టాటా సెజ్‌ను సందర్శించిన చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని టాటా కంపెనీని సందర్శించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో హెలికాప్టర్ విడిభాగాల తయారీ విధానాన్ని, ఆయూ పరికరాలను కేంద్రవుంత్రి పరిశీలించారు. హైదరాబాద్‌లో సినీ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి నోవాటెల్ హోటల్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం నోవాటెల్ హోటల్‌లోనే బీమా ఎలక్ట్రానిక్ నిక్షిప్త సమాచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన చిదంబరం అనంతరం ఆదిభట్లలో టాటా సెజ్‌కు వెళ్లారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లిమిటెడ్‌తో పాటు లాకిడ్ మార్టిన్ సంస్థను కూడా సందర్శించారు. చిదంబరం పర్యటన దృష్ట్యా పోలీసులు ఆదిభట్ల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన చిదంబరాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నొవాటెల్ హోటల్ లో కలిశారు.