ్లీ అన్నయ్యను ఈ వేడుకకు అతిథిగా పిలిచా’’ అన్నారు. ‘‘ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అంతా ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరుగుతుంది. దానికి కాస్త హిందీ టచ్ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని ఈరోస్ వాళ్లు డబ్బింగ్ చేస్తామని ముందుకు వచ్చారు. ఈ హిందీ వెర్షన్లో నేను ఏ పాటా పాడలేదు. నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదు’’ అని పవన్ వివరించారు. సినిమాల నుంచి తప్పుకుంటారని వస్తున్న వార్తలకు స్పందిస్తూ- ‘‘ ‘ఖుషి’ తర్వాత నాలుగు హిట్స్ వస్తే సినిమాలు మానేద్దామనుకున్నా. ఇప్పుడైతే నాకా ఉద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చారు. -
ప్రపంచ వ్యవసాయ సదస్సు తొలిరోజే గందరగోళం!
నిర్వాహకులపై రైతుల ఆగ్రహం ఉచితంగా అనుమతించాలని మంత్రితో వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: ప్రజల నిరాసక్తత, రైతు సంఘాల వ్యతిరేకతల మధ్య రాష్ట్ర రాజధాని నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో తొలిరోజే గందరగోళం చోటుచేసుకుంది. సదస్సుకు తమను ఉచితంగా అనుమతించాలంటూ కొందరు రైతులు వ్యవసాయమంత్రితో వాగ్వాదానికి దిగడం.. వ్యవసాయ, సమాచార పౌర సంబంధాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయలేమితో సభ్యుల జాబితాలో ‘ఆకాశవాణి’ వ్యవసాయ విభాగం సిబ్బంది సహా కొందరి పేర్లు గల్లంతు కావడం.. మీడియా పాస్‌ల జారీలో అయోమయం వంటి పరిణామాలతో గందరగోళం నెలకొంది. సోమవారమిక్కడి ‘నోవాటెల్’ హోటల్లో సభ్యుల నమోదు కార్యక్రమంతో వ్యవసాయ సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుందంటూ ఓ పత్రికలో వార్త రావడంతో అనంతపురం, ఒంగోలు తదితర జిల్లాల నుంచి కొంతమంది రైతులు వచ్చారు. అయితే సదస్సులో పాల్గొనాలంటే రూ.5,600 చెల్లించాల్సిందేనని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో వారు ఆ పత్రికలో వచ్చిన వార్తను చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన వైఎస్సార్సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలిసి వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని కలిశారు. రైతులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పి, తీరా ఇక్కడకు వచ్చాక రుసుం చెల్లించాలనడం ఏమిటని ఆయనతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 మంది అభ్యుదయ రైతులకు సదస్సులో ప్రవేశం కల్పిస్తామని, మరో 5వేల మంది రైతులను ‘అగ్రి ట్రేడ్ ఫెయిర్’కు తీసుకొస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని మంత్రి వివరణ ఇచ్చారు. రైతులు పేపర్ క్లిప్పింగ్‌ను కన్నాకు చూపించగా, తప్పుడు సమాచారంతో వార్త రాసినవారినే వివరణ అడగాలని సూచించారు. తప్పు ఎవరిదైనా, చాలా దూరం నుంచి వచ్చిన రైతులకు ఉచిత ప్రవేశం కల్పించాలన్న నాగిరెడ్డి విజ్ఞప్తిని మంత్రి తోసిపుచ్చారు. సభ్యత్వంలో సగం ప్రభుత్వ అధికారులే... ప్రపంచ వ్యవసాయ సదస్సులో పాల్గొనే సభ్యుల్లో సగానికి సగం మంది వ్యవసాయ యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖ అధికారులే ఉన్నారు. డెలిగేట్ల సంఖ్య తగ్గే అవకాశముందని భావించడంతో సదస్సు బోసిపోకుండా ఉండేం దుకు వ్యవసాయ వర్సిటీ, ఇతర అనుబంధ శాఖల నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను హాజరుపరిచారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్జీరంగా వర్సిటీ నుంచి 102 మంది, ఉద్యాన కళాశాల నుంచి 35, ఏపీఎల్డీఏ నుంచి 15 మంది, వెటర్నరీ కౌన్సెల్ నుంచి ఏడుగురు, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నలుగురు హాజరైనట్టు సమాచారం. మరోవైపు ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులు ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీవే. కాగా, సదస్సుకు 400 మంది ప్రతినిధులు హాజరవుతారని, అగ్రి ట్రేడ్ఫెయిర్లో 157 స్టాళ్లు ఏర్పాటవుతున్నాయని కన్నా తెలిపారు. ‘నోవాటెల్’లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ ప్రసాదరావు పరిశీలించారు. ఆకలిని రూపు మాపేందుకే: జేమ్స్ బోల్గర్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యాలు ఆందోళన కలిగించే అంశాలని న్యూజిలాండ్ మాజీ ప్రధాని, డబ్ల్యూఏఎఫ్ సలహా సంఘం అధ్యక్షుడు జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో తిండిగింజల ఉత్పత్తిని పెంచి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికే ఈ కృషి అని, ఒక గింజ పండే చోట రెండు గింజలు పండించడం ఎలా అన్నదానిపైనే ఈ మేధోమథనం అని వివరించారు. ఎమ్మెన్సీల మాజీలే డబ్ల్యూఏఎఫ్ సారథులు! అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయీస్ నగరంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల వ్యాపార వర్గాలతో కూడిన చిన్న బృందం 1997లో వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం(డబ్ల్యూఏఎఫ్)ను స్థాపించింది. వ్యవసాయ విధానాలపై చర్చాగోష్టులను నిర్వహించే తటస్థ సంస్థగా డబ్ల్యూఏఎఫ్ చెప్పుకుంటుంది. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ వ్యవసాయ సదస్సును నిర్వహిస్తుంటుంది. డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ కెన్నెత్ బెకర్‌తో పాటు సంస్థ బోర్డు సభ్యులందరూ బహుళ జాతి విత్తన కంపెనీలు, పురుగుమందుల కంపెనీల్లో పూర్వం కీలక పదవుల్లో ఉన్న వారే. అందువల్ల ఈ సంస్థ బహుళజాతి కంపెనీల (ఎమ్మెన్సీల) ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాల ప్రభుత్వాలను ప్రభావితం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ కెన్నెత్ బెకర్ గతంలో మోన్శాంటో సహా పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. డబ్ల్యూఏఎఫ్ వ్యవస్థాపక సభ్యులు లెనార్డ్ గుర్రాయ్ 1983 నుంచి 1997 వరకు అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ సీఈవోగా పనిచేశారు. మైఖేల్ కె.డోనె మోన్శాంటో కంపెనీలో డెరైక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిక్స్ అండ్ సస్టైనబిలిటీగా పని చేశారు. లిన్ ఒ.హెండర్సన్ హెండర్సన్ కమ్యూనికేషన్స్ ఎల్ఎల్సీ(అగ్రిమార్కెటింగ్) సంస్థ చైర్మన్, సీఈవోగా పనిచేశారు. డబ్ల్యూఏఎఫ్ సలహా సంఘానికి న్యూజిలాండ్ మాజీ ప్రధాని జేమ్స్ బోల్గర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులోనూ మోన్శాంటో కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన బ్రెట్ డి.మెగ్మన్ వంటి వారున్నారు. ఎన్జీరంగా వర్సిటీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కూడా ఈ సలహా సంఘంలో కొంతకాలం సభ్యులుగా ఉన్నారు. డబ్ల్యూఏఎఫ్ విధానాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని నిరసిస్తూ రాజీనామా చేశారు. -
టాటా సెజ్‌ను సందర్శించిన చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని టాటా కంపెనీని సందర్శించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో హెలికాప్టర్ విడిభాగాల తయారీ విధానాన్ని, ఆయూ పరికరాలను కేంద్రవుంత్రి పరిశీలించారు. హైదరాబాద్‌లో సినీ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి నోవాటెల్ హోటల్లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం నోవాటెల్ హోటల్లోనే బీమా ఎలక్ట్రానిక్ నిక్షిప్త సమాచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన చిదంబరం అనంతరం ఆదిభట్లలో టాటా సెజ్‌కు వెళ్లారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్‌తో పాటు లాకిడ్ మార్టిన్ సంస్థను కూడా సందర్శించారు. చిదంబరం పర్యటన దృష్ట్యా పోలీసులు ఆదిభట్ల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన చిదంబరాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నొవాటెల్ హోటల్ లో కలిశారు. -
16న రాష్ట్రానికి కేంద్ర మంత్రి చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11.15కు జరిగే ‘ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సిస్టమ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ ఠక్రూ కూడా రాష్ట్రానికి రానున్నారు.